News
News
X

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ స్కాం - శ్రీకాంత్ అర్జాకు నోటీసులు

ఏపీ స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో మరో మలుపు చోటు చేసుకుంది. శ్రీకాంత్ అర్జాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.

FOLLOW US: 
Share:

ఏపీ స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో మరో మలుపు చోటు చేసుకుంది. శ్రీకాంత్ అర్జాకు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం...
ఏపీఎస్‌డీసీ ఎండీగా వ్యవహరించిన శ్రీకాంత్ అర్జాకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. దాదాపు రూ.330 కోట్ల రూపాయల నిధులు దారి మళ్లించిన సూత్రధారులు ఎవరనే కోణంలో ఫోకస్‌ చేస్తున్నారు. అవినీతి సొమ్మును రాబట్టడమే తమ ప్రధాన లక్ష్యమని స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ చైర్మన్ అజయ్‌రెడ్డి చెబుతున్నారు.
ఏం జరుగుతుందో....
స్కిల్ డెవలప్‌ మెంట్ స్కామ్‌లో ఊహించని మలుపు చోటు చేసుకుంది.అదికారులకు నోటీసులు జారీ చేయటం పై ఉత్కంఠత ఏర్పడింది. 330 కోట్ల నిధులు దారిమళ్లించిన సూత్రధారులు
 ఎవరనే కోణంలో సీఐడీ దర్యాప్తు చేస్తున్న తరుణంలో ఇలాంటి నోటీసులు జారీ కావటం వెనుక ఉన్న అంతర్యం ఎంటనేది ప్రశ్నగా మారింది. ఆనాటి సంస్థ ఎండీ శ్రీకాంత్‌ అర్జాను విచారించాలని అధికారుల నిర్ణయం లో భాగంగానే ఆయనకు నోటీసులు జారీ చేశారని అంటున్నారు. అయితే ఇది ఇంతటితో ఆగుతుదా లేక మరెన్ని మలుపులు తీసుకుంటుందన్నది చర్చనీయాశంగా మారింది.
టీడీపీ కౌంటర్...
ఈ వ్యవహరం పై తెలుగు దేశం పార్టి ఎదురు దాడిని ప్రారంభించింది. ఏపీ సీఎం వైఎస్ జగన్‌ ప్రభుత్వం తెలుగు దేశం నాయకత్వం పై ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేస్తోందని టీడీపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పిన తర్వాతే.. సీమెన్స్‌కు ప్రభుత్వ వాటా సొమ్ము చెల్లించారని అచ్చెన్నాయుడు అంటున్నారు. ఏపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నంలో భాగంగానే ఇలాంటి ట్రిక్స్ ను ఫాలో అవుతున్నారా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆయన ప్రశ్నించారు.
అసలు విషయం ఏంటంటే...
ఆంధ్రప్రదేశ్ విభజన తరవాత నూతన రాష్ట్రంగా ఏర్పాటు జరిగిన తరవాత అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హయాంలో సీమెన్స్‌తో కలిసి శిక్షణ ఇస్తామంటూ 3300 కోట్ల రూపాయల ప్రాజెక్టు చేపట్టారు. ఒప్పందం మేరకు ప్రభుత్వం 10శాతం చెల్లింపులు చేసింది. మిగతా 90 శాతం సీమెన్స్‌ చెల్లించకుండా.. సర్కార్‌ సొమ్మును సైతం షెల్‌ కంపెనీలకు మళ్లించారన్నది అభియోగం. ఎలైట్‌ కంప్యూటర్స్‌, స్కిల్లర్‌ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌, నాలెడ్జ్‌ పోడియం, ఈటీఏ- గ్రీన్స్‌, కేడన్స్‌ పార్టనర్‌ తదితర కంపెనీలకు 240 కోట్లు రూటింగ్‌ అయిందంటున్నారు సంస్థ ప్రస్తుత చైర్మన్ అజయ్‌రెడ్డి.
సీమెన్స్‌ ఓ ఇంటర్నేషనల్‌ కంపెనీ. తమ పేరుతో కొందరు మోసానికి పాల్పడ్డారని ఆ సంస్థ చెప్పిందని అజయ్‌రెడ్డి చెప్తున్నారు. ఈ ఆధారాల సాయంతో మరికొందరి అరెస్టులు తప్పవంటున్నారు. ప్రజల సొమ్మును తిరిగి రాబట్టడమే లక్ష్యమంటున్నారు.
సీమెన్స్ మాజీ ఉద్యోగి ద్వారా...
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ స్కాంలో ఇప్పటికే మరో అరెస్టు కూడా జరిగింది. సిమెన్స్ మాజీ ఉద్యోగి జీవీఎస్ భాస్కర్ ను సీఐడి అదుపులోకి తీసుకుందని చెబుతున్నారు. నోయిడాలో భాస్కర్ ను  అరెస్టు చేసి ట్రాన్సిట్ వారంట్ పై విజయవాడ కోర్టులో ప్రవేశపెట్టనున్నట్లు అదికార వర్గాలు చెబుతున్నాయి. సిమెన్స్ సంస్థ రూపొందించిన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ప్రాజెక్టు ధరను కృత్రిమంగా పెంచడంలో భాస్కర్ కీలక పాత్ర పోషించాడనే ఆరోపణలు ఉన్నాయి. ప్రోగ్రామ్ అసలు ధర రూ. 58 కోట్లు కాగా, దానిని రూ.3,300కోట్లుగా ప్రభుత్వానికి చూపించాడు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వంలోని పెద్దల సహాయంతో స్కిల్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ప్రాజెక్టులో మోసాలకు పాల్పడ్డారని అభియోగం. రూ.3,300కోట్లను ప్రాజెక్టు ధరగా నిర్ణయించి ప్రభుత్వ వాటా కింద రూ.371కోట్లు అక్రమాలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి.

సిమెన్స్ సంస్థతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఎంవోయూలోని అంశాలను సైతం భాస్కర్ పూర్తిగా మార్చేశాడని అంటున్నారు. రూ.3,300 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా కింద 371కోట్లు ఇవ్వాల్సి ఉండగా.. ప్రైవేటు సంస్థలు మిగిలన వ్యయం భరించాలి. ప్రైవేటు వాటా డబ్బుకు సంబంధించి ఎంవోయూలో ఎలాంటి ప్రస్తావన లేకుండా.. కేవలం ప్రభుత్వం వాటా రూ.371 కోట్ల వర్క్ ఆర్డర్ ను విడుదల చేసేందుకు భాస్కర్ అనధికార చర్యలకు పాల్పడ్డారని కూడ ప్రచారం జరుగుతోంది.

Published at : 09 Mar 2023 06:56 PM (IST) Tags: AP Skill development Scam AP CID Police Siemens AP Updates AP Skill Development Corporation Scam case

సంబంధిత కథనాలు

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Gudivada News : గుడివాడలో పోలీస్ వర్సెస్ వీఆర్వో- చేయి కొరికిన వీఆర్వో, చెంపపై కొట్టిన లేడీ కానిస్టేబుల్

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

Breaking News Live Telugu Updates: ముగిసిన ఈడీ విచారణ, 10 గంటలకు పైగా కవితను ప్రశ్నించిన అధికారులు

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

AP ICET 2023 Application: ఏపీ ఐసెట్ - 2023 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం, చివరితేది ఇదే!

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

ED Notices To MP Magunta : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు, వైసీపీ ఎంపీ మాగుంటకు మరోసారి ఈడీ నోటీసులు

Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు

Pawan Kalyan Comments: అసెంబ్లీలో గోరంట్లపై వైసీపీ నేతల దాడి, ప్రజాస్వామ్య వాదులంతా ఖండించాలని పవన్ పిలుపు

టాప్ స్టోరీస్

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

KCR Message: మీరే నా బలం! మీరే నా బలగం!! బీఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ ఆత్మీయ సందేశం

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

Visakha Metro Rail : విశాఖ మెట్రో ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రాలేదు, జీవీఎల్ ప్రశ్నకు కేంద్రం క్లారిటీ!

KTR Vs Revanth : కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

KTR Vs Revanth :  కేటీఆర్‌కు నోటిసివ్వకపోతే హైకోర్టుకు వెళ్తా - సిట్ తీరుపై రేవంత్ రెడ్డి ఫైర్ !

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌

Rangamarthanda Trailer: ఒంటరి జననం, ఏకాకి మరణం - కంటతడి పెట్టిస్తున్న‘రంగమార్తాండ’ ట్రైలర్‌