అన్వేషించండి

AP Rains Alert: ఏపీలో 2 రోజులపాటు పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు.. మరోవైపు నిప్పులు చెరిగే ఎండలు!

AP Weather | ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 6, 7 తేదీలో కొన్ని జిల్లాల్లో పిడుగుపాటు వర్షాలు, కొన్ని జిల్లాల్లో తీవ్రమైన ఎండలు ప్రభావం చూపుతాయని విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

Andhra Pradesh Weather Updates | అమరావతి: రానున్న 2 రోజులు ఆంధ్రప్రదేశ్‌లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకోనున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. సోమవారం, మంగళవారం మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరోవైపు కొన్ని జిల్లాల్లో ఎండలు ప్రభావం అధికంగా ఉంటుందని ప్రజలను హెచ్చరించారు. దక్షిణ కోస్తాంధ్ర -పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని ప్రఖర్ జైన్ తెలిపారు. రాయలసీమ, పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనము విస్తరించి ఉందని పేర్కొన్నారు.

వీటి ప్రభావంతో ఏప్రిల్ 6, 7 తేదీల్లో మేఘావృతమైన వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ముఖ్యంగా పొలాల్లో పని చేసే రైతులు, పశు కాపరులు చెట్ల కిందకు వెళ్లి నిల్చోవద్దని ఆయన హెచ్చరించారు.

సోమవారం, మంగళవారాల్లో ఏపీలో వాతావరణం ఇలా ఉంటుంది...

- శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్నిప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.

- ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు.

సోమవారం నాడు పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్ జిల్లా జి. కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపారు. 

40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు

ఆదివారం (ఏప్రిల్ 6) నాడు పార్వతీపురం మన్యం జిల్లాలోని వీరఘట్టం, నెల్లూరు జిల్లాలోని  నెల్లూరుపాలెంలో 42.4°C, తిరుపతి జిల్లాలోని రేణిగుంటలో 42.3°C, మార్కాపురం జిల్లాలోని నందన మారెళ్లలో 41.8°C, కడప జిల్లాలోని ఒంటిమిట్టలో 41.5°C, కృష్ణా జిల్లాలోని పెద్దపారుపూడిలో 41.3°C, చిత్తూరు జిల్లాలోని పలమనేరు, ప్రకాశం జిల్లాలోని చెరువుకొమ్ము పాలెంలో 40.9°C, కర్నూలు జిల్లాలోని తోవి, శ్రీకాకుళం జిల్లాలోని జి. సిగడాంలో 40.7°C, అనంతపురం జిల్లాలోని భట్టువానిపల్లిలో 40.5°C, పల్నాడు జిల్లాలోని గురజాలలో 40.4°C, విజయనగరం జిల్లాలోని సంతకవిటిలో 40.3°C, నంద్యాలలో 40.1°C చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు, 66 మండలాల్లో 40°C కుపైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ సూచించారు.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Janasena Committee On Balaraju:పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై పవన్ కల్యాణ్ సీరియస్.. అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం
పోలవరం ఎమ్మెల్యే బాలరాజుపై పవన్ కల్యాణ్ సీరియస్.. అవినీతి ఆరోపణలపై విచారణకు ఆదేశం
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations: బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం
బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు.. ప్లాన్ బీ తో ఎన్నికలకు కూటమి ప్రభుత్వం

వీడియోలు

Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు
USA Pacer Ali Khan Wide Ball | వైడ్ బాల్ నేరుగా సిక్స్ వెళ్ళిన వైనం! అమెరికా బౌలర్ అరుదైన రికార్డ్
India vs Pakistan Asian Games 2026 Final | భారత్ - పాకిస్థాన్ మ్యాచ్‌లో షేక్ హ్యాండ్ ఉంటుందా?
Gautam Gambhir Slams Flat Pitches vs WI | పిచ్‌ల తీరుపై గౌతమ్ గంభీర్ తీవ్ర అసహనం
Ishan Kishan Knock in Asian Games 2026 | శ్రీలంకపై ఘన విజయం సాధించి ఫైనల్‌లోకి భారత్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Govt Good News: జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
జీవో 59 దరఖాస్తుదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్‌‌‌న్యూస్‌, క్రమబద్ధీకరణకు అనుమతి
TVK Wins Tamil Nadu By Polls: తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
తమిళనాడు ఉప ఎన్నికల్లో టీవీకే ఘన విజయం.. సీఎం విజయ్ పాలనకు రాలిన ఓట్లు
Nobel Peace Prize 2026: భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
భారత సంతతి మహిళ నవనీతమ్ పిళ్లైకి నోబెల్ శాంతి పురస్కారం.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ ఇదే
EYES Web Series Review - 'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
'ఐస్' వెబ్ సిరీస్ రివ్యూ: సోనీలివ్ ఓటీటీలో మలయాళ వెబ్ సిరీస్... తెలుగులోనూ స్ట్రీమింగ్
AI Abuse Prevention: ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
ఏఐని వేధించడం ఇక కుదరదు.. క్లాడ్ కోసం ఆంథ్రోపిక్ కఠిన నిబంధనలు
Gade Saikrishna Custodial Death Case: గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
గాదె సాయికృష్ణది కస్టడీ హత్యే! దుప్పట్లో చుట్టి తరలించి మృతదేహం దహనం.. కోర్టుకు సిట్ ఛార్జిషీటు 
BC Reservations In AP: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగానైనా అమలు చేస్తాం: టీడీపీ కీలక ప్రకటన
Spiderman Brand New Day OTT : మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
మరో ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - ఏయే ప్లాట్ ఫామ్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందంటే?
Embed widget