News
News
వీడియోలు ఆటలు
X

BJP On AP Governament : ఏపీలో అరాచక పాలన - నాలుగేళ్లలో రాష్ట్రం సర్వనాశనం అయిపోయిందన్న బీజేపీ !

ఏపీలో అరాచక పాలన జరుగుతోందని బీజేపీ మండిపడింది. నాలుగేళ్లలో రాష్ట్రం సర్వ నాశనం అయిపోయిందన్నారు.

FOLLOW US: 
Share:

BJP On AP Governament :    వైసీపి ఎంపి అవినాష్ రెడ్డి జైలు కెళ్ళడం ఖాయమని బిజెపి జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు.. బుధవారం తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.  వివేకానందరెడ్డి హత్య వెనుక ఎవరెవరు ఉన్నారో వారందరూ జైలు కెళ్ళక తప్పదన్నారు.  సిబిఐపైనే కేసులు పెట్టడం వైసిపి పాలనకు నిదర్శనమని,‌ మీడియాపై వైసిపి కార్యకర్తల దాడిని ఖండిస్తున్నానన్నారు.  జగన్ ను కాపాడాల్సిన అవసరం బిజెపికి లేదని స్పష్టం చేశారు. అవినాష్ రెడ్డిని కాపాడుతున్న అదృశ్య శక్తి జగన్మోహన్ రెడ్డేనన్నారు.  దేశ ప్రజలు బిజెపిని ఇంకా విశ్వసిస్తున్నట్లు చెప్పారు. కర్ణాటక ఎన్నికల్లో ఓడినా,‌ ఓట్ల శాతం మాత్రం బిజెపికి పెరిగిందని, ఎపిలో పొత్తుల విషయాన్ని అధిష్టానం చూసుకుంటుందన్నారు. పంచభూతాల్లో ఏ ఒక్క దాన్ని వదలకుండా వైసిపి నేతలు దోచేస్తున్నారన్నారు.. వైసిపి వైసిపి అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రాష్ట్రం సర్వనాశనమైందని మండిపడ్డారు. 

'అవినాష్ అరెస్టు ఇప్పట్లో కష్టమే, అడ్డుకునేందుకు జగన్ ఎంత దూరమైనా వెళ్తారు' 

ఏపీలో అరాచక, విధ్వంస పాలన కొనసాగుతోందని ధ్వజమెత్తారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి . విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.  ఊబిలోకి నెట్టేసినట్లు ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఆర్ధిక సంక్షోభంలో ఉందని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని కూడా అర్హులైన లబ్ధిదారునికి అందించకుండా వచ్చే నిధులను దారి మళ్లిస్తున్నార‌ని మండిప‌డ్డారు.. ప్రభుత్వ ఉద్యోగులకు కూడా ఒకటవ తారీఖున జీతాలు ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలందరూ ఈ పరిస్థితిపై ఆలోచించాలని చెప్పారు. ఉద్యోగస్తులందరూ ఈ జీతం మీదే ఆధారపడి తీసుకున్న వస్తువులపై బ్యాంకుల వద్దకు వెళ్లి ఈఏంఐ మీద కాస్త వెసులుబాటు కల్పించాలని ప్రాధేయపడే స్థితిలో ఉన్నారని వె ఎద్దేవా చేశారు.                                                                

విశ్వభారతి ఆస్పత్రి ముందు వైసీపీ శ్రేణుల ఆందోళన, ఎంపీ అవినాష్ కి కొంత సమయం ఇవ్వాలంటూ ప్లకార్డులు                                                

గ్రామాలకు 15 ఆర్థిక కమిటీ కింద కేంద్రం నేరుగా ఇస్తున్న సహకారాన్ని సైతం రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తోందని పురందేశ్వరి ఆరోపించారు. వైఎస్ఆర్‌సీపీని సమర్థించే సర్పంచులు సైతం. ఇవ్వాళ బయటకొచ్చి సోషల్ మీడియాలో, మీడియా ఎదుట తమ వనరుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటోందని గోడు వెళ్లబోసుకుంటున్నారని గుర్తు చేశారు.. దారి మళ్లించిన నిధులతో ఎక్కడైనా అభివృద్ధి చేశారా అంటే, అదీ లేదని మండిపడ్డారు. రాష్ట్రంలోని రోడ్లన్నీ గుంతలమయంగా తయారయ్యాయని, ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదని పేర్కొన్నారు. ఉద్యోగాలు లేక రాయలసీమ బిడ్డలు వలసపోతున్నారని తెలిపారు. ఇటువంటి పాల‌న తాను ఎన్న‌డూ చూడ‌లేద‌న్నారు. 

Published at : 24 May 2023 06:44 PM (IST) Tags: AP BJP satyakumar Purandeshwari BJP fire on YCP

సంబంధిత కథనాలు

Lokesh Rayalaseema Declaration :  రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే  రత్నాల సీమే !

Lokesh Rayalaseema Declaration : రాయలసీమ అభివృద్ధికి టీడీపీ డిక్లరేషన్ - అవన్నీ చేస్తే రత్నాల సీమే !

Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం

Lady VRO: చేతిలో పిల్లాడు ఉన్నా అక్రమ మైనింగ్‌ను అడ్డుకుని మహిళా వీఆర్వో సాహసం

Guntur: అరిష్టం పోగొట్టుకోడానికి గురూజీ దగ్గరికి మహిళ, శిష్యుల పాడు పని! పోలీసులకు ఫిర్యాదు

Guntur: అరిష్టం పోగొట్టుకోడానికి గురూజీ దగ్గరికి మహిళ, శిష్యుల పాడు పని! పోలీసులకు ఫిర్యాదు

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Nellore: మూగ యువతిపై ముగ్గురు అత్యాచారయత్నం! తెలివిగా స్పందించి తప్పించుకున్న బాధితురాలు

Udayagiri Treasure Mystery: చారిత్రక కోట ఉదయ'గిరి' గుప్తనిధుల కోసం ప్రాణాలు బలి!

Udayagiri Treasure Mystery: చారిత్రక కోట ఉదయ'గిరి' గుప్తనిధుల కోసం ప్రాణాలు బలి!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Odisha Train Accident: ఒడిశాలో మరో రైలు విషాదం, బోగీల కింద నలిగి ఆరుగురు మృతి!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

Dimple Hayathi Case: అరెస్ట్ చేయవద్దని నటి డింపుల్‌ హయతి పిటిషన్, హైకోర్టు ఏం చెప్పిందంటే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

10,000 టికెట్లు ఫ్రీ, ‘ఆదిపురుష్’ నిర్మాత కీలక నిర్ణయం - కేవలం వాళ్లకు మాత్రమే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!

IND VS AUS: టీమిండియాకు ‘హెడ్’ షాట్ - ఫైనల్ తొలి రోజు ఆస్ట్రేలియాదే!