Breaking News Live Updates: ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 27న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
కడప జిల్లా బద్వేలు ఉపఎన్నిక ప్రచారానికి నేటితో తెర పడనుంది. నియోజకవర్గంలో రాజకీయం మరింత ఆసక్తికరంగా మారింది. 15 మంది అభ్యర్థులు బరిలో ఉన్నప్పటికీ వైసీపీ, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. అధికార పార్టీ నుంచి డాక్టర్ సుధ, భాజపా నుంచి పనతల సురేష్.. పోటీలో ఉన్నారు. రెండు పార్టీలు మరింతమంది కీలకనేతలను రంగంలోకి దించాయి. వైకాపా అభ్యర్థి తరఫున మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, సురేష్, ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యే రోజా సభలు నిర్వహిస్తూ ఓట్ల వేటలో నిమగ్నమయ్యారు.
హుజురాబాద్ లో పార్టీలు గెలుపు కోసం ఒకరిపై ఒకరు ఎత్తులు వేసుకుంటూ కాక రేపుతున్నారు. ‘దళిత బంధు’పై ఈటల రాజేందర్ ఎన్నికల సంఘానికి రాసినట్లుగా ఓ లేఖ వైరల్‌గా మారింది. ‘హుజురాబాద్ ఉపఎన్నిక కోసం టీఆర్ఎస్ రూ. 700 కోట్లు ఖర్చు పెడుతోంది, వివిధ పథకాల పేరుతో రూ.వేల కోట్లు గుమ్మరిస్తోంది. అందువల్ల ‘దళిత బంధు’ ఇతర పథకాలు ఆపేలా ఆదేశాలివ్వండి’ అంటూ ఈ నెల 24వ తేదీన ఈసీకి ఈటల రాసినట్లుగా ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ లేఖపై బీజేపీ, ఈటల అనచరులు మండిపడుతున్నారు. టీఆర్ఎస్ నేతలే ఫేక్ లెటర్ సృష్టించి ఈటలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. కౌంటర్ గా బీజేపీ కూడా అది ఫేక్ లెటర్ అంటూ మరో లేఖని, అందులో ఉన్న విషయాలను పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను గమనిస్తే అందులో పేర్కొన్న పిన్ కోడ్ జగిత్యాల జిల్లాలోని ఒక మండలానికి చెందిందని అలాంటప్పుడు అది హైదరాబాద్ కి చెందిన అడ్రస్ ఎలా అవుతుందని సదరు వివరణలో బీజేపీ పేర్కొంది. అంతేకాకుండా ఆ లేఖపై ఎలాంటి అధికారిక ముద్ర లేకపోవడం కూడా అనుమానాలకు తావిస్తోందని బీజేపీ ఐటీ విభాగం పేర్కొంది.
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడంతో కలవడం కుదరలేదని హోం శాఖ పేషీ అధికారులు చంద్రబాబు టీమ్‌కు సమాచారం అందించడంతో టీడీపీ అధినేత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగొచ్చేశారు. అయితే తాను జమ్మూకాశ్మీర్‌లో ఉండటంతో కలవటం కుదరలేదని చంద్రబాబుకు ఫోన్ కాల్ ద్వారా షా తెలిపినట్లు సమాచారం. ఏపీలో గంజాయి దందా, టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరిగిన దాడులను అమిత్ షాకు వివరించారు.
ముగిసిన హుజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం.. మూగబోయిన మైకులు
హజూరాబాద్, బద్వేల్ ఉప ఎన్నికల ప్రచారం బుధవారం రాత్రి 7 గంటలకు ముగిసింది. దాంతో మైకులు మూగబోయాయి. ప్రధాన పార్టీల ప్రచారం హోరాహోరీగా సాగింది. హుజూరాబాద్‌లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండగా, రెండు ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు. ఒక దాంట్లో 16, మరో దాంట్లో 16 మంది అభ్యర్థులకు ఓటు వేయవచ్చు. ఈ నెల 30న హుజూరాబాద్ పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 2న ఫలితాలు ప్రకటిస్తారు. బద్వేల్ ఎన్నికల బరిలో 15 మంది అభ్యర్థులు ఉన్నారు.
కామారెడ్డి జిల్లాలో ఫుడ్ పాయిజన్.. 50 మంది విద్యార్థులకు అస్వస్థత
కామారెడ్డి జిల్లా బిర్కూర్ మండల కేంద్రంలో ఫుడ్ పాయిజన్ కావడంతో 50 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. మండల కేంద్రంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం మధ్యాహ్నం భోజనం తిన్న తరువాత విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతో వారిని వెంటనే 108 అంబులెన్స్‌లో బాన్సువాడలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఆదిలాబాద్ ఉర్సు ఉత్సవాల్లో ఉద్రిక్తత.. ఇద్దరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
ఇచ్చోడ మండలంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా ఉర్సు ఉత్సవాల్లో గుండాలలో ఉద్రిక్తత తలెత్తింది. ఉర్సు డీజే విషయంలో గొడవ మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. మొత్తం 10 మందికి గాయాలు కాగా, సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇద్దరు ఎస్పీలు, ముగ్గురు డీఎస్పీలు సహా 350 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్..
టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముందుగా నిర్ణయించిన కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ ఉండడంతో కలవడం కుదరలేదని హోం శాఖ పేషీ అధికారులు చంద్రబాబు టీమ్‌కు సమాచారం అందించడంతో టీడీపీ అధినేత నిన్న సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగొచ్చేశారు. అయితే తాను జమ్మూకాశ్మీర్‌లో ఉండటంతో కలవటం కుదరలేదని చంద్రబాబుకు ఫోన్ కాల్ ద్వారా షా తెలిపినట్లు సమాచారం. ఏపీలో గంజాయి దందా, టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతలపై జరిగిన దాడులను అమిత్ షాకు వివరించారు.
కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ అందర్నీ కలిశాడు.. ప్రజలు మా వెంటే ఉన్నారు: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్ ప్రతి గ్రామంలోని విద్యార్థులు, నిరుద్యోగ యువతీయువకులు, రైతులు, ఇలా అన్ని వర్గాల ప్రజలను ప్రత్యక్షంగా కలిశాడని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కాంగ్రెస్ పార్టీ సైతం ప్రతి మండలానికి ఇన్ ఛార్జీలను తీసుకుని పెద్ద ఎత్తున పని చేశారని చెప్పారు. హుజూరాబాద్ నియోగజకవర్గంలోని ప్రజలంతా అభివృద్ధి గురించి ఆలోచిస్తున్నారని, కాంగ్రెస్ వెంట ప్రజలు ఉన్నారని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.