YSRCP MP Ayodhya Ramireddy : టీడీపీ, బీజేపీల్ని పల్లెత్తు మాట అనని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి - వైసీపీలో ఉంటానని కూడా చెప్పట్లేదే ?
MP Ayodhya Ramireddy: పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం అని అయోధ్యరామిరెడ్డి ప్రకటించారు. రాజకీయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నారు.
![YSRCP MP Ayodhya Ramireddy : టీడీపీ, బీజేపీల్ని పల్లెత్తు మాట అనని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి - వైసీపీలో ఉంటానని కూడా చెప్పట్లేదే ? Ayodhya Ramireddy declared that the news that he is changing the party is untrue YSRCP MP Ayodhya Ramireddy : టీడీపీ, బీజేపీల్ని పల్లెత్తు మాట అనని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి - వైసీపీలో ఉంటానని కూడా చెప్పట్లేదే ?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/28/dc2738e2049cdf5f905c00990136cb601738056486617228_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
YSRCP: రాజీనామా చేస్తున్నట్లుగా ప్రచారం జరిగిన మరో వైఎస్ఆర్‌సీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి అదంతా ఫేక్ న్యూస్ అని ప్రకటించారు. విదేశాల నుంచి హైదరాబాద్ వచ్చి అక్కడి నుంచి ఆయన గుంటూరు చేరుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తన రాజీనామా అంశంపై జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తమేనన్నారు. రాజకీయాల్లో ఎగుడు దిగుళ్లు ఉంటాయని.. ఒత్తిళ్లు సహజంగానే ఉంటాయన్నారు. వాటిని తట్టుకుని నిలబడాలన్నారు.
విజయసాయిరెడ్డి చాలా మంది వ్యక్తి - వ్యవసాయం కోసం రాజీనామా చేశారు !
విజయసాయి రెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోవడం ఆయన ఇష్టమన్నారు. ఆయన ఎందుకు వెళ్లిపోయారో ఆయనే చెప్పారని తాను చెప్పేదం లేదన్నారు. అయితే విజయసాయిరెడ్డి చాలా మంచి వ్యక్తి అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత వైసీపీ నేతలపై ఒత్తిడి పెరిగిందన్నారు. ఎమ్మెల్సీలపై కూడా చాలా ఒత్తిడి ఉందని అయోధ్య రామిరెడ్డి చెప్పుకొచ్చారు.
Also Read: AP CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట, కేసుల బదలాయింపు పిటిషన్ కొట్టివేత
అయోధ్యరామిరెడ్డి రాంకీ గ్రూపు సంస్థల అధినేతగా ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయన వ్యాపారవేత్తగా ఉండేవారు. ఆ సమయంలో క్విడ్ ప్రో కో కింద జగన్ కు మేలు చేశారని అక్రమాస్తుల కేసుల్లో ఆయన పేర్లు కూడా నమోదయ్యాయి. తర్వాత వైసీపీలో చేరారు. నర్సరావుపేట నుంచి పోటీ చేసి ఓ సారి ఓడిపోయారు. తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే వైసీపీలో తెర వెనకు కీలక పాత్ర పోషిస్తూంటారు. గుంటూరు జిల్లా వైసీపీ ని ఆయనే చక్కదిద్దుతారని చెబుతారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన కూడా సైలెంట్ అయ్యారు.
పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా కనిపించని అయోధ్య రామిరెడ్డి
పార్టీ కార్యక్రమాల్లోనూ పెద్దగా కనిపించడం లేదు. ఇటీవల ఆయనకు కృష్ణా జిల్లా రీజనల్ కో ఆర్డినేటర్ గా జగన్ బాధ్యతలు ఇచ్చారు. అయినప్పటికీ ఆయన పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. ఇతర పార్టీల్లో చేరేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆయన వైసీపీలోనే ఉంటున్నారని కొంత మంది అంటున్నారు . ఫేక్ న్యూస్ అంటున్నారు కానీ.. వైసీపీ కోసం గట్టిగా మాట్లాడటం లేదని కొంత మంది ప్రచారం చేస్తున్నారు. అలాగే టీడీపీ, బీజేపీల్నీ పెద్దగా విమర్శించడం లేదు. అందుకే ఆయన తీరు కాస్త సందేహంగానే ఉందని రాజకీయవర్గాలు విశ్లేషిస్తున్నాయి.
Also Read: విజయసాయిరెడ్డి రాజీనామా తరువాత వైసీపీలో మిగిలిన రాజ్యసభ సభ్యులు ఎవరు ? జగన్ వ్యూహమేంటి!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)