Achchennaidu : మద్యం అమ్మకాల లెక్కలు మాయం - సీఎస్‌కు అచ్చెన్నాయుడు ఘాటు లేఖ !
Liquor Sales Details : మద్యం అమ్మకాల వివరాలను వెబ్ సైట్ నుంచి తొలగించడంపై సీఎస్‌కు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. దీని వెనక కుట్ర ఉందని అధికారుల్ని బలి చేయవద్దన్నారు.
Achchennaidu letter to CS : మద్యం అమ్మకాల లెక్కలను వెబ్ సైట్ నుంచి తొలగించడంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డికి లేఖ రాశారు. దీని వెనుక భారీ కుట్ర ఉందని ఆయన ఆరోపించారు. మద్యం అమ్మాకల డబ్బును హవాలా రూపంలో తరలించడానికి.. ఎన్నికల సమయంలో మద్యాన్ని వైసీపీ నేతలు విచ్చలవిడిగా వినియోగించాడనికి లెక్కలను మాయం చేశారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఈ విషయంలో అధికారుల్ని బలి పశువుల్ని చేస్తున్నారని తక్షణం పారదర్శకంగా వివరాల్ని బయట పెట్టాలన్నారు.
ఏపీలో రాష్ట్రంలో ఎంత మద్యం అమ్ముతున్నారు? జిల్లాల వారీగా ఎంత? డిపోల వారీగా ఎంత? మద్యం పరిమాణం, విలువ ఎంత? అనే వివరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో సీఎం డ్యాష్‌బోర్డును ప్రారంభించినప్పటి నుంచి అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ప్రతిరోజూ రాష్ట్రంలో మద్యం డిపోల నుంచి షాపులకు ఎంత మద్యం వెళ్తోంది, వాటి పరిమాణం, విలువ, తద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వచ్చింది, మద్యం కేసుల వివరాలు కూడా బహిర్గతం అయ్యాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆదాయం, కేసుల వివరాలు వెబ్‌సైట్ నుంచి తొలగించారు. మద్యం అమ్మకాల వివరాలు మాత్రం ఉంచారు.
అయితే ఇటీవల ఆ వెబ్‌సైట్‌ను తొలగించారు. దీంతో రోజువారీ మద్యం అమ్మకాల వివరాలు, మొత్తం ఎంత అమ్మారు? అనేవి ప్రభుత్వానికి తప్ప ఎవరికీ తెలియకుండా పోయాయి. మద్యం అమ్మకాల వివరాలను రహస్యంగా మార్చడం వెనుక కుట్ర ఉందని టీడీపీ అనుమానిస్తోంది. ఎన్నికల సమయంలో మద్యం అమ్మకాలపై ఆంక్షలు ఉంటాయి. ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యాక గతేడాది ఇదే సమయంలో ఎంత మద్యం అమ్మారో ఇప్పుడు కూడా అంతే అమ్మాలి. అంత దాటి అమ్మితే సంబంధిత జిల్లాల అధికారులు ఎన్నికల కమిషన్‌కు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈసీకి ఫిర్యాదులు వెళ్లకుండా వివరాలు దాచేశారని టీడీపీ ఆరోపిస్తోంది.
ఎన్నికల్లో మద్యానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. అన్ని పార్టీలు మద్యం పంపిణీలో నిమగ్నం అవుతాయి. అందుకే ఆ సమయంలో పార్టీలే మద్యం కొనుగోలు చేస్తాయి. ఇప్పటికే మద్యం అమ్మకాలపై లెక్కలేనన్ని ఆరోపణలుు టీడీపీ నేతలు చేస్తున్నారు. మద్యం అమ్మకాలు పూర్తిగా ప్రభుత్వ కనుసన్నల్లోకి వెళ్లిపోవడం వల్ల అనేక అనుమానాలు వ్యక్తం చే్సతున్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా అధికార పార్టీకే ఎక్కువ మద్యం అమ్మేందుకు మార్గం సుగుమం చేశారు. ఆ వివరాలు బయటికి పొక్కకుండా ముందు జాగ్రత్తగా వివరాలన్నీ తీసేశారుని లేఖలో అచ్చెన్నాయుడు ఆరోపించారు. తక్షణం వివరాలను బయట పెట్టాలని డిమాండ్ చేశారు.