By: ABP Desam | Updated at : 03 Dec 2022 12:37 PM (IST)
టీడీపీ, వైఎస్ఆర్సీపీ వల్లే ఏపీలో అభివృద్ధి జరగడం లేదన్న విష్ణు
BJP Vishnu On AP : ఇండియా అంతా అభివృద్ధి చెందుతూ ఉంటే ఏపీ మాత్రమే దారుణంగా వెనకుబడిపోతోందని ఏపీ బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితికి వైఎస్ఆర్‌సీపీ, టీడీపీనే కారణం అని మండిపడ్డారు. వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వ రాజకీయ ప్రతీకార చర్యలు, స్వార్థం, అవినీతి కారణంగా పరిశ్రమలు తరలి వెళ్లిపోతున్నాయని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో పరిశ్రమల్లో పెట్టుబడులు పెట్టాలంటే అధికార, ప్రతిపక్ష పార్టీలు చూసి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారన్నారు. కొంత మంది వైసీపీ నేతలు పరిశ్రమ యాజమాన్యాలు ను బెదిరిస్తే ముఖ్యమంత్రి స్పందించకపోవడం ..కట్టడి చేయడం దేనికి సంకేతమని ప్రశ్నించారు.
భయపెట్టి పారిశ్రామికవేత్తలను వెళ్లగొొడుతున్నారు !
వైసీపీ రాజకీయాలను, అభివృద్ధిని మిళితం చేసి రాష్ట్రం మరింత వెనుకబడేలా చేసిందని ఆగ్రంహ వ్యక్తం చేశారు. రాష్ర్టంలో అభివృద్దీ పై చర్చ జరుగకూండా… రాజకీయాలు పై రోజు చర్చ జరగాలని వైఎస్ఆర్‌సీపీ ఆలోచన చేస్తోందని.. టీడీపీ దాన్ని నెరవేరుస్తోందన్నారు. టీడీపీ, వైసీపీని బహిష్కరిస్తే తప్ప ఏపీ అభివృద్ధి చెందనని ఆయన అన్నారు.ఓ వైపు దేశం మొత్తం అభివృద్ధి చెందుతూంటే.. ఏపీ మాత్రం వెనకుబడిబోతోందన్నారు. కేంద్ర ప్రభుత్వంం వందల కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న తిరుపతి రైల్వేస్టేషన్ పనులు వేగంగా సాగుతున్న విషయాన్ని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్నారు.
ఏపీలో అభివృద్ధి నిరంతరం కొనసాగుతుంది రెండు ప్రాంతీయపార్టీలు, అవినీతి, రాజకీయఘర్షణలతో అభివృద్ధిని వెనక్కి నెట్టేస్తున్నారు.
తిరుపతిలో వేగంగా జరుగుతున్న అంతర్జాతీయ ప్రమాణాలతో రైల్వే స్టేషన్ నిర్మాణం పనులు. ధన్యవాదాలు శ్శీ @narendramodi ,శ్రీ @AshwiniVaishnaw గారు.#AndhraPradesh pic.twitter.com/P3Y6iPkkEe — Vishnu Vardhan Reddy (@SVishnuReddy) December 3, 2022
ఎలా రాజకీయాలు చేయాలో బీజేపీకి తెలుసు
ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉందని.. ఉంటుందని.. స్పష్టం చేశారు. బీజేపీకి ఎలా రాజకీయాలో తెలుసని.. ఎన్నికల సమయానికి పోత్తు పై కేంద్ర పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పోలవరాన్ని ఏటీఎంలా చేసుకుని టీడీపీ, వైసీపీ దోచుకున్నాయన్నారు. పోలవరంలో జరిగిన అవినితీని వైసిపి ఎందుకు భయటపెట్టడం లేదని ప్రశ్నించారు. గతంలో ఐదేళ్ల చంద్రబాబు కట్టలేదు , నేడు నాలుగేళ్ల జగన్ కట్టలేదన్నారు. రెండు పార్టీలు రాజకీయ నాటకాలు పోలవరం మీద ఆడుతున్నారని విమర్శించారు. 2024లో బిజేపి,జనసేనా కలసి ప్రభుత్వాని ఏర్పాటు చేస్తాం... పోలవరం పూర్తి చేస్తామన్నారు.
లిక్కర్ స్కాంలో వైసీపీ నేతల ప్రమేయం బయటపడింది
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏపీ ప్రముఖ నేతలు కూడా ఉన్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె కవిత లిక్కర్ స్కాంలో అడ్డంగా దొరికిపోయారని.. వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల ప్రమేయం కూడా బయటపడిందన్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు ఓ నిందితుడి రిమాండ్ రిపోర్టులో ఉండటాన్ని విష్ణువర్ధన్ రెడ్డి ప్రస్తావించారు.
పది రూపాయలు ఇచ్చి ఆ పని చేస్తున్నారు- బాలినేని కుమారుడిపై టీడీపీ సెటైర్లు
AP Cabintet : ఏపీ మంత్రి వర్గం కీలక నిర్ణయాలు - వాటన్నింటికీ గ్రీన్ సిగ్నల్
Kotamreddy Issue : అది ట్యాపింగ్ కాదు రికార్డింగే - మీడియా ముందుకు వచ్చిన కోటంరెడ్డి ఫ్రెండ్ !
Amaravati In LokSabha : ఏపీ రాజధానిపై కేంద్రం కీలక ప్రకటన - ఇక అడ్డంకులు తొలగిపోయినట్లేనా ?
MLA RK : మంగళగిరి ఎమ్మెల్యేకు చేదు అనుభవం - సమస్యలను పరిష్కరించట్లేదని అడ్డుకున్న జనం !
ఉదయగిరి ఎమ్మెల్యేకు గుండెపోటు- క్షేమంగా ఉన్నానంటూ వీడియో రిలీజ్
Cow Hug Day: వాలెంటైన్స్ డే మన సంస్కృతి కాదు, కౌ హగ్ డే జరుపుకోండి - కేంద్రం ఉత్తర్వులు
PM Modi Sadri Jacket: ప్రధాని మోదీ ధరించిన జాకెట్ ఎంతో స్పెషల్, ఎందుకో తెలుసా?
బందరు పోర్టు కోసం పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రుణం- 9.75 వడ్డీతో రూ. 3940 కోట్లు తీసుకోవడానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
RBI Policy: దాస్ ప్రకటనల్లో స్టాక్ మార్కెట్కు పనికొచ్చే విషయాలేంటి?