AP News : సీఎం జగన్ తో అసంతృప్త నేతల భేటీ, ఎమ్మెల్యేలను బుజ్జగిస్తున్న వైసీపీ ముఖ్య నేతలు
AP News : ఏపీలో మంత్రి పదవులు దక్కని అసంతృప్తులను వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. ఒక్కొక్కరూ సీఎంతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇప్పటికే పిన్నెల్లి సీఎం జగన్ తో భేటీ అయ్యారు.
AP News : ఏపీలో కొత్త కేబినెట్ లో మంత్రి పదవులు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలకు(Serinor MLAs) బుజ్జగింపు పర్వం కొనసాగుతోంది. అసంతృప్తిలో ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులు, వైసీపీ ముఖ్య నేతలు(Ysrcp Leaders) వరుసగా కలుస్తున్నారు. వారికి నచ్చజెబుతున్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(Pinnelli Ramakrishna Reddy), జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మాజీ మంత్రి సుచరితను వైసీపీ నేతలు బుజ్జగిస్తున్నారు. పిన్నెల్లితో మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్యమంత్రి జగన్ సూచించినట్లు సమాచారం. మంత్రి పదవి దక్కకపోవడంతో పిన్నెల్లి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఒక దశలో రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. దీంతో పిన్నెల్లికి మంత్రి పదవి రాకపోవడానికి కారణాలను మంత్రి పెద్దిరెడ్డికి సీఎం జగన్ చెప్పారు. దీంతో పిన్నెల్లిని తాడేపల్లికి రావాలని మంత్రి పెద్దిరెడ్డి ఫోన్ చేసినట్లు సమాచారం. తాడేపల్లి(Tadepalli) వచ్చిన పిన్నెల్లి సచివాలయంలో పెద్దిరెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం పిన్నెల్లిని పెద్దిరెడ్డి ముఖ్యమంత్రి వద్దకు తీసుకెళ్లారు. కేబినెట్ లోకి తీసుకోలేకపోవడానికి కారణాలను పిన్నెల్లికి సీఎం జగన్(CM Jagan) వివరించారు.
సీఎంతో అసంతృప్తుల భేటీ
జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభానును కూడా వైసీపీ కీలక నేతల బుజ్జగిస్తున్నారు. ఇప్పటికే సామినేని ఉదయభాను(Samineni UdayaBhanu)తో ఎంపీ మోపిదేవి వెంకటరమణ భేటీ అయ్యారు. మంత్రివర్గంలో చోటు లభించకపోవడానికి కారణాలను ఆయన వివరించారు. అయితే ముఖ్యమంత్రి నుంచి హామీ వస్తేనే తాను సంతృప్తిగా ఉంటానని సామినేని చేసినట్లు సమాచారం. దీంతో మధ్యాహ్నం 3 గంటల తర్వాత సామినేని సీఎం జగన్‌ను కలవనున్నారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించిన మాజీ మంత్రి సుచరితతో వైసీపీ ముఖ్యనేతలు భేటీ అయ్యారు. ఆమె ఇప్పటికే సీఎం జగన్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం. ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబుతో కూడా వైసీపీ నేతలు చర్చిస్తున్నట్లు సమాచారం.
ఎలాంటి అసంతృప్తి లేదు : పిన్నెల్లి
పార్టీలో అసంతృప్తి లేని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. రాంబాబు, సామినేనితో కూడా మాట్లాడనన్నారు. రానున్న కాలంలో అన్నీ సద్దుమణుగుతాయన్నారు. పార్టీలో అందరికీ సముచిత స్థానం ఉంటుందన్నారు. మంత్రి పదవి రాలేదని ఎలాంటి అసంతృప్తి లేదని మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో పిన్నెల్లి భేటీ అయ్యారు. మీడియాతో మాట్లాడుతూ పార్టీనే తమదని, అసంతృప్తి ఎక్కడుంటుందని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి భేటీ ముగిసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన పిన్నెల్లి తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. అసంతృప్తి మీడియా సృష్టే అన్నారు. జగన్ తనకు బీ ఫారం ఇవ్వబట్టే గెలిచానన్నారు. సామాజిక సమీకరణాలు నేపథ్యంలో సీనియర్లకు మంత్రివర్గంలో చోటు లభించలేదన్నారు. 2024 ఎన్నికలు లక్ష్యంగా పనిచేస్తానన్నారు. సీఎం ఏ బాధ్యత అప్పగించినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పిన్నెల్లి అన్నారు.
Also Read : Pawan Kalyan: జనసేనాని భీమ్లా నాయక్ కాదు, బిచ్చం నాయక్ - మాజీ మంత్రి అనిల్ సెటైర్లు