అన్వేషించండి

Chandrababu Notice : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన, చంద్రబాబు, బోండా ఉమాకు మహిళా కమిషన్ నోటీసులు

Chandrababu Notice : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనపై వివరణ ఇవ్వాలని కోరింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని కోరింది.

Chandrababu Notice : టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మె్ల్యే బోండా ఉమామహేశ్వరరావుకు ఏపీ మహిళా కమిషన్‌ నోటీసులు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ పద్మ పట్ల అగౌరవంగా ప్రవర్తించారని ఆరోపణలతో ఈ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 27న విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అత్యాచార బాధితురాలని మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ శుక్రవారం పరామర్శించారు. అయితే ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు, మాజీ ఎమ్మె్ల్యే బోండా ఉమామహేశ్వరరావు, ఆ పార్టీ నేతలు ఆసుపత్రికి వచ్చారు. ఈ సమయంలో వాసిరెడ్డి పద్మ, చంద్రబాబుకు మధ్వ వాగ్వాదం జరిగింది. అనంతరం తనపై చంద్రబాబు, బోండా ఉమా అనుచిత వ్యాఖ్యలు చేశారని వాసిరెడ్డి పద్మ మీడియాతో మాట్లాడారు. 

Chandrababu Notice : విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి ఘటన, చంద్రబాబు, బోండా ఉమాకు మహిళా కమిషన్ నోటీసులు

అసలేం జరిగిందంటే? 

ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బాధితురాల్ని పరామర్శించేందుకు వెళ్లగా, అక్కడ ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ఆయనకు ఎదురుపడ్డారు. సామాన్య మహిళకు ఏపీ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయిందని, మీరు ఏం చేస్తున్నారంటూ వాసిరెడ్డి పద్మను చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. విజయవాడ సంఘటన ఏపీకే అవమానం అని వ్యాఖ్యానించారు. అమ్మాయి తండ్రి ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం వల్లే ఈ దారుణం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. కోటి రూపాయాలు బాధితురాలి కుటుంబానికి పరిహారంగా చెల్లించేలా చూడాలని డిమాండ్ చేశారు. వాసిరెడ్డి పద్మను టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో జీజీహెచ్‌లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న గ్యాంగ్‌ రేప్ బాధితురాలిని ఆంధ్రప్రదేశ్ మహిళాకమిషనర్‌ ఛైర్‌పర్శన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. బాధితురాలితో మాట్లాడి ధైర్యం చెప్పారు. కచ్చితంగా నిందితులకు శిక్ష పడేలా చేస్తామన్నారు. ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడిన ఆమె అండగా ఉంటామన్నారు. 

కరోనా డ్రామాలు అని టీడీపీ ఆరోపణలు

వాసి రెడ్డి పద్మ వచ్చిన సందర్భంగా విజయవాడ ప్రభుత్వాసుపత్రి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు వస్తున్నారని సమాచారం తెలిసిన తర్వాతే అధికార పార్టీ లీడర్లు మేల్కొన్నారని ఆరోపిస్తోంది టీడీపీ. ఇప్పటి వరకు నిందితులకు అండగా నిలిచిన అధికార పార్టీ లీడర్లు ఇప్పుడు బాధితురాలని పరామర్శించడం ఏంటని ప్రశ్నిస్తోంది టీడీపీ. వాసిరెడ్డి పద్మ పర్యటన అడ్డుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు టీడీపీ శ్రేణులు. ఆమె రాకను తప్పుపట్టారు. కరోనా వచ్చిందని నిన్నంత డ్రామాలు ఆడిన వాసి రెడ్డి పద్మ ఇప్పుడు ఎలా ఆసుపత్రికి వచ్చారని ప్రశ్నిస్తోంది టీడీపీ. ఒక్కరోజులోనే కరోనా తగ్గిపోయిందా అంటూ నిలదీస్తోంది. చంద్రబాబు వస్తున్నారనే భయంతోనే బాధితురాలిని పరామర్శించారని దుయ్యబట్టారు. బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించే సందర్భంలో గోబ్యాక్ వాసిరెడ్డి పద్మ అంటూ నినాదాలు చేశారు టీడీపీ శ్రేణులు. ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

YS Jagan On DSC 2025:
"డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ప్రభుత్వమే అంగీకరించింది, అందుకే సీబీఐ విచారణ చేయాలి" వైఎస్‌ జగన్ డిమాండ్ 
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
CM Chandrababu: సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
సదరన్ జోనల్ కౌన్సిల్ మీటింగ్.. రాష్ట్ర విభజన హామీలు ప్రస్తావించనున్న సీఎం చంద్రబాబు
AP Municipal Amendment Bill: మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
మేయర్, మున్సిపల్ చైర్మన్‌లకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు.. బిల్లుకు అసెంబ్లీ ఆమోదం

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Land Dispute:22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
22ఏ జాబితా భూముల చిక్కుముడి విప్పే పనిలో సర్కారు! పాత జాబితా వైపు అడుగులు! సమస్యకు ఫాస్ట్‌ట్రాక్‌ పరిష్కారం!
AB Venkateswara Rao: టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
టీడీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షం కన్నా ఎక్కువగా దాడి చేస్తున్న మాజీ ఐపీఎస్ ఏబీవీ - టీడీపీలో చేర్చుకోలేదనే ఇలా చేస్తున్నారా?
Pooja Hegde : రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
రెడ్ డ్రెస్‌లో బుట్టబొమ్మ - టాలీవుడ్ బ్యూటీ క్యూట్ లుక్
IPL Hardik Trade :  హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
హార్దిక్ ట్రేడింగ్ రూమ‌ర్స్ పై స్పందించిన గావ‌స్క‌ర్.. ఆ నిబంధ‌న‌లు పాటించాల‌ని సూచ‌న‌
Siddipet Road Accident: సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
సిద్ధిపేట జిల్లాలో ఘోర విషాదం! అదుపుతప్పి బావిలో పడ్డ కారు! ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!
Mister Middle Class OTT : రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
రెండు ఓటీటీల్లో మిస్టర్ మిడిల్ క్లాస్ - శ్రీకాంత్, లయ కొత్త మూవీ సడన్ స్ట్రీమింగ్
Congress Politics: మంత్రి కొండా సురేఖకు టీపీసీసీ షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు.. పార్టీ నుంచి జక్కిడి ప్రభాకర్ రెడ్డి సస్పెండ్
Ram Pothineni : 'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
'ఫుడ్, మందులు నేనే పంపిస్తా... ఆరోగ్యంతో రావాలి' - అభిమానికి హీరో రామ్ వీడియో కాల్
Embed widget