అన్వేషించండి

ఎన్నికల ఫలితాలు 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Breaking News Live Telugu Updates:వెలిగొండ వ్యర్థాలపై రగడ- ఆంధ్రప్రదేశ్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

LIVE

Key Events
Breaking News Live Telugu Updates:వెలిగొండ వ్యర్థాలపై రగడ- ఆంధ్రప్రదేశ్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

Background

ఏపీ ప్రజలకు శుభవార్త. ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు  వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నేటి సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు ఏపీలోకి ప్రవేశిస్తాయని అమరావతి వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే తీర ప్రాంతాలన్ని దట్టమైన మేఘాలు కమ్మేశాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, యానాంలలో దిగువ ట్రోపో ఆవరణంలో పశ్చిమ దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. తూర్పు ఉత్తరప్రదేశ్ మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి దక్షిణ ఛత్తీస్ గఢ్ వరకు అల్పపీడన ద్రోణి సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. వీటి ప్రభావంతో మరో మూడు రోజులు ఏపీలో కొన్ని జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి. కొన్ని చోట్ల వేడి, ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. ఏపీలో కోస్తాంధ్రలో 2 నుంచి 4 డిగ్రీల వరకు కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. రాయలసీమలో వేడి గాలులు వీచడంతో పాటు తేలికపాటి జల్లులు పడతాయి.

ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో..
నైరుతి రుతుపవనాల రాకతో ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి సైతం ఈ ప్రాంతాలకు వర్ష సూచన ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం   జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు, పిడుగులు వడే అవకాశం ఉంది. పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని విశాఖ వాసులు జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ వెదర్ మ్యాన్ సైతం హెచ్చరించారు.

దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో..
ఈ ప్రాంతాల్లో మరో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, లేక ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు ఒకట్రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయి. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ జిల్లాలైన అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఓ వైపు వర్షాలు కురుస్తున్నా, మరోవైపు ఎండలు, ఉక్కపోతతో డీహైడ్రేషన్ కు గురయ్యే అవకాశం ఉందని ప్రజలకు సూచించారు.

తెలంగాణలో వడగాల్పులు, వర్షాలు..
తెలంగాణలో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.  ఆదిలాబాద్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో వడగాల్పులు వీచ్చే అవకాశం ఉంది. కొన్ని జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. ఉదయయం చల్లని గాలులు వీస్తుండగా.. మధ్యాహ్నం ఉక్కపోత ప్రభావం అధికంగా ఉంటుంది. హైదరాబాద్‌లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

17:23 PM (IST)  •  07 Jun 2022

Telangana Complaint Against AP: వెలిగొండ వ్యర్థాలపై రగడ- ఆంధ్రప్రదేశ్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు

ఆంధ్రప్రదేశ్‌పై కేఆర్‌ఎంబీకి తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఆంధ్రప్రదేశ్ అక్రమాలకు తెర తీస్తోందని కృష్ణానదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళి లెటర్‌ రాశారు. వెలుగొండ సొరంగం తవ్వకం మట్టిని శ్రీశైలంలోకి తరలించడంపై ఫిర్యాదు చేశారు. ఆ ప్రక్రియను ఆపాలని తన ఫిర్యాదులో మురళి పేర్కొన్నారు. 

ప్రకాశం జిల్లా దొర్నాల మండలంలో వెలిగొండ ప్రాజెక్టు పనులు చేస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఈ రెండో విడత పనుల్లో భాగంగా కార్మికులను సొరంగం లోపలికి పంపిస్తోంది. ఈ సొరంగం తవ్వేటప్పుడు వచ్చే వ్యర్థాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మధ్య వివాదానికి దారి తీస్తున్నాయి. సొరంగం తవ్వగా వచ్చే వ్యర్థాలను కొల్లంవాగు వద్ద ఉన్న అటవీ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ డంప్‌ చేస్తోందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. అక్కడి నుంచి ఆ వ్యర్థాలను రాత్రి వేళల్లో సైలెంట్‌గా లాంచీల్లో తీసుకెళ్లి నదిలో కలిపేస్తోందని తెలంగాణ చేస్తున్న ఆరోపణ. 

ఇలాంటి చర్యల వల్లే శ్రీశైలం తన సామర్థ్యాన్ని కోల్పోతుందని వివరించింది తెలంగాణ. కొన్ని ఏళ్ల నుంచి శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతోందని గుర్తు చేసింది. ఆ ప్రాజెక్టు వాస్తవ సామర్థ్యం 308.6 టీఎంసీలు అయితే.. ఇప్పుడు అది 215 టీఎంసీలకు పడిపోయిందని లేఖలో పేరొంది. వ్యర్థాలు నదిలో కలిసిన కారణంగా సుమారు వందల టీఎంసీల వరకు నష్టపోతున్నామని తెలిపారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న చర్యలు కూడా శ్రీశైలం నిల్వ సామర్థ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది తెలంగాణ. అలాంటి పరిస్థితి రాకుండా ఆంధ్రప్రదేశ్‌ను నిలువరించాలని రిక్వస్ట్ చేసింది తెలంగాణ. సరైన గైడెన్స్ ఇచ్చి శ్రీశైలం జలాశయాన్ని కాపాడాలని కోరింది. నదిలో వ్యర్థాలను డంప్ చేస్తున్న కాంట్రాక్టర్‌పై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్ చేసింది.  

