News
News
X

Breaking News Live Telugu Updates: ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు 

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

FOLLOW US: 
ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు!

AP Assembly Session : ఈ నెల 15 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఐదు రోజుల పాటు వర్షాకాల సమావేశాలు సమావేశాలు జరగనున్నాయి. 

ఏలూరులో యువకుడు ఆత్మహత్యాయత్నం- వైసీపీ లీడర్, పోలీసులపై ఆరోపణలు

ఏలూరు జిల్లా దెందులూరులో యువకుడి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వైసీపీ లీడర్, పోలీసులు వేధిస్తున్నారని సెల్ఫీ వీడియోలో వెల్లడించాడు. ఏలూరు జిల్లా  దెందులూరు నియోజకవర్గం శ్రీరామవరం గ్రామానికి చెందిన పప్పల సాయి పురుగు మందు తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. శ్రీరామవరం గ్రామసర్పంచ్ కామిరెడ్డి నాని, దెందులూరు పి.ఎస్ కానిస్టేబుల్ రమేష్ తనను వేధిస్తున్నారని ఆరోపించాడు. ఎస్పీకి తన వీడియోను పంపించాడు. అతన్ని ఏలూరు ఆసుపత్రికి తరలించారు బంధువులు 

అమరావతి రైతుల మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి 

అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లా అరసవల్లి వరకు అమరావతి రైతులు చేపట్టే మహాపాదయాత్రకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. దరఖాస్తును పరిశీలించి అనుమతి ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది న్యాయస్థానం. 

ఉద్రిక్తతలు తలెత్తే ప్రమాదం ఉందన్న కారణంతో పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమంటూ అర్థరాత్రి డీజీపీ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై విచారించిన హైకోర్టు పరిమిత ఆంక్షలతో పాదయాత్ర కొనసాగించవచ్చని సూచించింది. పోలీసులకు ఇప్పుడే దరఖాస్తు చేసుకోవాలని సూచించింంది. 

Laksmi Parvati: లక్ష్మీపార్వతికి సుప్రీం షాక్, పిటిషన్ కొట్టివేత
  • చంద్రబాబు ఆస్తులపై విచారణ జరపాలన్న పిటిషన్ కొట్టివేత
  • లక్ష్మీపార్వతి దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
  • ఒకరి ఆస్తులు తెలుసుకోవడానికి మీరెవరని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
  • హైకోర్టు అన్ని విధాలా ఆలోచించే పిటిషన్ కొట్టివేసిందన్న సుప్రీంకోర్టు
  • ఎవరి ఆస్తులు.. ఇంకొకరికి ఎందుకు తెలియాలని ప్రశ్నించిన ధర్మాసనం
  • మీరు లేవనెత్తిన అంశంలో విలువ లేదని పిటిషన్ ను డిస్మిస్ చేసిన సుప్రీంకోర్టు
Medchal: గుండ్లపోచంపల్లి మున్సిపల్ కార్మికులపై దాడి

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మినీ ట్యాంక్ బండ్ పై ఉన్న అక్రమ నిర్మాణాలను కూల్చివేయడానికి వెళ్లిన మున్సిపల్ సిబ్బందిపై రాజు గౌడ్ అనే వ్యక్తి విచక్షణ రహితంగా దాడి చేశాడు. అసభ్య పదజాలంతో బూతులు తిడుతూ వారితో గొడవకు దిగాడు. ఈ దాడిలో ఐదుగురు మున్సిపల్ కార్మికులు గాయపడ్డారు. అసభ్య పదజాలంతో తమను దూషించి, గాయపరిచిన రాజు గౌడ్ పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Amaravati Farmers మహాపాదయాత్రకు అనుమతివ్వని పోలీసులు, అర్ధరాత్రి డీజీపీ ఉత్తర్వులు

అమరావతిలో రాజధాని రైతులు అమరావతి నుంచి అరసవల్లి వరకు తలపెట్టిన మహాపాదయాత్రకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. రైతులు పాదయాత్ర చేయడం వల్ల శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందనే కారణంతో అనుమతి ఇవ్వడం లేదని ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి గురువారం అర్ధరాత్రి ఉత్తర్వులు ఇచ్చారు. ఉత్తర్వులను అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతి రావుకు పంపారు. పాదయాత్ర క్రమంలో ఏ చిన్న గొడవ జరిగినా అది పెద్ద సమస్యగా మారే ప్రమాదం ఉన్నందున, అన్ని అంశాలు విస్తృత ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ మహా పాదయాత్రకు అనుమతి ఇవ్వడం లేదని డీజీపీ ఆ ఉత్తర్వుల్లో వివరించారు.

