Polavaram BJP : పోలవరం బాధ్యత కేంద్రానిదే - ఏపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లనే ఆలస్యమవుతోందన్న బీజేపీ !
ఏపీ సర్కార్ నిర్లక్ష్యం వల్లనే పోలవరం ఆలస్యం అవుతోందని బీజేపీ విమర్శించింది. ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదన్నారు.
Polavaram BJP : పోలవరం ప్రాజెక్ట్ అంశం తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ వివాదానికి కారణం అవుతోంది. ప్రాజెక్ట్ ముందుకు సాగకపోతూండటంతో పాటు కేంద్రం సహకరించడం లేదని నిధులు ఇవ్వడం లేదని ఏపీ అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలవరం జాతీయ ప్రాజెక్ట్. వంద శాతం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంది. కానీ ఎప్పటికప్పుడు ఆలస్యమవుతూండటం బీజేపీ నేతలకూ ఇబ్బందికరంగానే ఉంది. అందుకే తాజాగా బీజేపీ నేతలు పోలవరం ప్రాజెక్ట్ మా బాధ్యతని చెప్పడం ప్రారభించారు.
పోలవరం జాతీయ ప్రాజెక్టు.. పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే బీజేపి నేతల క్లారిటిగా చెబుతున్నాపు. ఏపీకి వెన్నుముక లాంటి పోలవరం ప్రాజెక్ట్ గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే ఆలస్యం జరుగుతోందని చెబుతున్నారు. కొత్త నినాదాలు, కొత్త వివాదాలకు ఇప్పుడు పోలవరం కేంద్రం గా మారిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. వీటికి జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణమన్నారు. ముంపు గ్రామాల ప్రజలు పక్క రాష్ట్రంలో కలుస్తామని అంటున్నారని ..రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి రోజుకొక ప్రకటన చేసి గందరగోళం సృష్టిస్తున్నారని మాధవ్ మండిపడ్డారు. ప్రజల్లో భరోసా కల్పించాల్సిన బాధ్యత జగన్ ప్రభుత్వానిదేనన్నారు. 15రోజులకు ఒకసారి కేంద్ర మంత్రి రివ్యూ చేస్తున్నారు, ఎక్కడ నిదులు ఆగాయో ... కేంద్రం నుంచి ఏ సహకారం రాలేదో చెప్పాలని మాధవ్ డిమాండ్ చేశారు.
పోలవరం అప్రోచ్ చానల్ పనులు పూర్తి చేయలేదు,వరద ముంపు లేకుండా డైవర్ట్ చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. అసందర్భ అంచానాల వల్ల నేడు గ్రామాలు మునిగి పోయాయన్నారు. నష్ట పరిహారం చెల్లించడానికి నివేదికలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు, మూడేళ్లుగా ఆర్ ఆర్ ప్యాకేజీ పై ఏపీ ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. రీయంబర్స్ మెంట్ సిస్టం వచ్చాక... నిధులు ఎక్కడైనా అగాయా, బిల్లు వరకు ఒక్క రూపాయి అయినా నిలిపారా చెప్పాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తమ తప్పులను కేంద్రం పై నెట్టడం సరి కాదు,సరైన సమయంలో లో వారిని ఖాళీ చేయించాల్సిందన్నారు.
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తే.. ఇంతమంది ముంపులొ ఉండే వారు కాదన్నారు. పునరావాసం ఇవ్వకుండా ఎలా ఖాళీ చేయిస్తారు,ప్రాజెక్టు వద్ద శిలాఫలకాలను పెట్టడం లొ ఉన్న శ్రద్ధ పూర్తి చేయడంలో లేదు,ఎక్కువ ముంపు చూపితే ఎక్కువ ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇస్తారని చూపించారు, పోలవరం కోసం ఎంత అప్పు చేశారో జగన్ ప్రభుత్వం చెప్పాలి,అనేక పధకాలకు అప్పులు తెచ్చిన జగన్... పోలవరం కు ఎందుకు ఖర్చు పెట్టలేదని ప్రశ్నించారు.
కాంట్రాక్టర్ ను మార్చడానికి పనులు కూడా ఆపేశారు, ఇప్పుడు ప్రాజెక్టు వ్యయం పెరగడానికి జగన్ ప్రభుత్వమే కారణం,పోలవరం జాతీయ ప్రాజెక్టు.. పూర్తి చేసే బాధ్యత కేంద్రానిదే,గతంలో తామే నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడంతో ఆలస్యం అయిన మాట వాస్తవం,సాధ్యమైనంత త్వరలో పోలవరం కేంద్రం పూర్తి చేసి తీరుతుందన్నారు.