16:55 PM (IST)  •  07 Jun 2022

అనంతబాబు బెయిల్‌ పిటిషన్ వాయిదా

డ్రైవర్ హత్య కేసులో అరెస్టైన వైసీపీ మాజీ లీడర్ అనంతబాబు బెయిల్ పిటిషన్ విచారణ 9కి వాయిదా పడింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. 

 

14:25 PM (IST)  •  07 Jun 2022

Narsipatnam MLA: ‘గడప గడపకు..’ లో సహనం కోల్పోయిన నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్

  • సహనం కోల్పోయిన ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్
  • నాతవరం మండలంలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొన్న నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్
  • నాతవరం మండలం పెద గొలుగొండ పేట గ్రామంలో ఆసరా పథకం మంజూరు చేయలేదని విన్నవించుకున్న మహిళలు
  • ఎమ్మెల్యే తో విన్నవించుకునే సమయంలో MLAను ప్రశ్నించిన గ్రామ తెలుగు దేశం పార్టీ నాయకులు 
  • దీంతో సహనం కోల్పోయిన ఎమ్మెల్యే గణేష్  
  • మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడుపై  విమర్శలు
  • ఈ దశలో ఘర్షణ వాతావరణం.. దీంతో జనాలను చెదరగొట్టిన పోలీసులు
13:26 PM (IST)  •  07 Jun 2022

Fishes Lorry Accident: చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా

Kothagudem: కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో జాతీయ రహదారిపై చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఇది రహదారి పక్కనే పడిపోవడంతో ప్రజలు, స్థానికులు ఒక్కసారిగా గుమిగూడారు. చేపల లోడు మొత్తం కింద పడిపోవడంతో నిమిషాల్లో సరకు మొత్తాన్ని ఖాళీ చేశారు. కింద పడ్డ చేపలను ఎత్తుకుపోయారు.

11:51 AM (IST)  •  07 Jun 2022

Telangana Congress: నాంపల్లిలో ఎక్సైజ్ కార్యాలయం ముట్టడి

  • నాంపల్లి లో ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడించిన కాంగ్రెస్ ఫిషర్ మెన్ కమిటీ నాయకులు
  • టీపీసీసీ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ మెట్టు సాయి అధ్వర్యంలో మెరుపు ముట్టడి
  • మెట్టు సాయి కుమార్ తో పాటు నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు
  • గోషామహల్ పోలీస్ స్టేషన్ కి తరలింపు

‘‘తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ తాగుబోతుల తెలంగాణ గా మార్చారు. మద్యం వల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు పెరిగాయి. రాష్ట్రంలో విచ్చల విడిగా మద్యం షాపులు పెరిగాయి. మైనర్ పిల్లలు కూడా మద్యానికి బానిసలు అవుతున్నారు. దీనివల్లనే రాష్ట్రంలో అత్యాచారాలు పెరుగుతున్నాయి.’’ అని  మెట్టు సాయి కుమార్, పీసీసీ ఫిషర్ మెన్ కమిటీ చైర్మన్ అన్నారు.

Load More
New Update
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పెర్త్ టెస్ట్‌లో సెంచరీ చేసిన విరాట్ కోహ్లిపెర్త్ టెస్ట్‌లో లబుషేన్ తో కామెడీ చేసిన యశస్వి జైస్వాల్161 పరుగులతో దుమ్మురేపిన యశస్వి జైస్వాల్నిర్మల్‌లో బిగ్ అలర్ట్! అక్కడికి మళ్లీ పెద్దపులి

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Minister Lokesh: 'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
'జగన్ రెడ్డి సుద్దపూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉంది' - బకాయిలు పెట్టి నీతులు చెబుతున్నారంటూ మంత్రి లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్
Pushpa 2 Kissik Song: కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
కిస్సిక్ వచ్చిందిరోయ్... 'పుష్ప 2' స్పెషల్ సాంగుతో బాక్సులు బద్దలవ్వాలి అంతే!
Ration Cards: ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
ఏపీలో రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్ - ఈ తేదీల్లో అప్లై చేసుకోవచ్చు, పూర్తి వివరాలివే!
Dogs Barasala: కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
కుక్కపిల్లకు ఘనంగా బారసాల - బంధువులకు విందు భోజనం పెట్టి మరీ..
Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Telangana News: ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
ఈఎంఐ కట్టాలంటూ ఫైనాన్స్ సంస్థ వేధింపులు - బైక్‌కు నిప్పు పెట్టిన యువకుడు, ఎక్కడంటే?
JC Prabhakar Reddy: 'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
'రోడ్డు ప్రమాదాలకు కారణం ఆటోలే' - త్రీవీలర్స్ బ్యాన్ చేయాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Elon Musk News: భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
భారత్‌లో ఎన్నికల ప్రక్రియపై ఎలాన్ మస్క్ ప్రశంసలు, అమెరికాకు చురకలు
Embed widget