News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

BJP Nadda Meeting : ఏపీలో ఉన్నది స్కాముల సర్కార్ - బీజేపీకి ఓ చాన్స్ ఇవ్వండి - కాళహస్తిలో జేపీ నడ్డా పిలుపు !

ఏపీలో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శించారు. బీజేపీకి ఓ చాన్సివ్వాలని ఏపీ ప్రజలను కోరారు.

FOLLOW US: 
Share:


BJP Nadda Meeting :  ఆంధ్రప్రదేశ్ లో అత్యంత అవినీతి ప్రభుత్వం ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా మండి పడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ  తొమ్మిదేళ్ల పాలనా విజయాలపై శ్రీకాళహస్తిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో  జేపీ నడ్డా ప్రసంగించారు.  ఏపీ ప్రభుత్వంపై ఘాటుగా విరుచుకుపడ్డారు. దేశంలోనే  మోస్ట్ అవినీతి పార్టి వైసీపి‌ పార్టీ తేల్చిచెప్పారు. ఏపీలో జరగని అవినీతే లేదన్నారు.  మైనింగ్ స్కాం, లిక్కర్ స్కాం, ఇసుక స్కాం, ఎడ్యుకేషన్ స్కాం వైసీపి హయాంలోనే జరుగుతుందోందన్నారు.  కేంద్రం ప్రభుత్వం నిజమైన అభివృద్ధి కోసం పని చేస్తుంది. ఇటువంటి అవినీతి ప్రభుత్వంను ఎక్కడా చూడలేదన్నారు.  నాలుగు ఏళ్ళుగా  రాష్ట్రంలో శాంతి భధ్రతలు ఎక్కడ కనిపించలేదన్నారు.  దేశంలో శాంతి‌ భధ్రతలను గాలికి వదిలేసిన రాష్ట్రం ఏపి మాత్రమేనని..  ఇటువంటి రాష్ట్ర ప్రభుత్వంను ఎక్కడ చూడలేదన్నారు. రాష్ట్రంలో‌ తప్పులు జరుగుతుంటే చూస్తూ ఊరుకోదని ప్రకటించారు. వైసీపీ చేతకాని తనం.. జగన్మోహన్ రెడ్డి వైఫల్యం వల్లనే ఏపీ రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందన్నారు.  ప్రధాని మోదీ శంకుస్థాపన చేసినా రాజధానిలో పనులు జరగడం లేదని..  భూములు ఇచ్చిన రైతుల్ని ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. 

రాజకీయాల్ని మోదీ మార్చేశారు : నడ్డా 
 

దేశంను మోదీ అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని..  గడిచిన తొమ్మిది ఏళ్ళ మోదీ మంచి పాలన ప్రజలకు సేవలు అందించామని నడ్డా తెలిపారు. ప్రధాని  దేశంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు..  ఓటు బ్యాంక్ కోసం, డబ్బు కోసం, అక్రమాల‌‌ కోసం ఇప్పటి వరకూ రాజకీయాలు చేసేవారని. .. కానీ మోదీ అలాంటి   రాజకీయాలను  మార్చేశారన్నారు.  రాజకీయాల్లో సరికొత్త మార్పుకు మోదీ శ్రీకారం చుట్టారని..  పేదల‌ పక్షపాతిగా మోదీ పాలన సాగిందన్నారు.  59 గ్రామాలకు మాత్రమే ఫైబర్ ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే, మోదీ వచ్చిన తర్వాత అన్ని గ్రామాలకు ఫైబర్ కనెక్షన్ ఇచ్చారని గుర్తు చేశారు.  రెండు లక్షల నిరుపేద గ్రామాలను మోదీ ప్రభుత్వం అభివృద్ధి చేశారన్నారు. ఐదు కోట్ల‌ మంది ప్రజలకు ఐదు రూపాయలకే బియ్యం అందిస్తున్నామని..  యాభై కోట్ల మంది‌ ప్రజలకు వైద్య సౌకర్యాల కోసం ఆయుష్మాన్ భవ  ద్వారా ఐదు లక్షల అందిస్తున్నామని జేపీ నడ్డా గుర్తు చేశారు. 
 

అన్ని రంగాల్లోనూ దేశం అభివృద్ధి

పేదల కోసం నాలుగు కోట్ల‌ ఇళ్ళు దేశ వ్యాప్తంగా నిర్మాణం జరుగుతుందోందన్నారు.  ప్రధాన మంత్రి ఆవాస యోజన పధకం ద్వారా డబుల్ బెడ్ రూం అందించామని..  పధకాలు ప్రవేశ పెట్టడమే‌కాదు వాటిని అమలు చేయడంలోనే నాయకత్వం బయట పడుతుందన్నారు.  జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి  ప్రారంభించి పేదల ఖాతాల్లో నేరుగా 21 వేల‌ 41 కోట్ల రూపాయలు జమ చేశామన్నారు. తొమ్మిది కోట్ల ఇళ్ళకు జలజీవన్ మిషన్ క్రింద నీటిని అందిస్తున్నామని.. 11 కోట్ల మంది రైతులకు  సాయం అందిస్తున్నామన్నారు.  రైతులకు అండగా నిలబడడం కాకుండా, రైతుల అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్నామని చెప్పారు.  గతంలో 92 శాతం మొబైల్ ఫోన్స్ ను విదేశాల నుండి‌ దిగుమతి చేసుకునే వాళ్ళం.. మోదీ వచ్చినప్పటి నుండి 97 శాతం సెల్ ఫోన్ తయారు చేసి విదేశాలకు త ఎగుమతి చేస్తున్నమని నడ్డా గుర్తు చేశారు. 

ఏపీలో బీజేపీకి ఒక చాన్సివ్వండి !

ఆటో మొబైల్ ఇండస్ట్రీలో నాలుగో స్ధానంలో ఇండియా ఉంది... దేశంలో అనేక‌ మోడ్రన్ స్కూల్స్‌ ను తీసుకొచ్చి పేదలకు ఉన్నత విద్యను అందించామన్నారు.  విశాఖపట్నంకు మోదీకి వచ్చిన సమయంలో  పది వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు భుమి పూజ చేశారన్నారు.   ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కోసం భరీగా నిధులు మంజూరు చేశారని..  ఎనిమిది‌ వేల‌ నలభై నాలు‌గు వేల కిలో‌మీటర్లు నేషనల్‌ హైవేలను నిరమించామన్నారు.  తిరుపతి‌ రైల్వేస్టేషన్ ను మూడు వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.  ఐఐటీ విద్యా సంస్థలు శ్రీకాళహస్తి లో నిర్మాణం జరుగుతుందని..  
కడప నుండి‌ రేణిగుంట వరకూ జరుగుతున్న నేషనల్ హైవే పనులు మోదీ‌ ఇచ్చిన‌‌ నిధులతోనే జరుగుతుందని గుర్తు చేశారు.  తిరుపతి, శ్రీకాళహస్తి ప్రజల‌ ఆశీర్వాదం బిజేపి, మోదీపై ఉండాలని..రాష్ట్రంలో బిజేపికి ఒక్క అవకాశం అందించాలని కోరుతున్నానని జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు.  

 

Published at : 10 Jun 2023 07:00 PM (IST) Tags: AP Politics BJP assembly in Kalahasti JP Nadda fire on Jagan

ఇవి కూడా చూడండి

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- అచ్చెన్న, అశోక్‌ సస్పెన్డ్‌

జగన్ సైకో- కాదు చంద్రబాబే సైకో- ఏపీ అసెంబ్లీలో వాగ్వాదం- అచ్చెన్న, అశోక్‌ సస్పెన్డ్‌

Breaking News Live Telugu Updates: రెండో రోజు కూడా ఏపీ అసెంబ్లీలో గందరగోళం- స్పీకడ్‌ పోడియం ముందు టీడీపీ ఆందోళన

Breaking News Live Telugu Updates: రెండో రోజు కూడా ఏపీ అసెంబ్లీలో గందరగోళం- స్పీకడ్‌ పోడియం ముందు టీడీపీ ఆందోళన

Top Headlines Today: అర్థరాత్రి రాజ్యసభలో మహిళా బిల్లుకు మోక్షం- అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్‌ కసరత్తు దాదాపు పూర్తి

Top Headlines Today: అర్థరాత్రి రాజ్యసభలో మహిళా బిల్లుకు మోక్షం- అభ్యర్థులపై తెలంగాణ కాంగ్రెస్‌ కసరత్తు దాదాపు పూర్తి

సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు, భారీగా తరలివచ్చిన భక్తులు

సర్వభూపాల వాహనంపై శ్రీనివాసుడు, భారీగా తరలివచ్చిన భక్తులు

Vizag Capital : విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

Vizag Capital :  విశాఖకు కార్యాలయాలు తరలింపు సాధ్యమేనా ? ప్రభుత్వ వ్యూహం ఏమిటి ?

టాప్ స్టోరీస్

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Telangana BJP : తెలంగాణ ఏర్పాటుపై మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు - కాంగ్రెస్‌కు ప్లస్ అవుతోందా ?

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Rajamundry Jail: రాజమండ్రి జైలులో ఖైదీ మృతిపై జైళ్ల శాఖ కీలక ప్రకటన - అసలు ఏం జరిగిందో చెప్పిన డీఐజీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Adilabad News: అంబులెన్స్ సిబ్బందికి హ్యాట్సాఫ్ - వర్షంలో రెండు కిలో మీటర్లు కాలినడకన వెళ్లి మహిళకు డెలివరీ

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!

Ram - Double Ismart Movie : రవితేజ 'ఈగల్' తర్వాత రామ్ 'డబుల్ ఇస్మార్ట్'లో గ్లామరస్ లేడీ!