Background

తెలుగు రాష్ట్రాల్లో రాగల రెండు రోజులు వర్షాల ప్రభావం అధికంగా ఉంది. ముఖ్యంగా ఏపీలో ఈ రెండు రోజులు భారీ వర్షాలు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. 

అమరావతి వాతావరణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. పశ్చిమ మధ్య, దానిని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఒక అల్ప పీడనం సెప్టెంబరు 8 ఉదయం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో రాగల 48 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడే అవకాశం ఉంటుంది. 

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తాం ఆంధ్ర, రాయలసీమల్లో చాలా చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గుంటూరు, క్రిష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షం ఒక చోట అత్యంత భారీ వర్షం కురిసే అవకాశ ఉంది. ప్రకాశం, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. 

రాయలసీమ ప్రాంతాల్లోని ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్ష సూచన ఉంది. నేడు ఉత్తర కోస్తా ఆంధ్ర, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో ఉరుములు, మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. కోస్తా తీరం వెంబడి ఈదురు గాలులు గంటకు 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో, అత్యధికంగా 65 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు వచ్చే 5 రోజులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఇప్పటికే సముద్రంలోనికి వెళ్లిన వారు వెంటనే తిరిగిరావాలని సూచించారు.

తెలంగాణలో వర్షాలు.. (Telangana Weather)

మరోవైపు, సముద్ర మట్టం వద్ద రుతుపవన ద్రోణి జైసల్మేర్‌, భోపాల్‌, గోండియా, జగదల్‌పూర్‌, కళింగపట్నం మీదుగా తూర్పు మధ్య బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతానికి వెళుతుందని అధికారులు తెలిపారు. ఒక ద్రోణి దక్షిణ కొంకణ్‌ నుంచి ఉత్తర కర్ణాటక, దక్షిణ తెలంగాణ, ఉత్తర కోస్తాంధ్ర మీదుగా బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రాంతంలోని సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతుందని అధికారులు వివరించారు. వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో శనివారం వరకు హైదరాబాద్‌ తో పాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ మేరకు మొదటి రెండు ప్రమాద హెచ్చరికలు (పసుపు, నారింజ రంగుల హెచ్చరికలు) జారీచేశారు.

జిల్లాల వారీగా వర్షాలు పడే ఛాన్స్ ఇలా..
నిజామాబాద్‌, జగిత్యాల, మంచిర్యాల, నిర్మల్‌, ఆదిలాబాద్‌, రాజన్న సిరిసిల్ల, కుమ్రంభీమ్‌ ఆసిఫాబాద్‌, కరీంనగర్‌, పెద్దపల్లి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు హెచ్చరించారు. ఖమ్మం, మహబూబాబాద్‌, నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌, వికారాబాద్‌, నాగర్‌కర్నూల్‌, సంగారెడ్డి, జోగులాంబ గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పసుపు రంగు హెచ్చరిక జారీ చేశారు. ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని చెప్పారు.

టాప్ స్టోరీస్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

MP Laxman on BRS Party: బీఆర్ఎస్ పార్టీ పేరుతో మునుగోడులో గెలిచి చూపించండి - ఎంపీ లక్ష్మణ్

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Chiranjeevi Vs Garikapati : చిరంజీవికి బేషరతుగా క్షమాపణ చెప్పాలి - గరికపాటిపై మెగా ఫ్యాన్స్ ఆగ్రహం

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Police Seized Money In Munugode: మునుగోడు నామినేషన్ల తొలిరోజే రెండు చోట్ల డబ్బు స్వాధీనం, నిఘా పెంచిన పోలీసులు

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!

Vijay Deverakonda Rashmika: రౌడీ బాయ్‌తో రష్మిక మాల్దీవులకు టూర్? ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ప్రత్యక్షమైన జంట!