AP Corona Cases: వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల.. కరోనా కేసుల వివరాలివే..
ఈ రోజు ప్రధాన వార్తలు

Background
ఏపీకి చేరుకున్న 5.76 లక్షల కోవిషీల్డ్ డోసులు
ఏపీకి మరో 5.76 లక్షల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. ఢిల్లీ నుంచి ఎయిర్ ఇండియా విమానంలో గన్నవరం విమానాశ్రయానికి ఈ వ్యాక్సిన్లు వచ్చాయి. వైద్య అధికారులు వ్యాక్సిన్లను గన్నవరంలోని స్టేట్ వ్యాక్సిన్ స్టోరేజ్ సెంటర్‌కు తరలించారు. తర్వాత 13 జిల్లాల ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లకు సరఫరా చేయనున్నారు.
ట్విట్టర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ
ట్విట్టర్ ఇండియా హెడ్ మనీష్ మహేశ్వరి బదిలీ చేస్తూ ట్విటర్ నిర్ణయం తీసుకుంది. ట్విటర్ ఇండియా ఎండీగా ఉన్న మనీష్ మహేశ్వరి అమెరికాకు బదిలీ అయ్యారు. మనీష్‌ను అమెరికాలో కంపెనీ రెవెన్యూ స్ట్రాటజీ, ఆపరేషన్స్ సీనియర్ డైరెక్టర్‌గా ట్విటర్ నియమించనున్నట్లు సమాచారం. ఇటీవల భారత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన కొత్త ఐటీ చట్టాలను అనుసరించి ఇండియా హెడ్‌గా మనీశ్ మహేశ్వరి నియమితులయ్యారు. కొత్త ఐటీ చట్టాలకు వ్యతిరేకంగా కొంత కాలం గళం విప్పింది ట్విటర్. గ్రీవెన్స్ అధికారిగా భారతీయుడినే.. నియమించాలనే నిబంధన అమలు చేసేందుకు కాస్త ఆలోచించింది. భారత ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పింది. చివరకు భారతీయుడినే గ్రీవెన్స్ అధికారిగా నియమించింది.
AP Corona Cases: వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల.. కరోనా కేసుల వివరాలివే..
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1,746 కరోనా కేసులు నమోదయ్యాయి. 20 మరణాలు నమోదయ్యాయి. మహమ్మరి నుంచి మరో 1,648 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,766 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వైరస్ కారణంగా చిత్తూరు జిల్లాలో నలుగురు, కృష్ణా జిల్లాలో ముగ్గురు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో ఇద్దరు చొప్పున చనిపోయారు. చిత్తూరులో 203, గుంటూరు-160, తుర్పు గోదావరి-304, విశాఖ-115, విజయనగరం-20, శ్రీకాకుళం జిల్లాలో 91 కేసులు నమోదయ్యాయి.





















