Ayesha Meera Case: పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలి... రూ. 10 కోట్లు పరిహారం ఇవ్వాలని సత్యంబాబు డిమాండ్
ఆయేషా మీరా హత్య కేసులో తనను అన్యాయంగా 9 ఏళ్లు జైలులో పెట్టారని బాధితుడు సత్యం బాబు ఆరోపించారు. అందుకుగాను రూ.పది కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ఆయేషా మీరా హత్య కేసుపై జాతీయ ఎస్సీ కమిషన్‌లో గురువారం విచారణ జరిగింది. ఈ విచారణకు బాధితుడు సత్యం బాబు తరఫున జాతీయ మాల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బత్తుల రామ్ ప్రసాద్ హాజరయ్యారు. పోలీసుల తరఫున విజయవాడ డీఎస్పీ బి.వి సుబ్బారావు హాజరయ్యారు. విచారణ తర్వాత సత్యంబాబు మీడియాతో మాట్లాడారు. ఆయేషా మీరా హత్య కేసులో తనకు అన్యాయం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై 2017లో ఎస్సీ కమిషన్ లో పిటిషన్ వేశానన్నారు. తనకు న్యాయం చేయాలని ఎస్సీ కమిషన్ ను కోరానన్నారు. తనను అన్యాయంగా జైలులో పెట్టడం వల్ల తన కుటుంబం చాలా ఇబ్బందులు పడిందన్నారు. పోలీస్ వ్యవస్థ తనపై క్రిమినల్ అనే ముద్ర వేయడంతో తన కుటుంబ సభ్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని సత్యంబాబు తెలిపారు. ఈ విషయాన్ని ఎస్సీ కమిషన్ కు సత్యం బాబు తెలిపారు. తనను జైలుకు పంపడంతో బాధతో తండ్రి చనిపోయారని, తల్లి మతి స్థిమితం కోల్పోయారని సత్యంబాబు వాపోయారు. ఆయేషా మీరా హత్య కేసుకు సంబంధించి గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయలేదన్నారు.
Also Read: రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విషయం మర్చిపోయాయ్.. చిరు వ్యాఖ్యలు
ప్రభుత్వం స్పందించడంలేదు
ఎస్సీ కమిషన్ ముందు సత్యంబాబు వాదనలు వినిపించామని ఆ తరఫున హాజరైన బత్తుల రామ్ ప్రసాద్ తెలిపారు. హైకోర్టు తీర్పును అమలు చేయకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. సత్యం బాబుపై అక్రమంగా కేసులు పెట్టి 9 ఏళ్లు జైలులో పెట్టిన పోలీసులపై ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. సత్యం బాబు కోరినట్లుగా రూ. 10 కోట్ల పరిహారం ఇవ్వాలన్నారు. సత్యం బాబును ప్రభుత్వం ఆదుకోవాలని రామ్ ప్రసాద్ డిమాండ్ చేశారు. సత్యం బాబును ఆదుకోవడంపై ప్రభుత్వం స్పందించడంలేదని ఎస్సీ కమిషన్ కు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతిని కలిసి సత్యం బాబుకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని బత్తుల రామ్ ప్రసాద్ వెల్లడించారు. సీజేఐ.. సత్యంబాబుకు జరిగిన అన్యాయంపై సానుకూలంగా స్పందిస్తారని భావిస్తున్నట్లు తెలిపారు.
Also Read: అల్పపీడనం ప్రభావంతో దంచికొడుతున్న వానలు.. చెన్నై-పుదుచ్చేరి మధ్య శుక్రవారం తీరం దాటే అవకాశం
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి