అన్వేషించండి

త్వరలో వైద్య రంగంలో మరిన్ని నియామకాలు: మంత్రి రజనీ

జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన సంచ‌ల‌న కార్య‌క్ర‌మాల్లో ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వైద్య విధానం ఒక‌ట‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఈ విధానం కోసం అభివృద్ధి చేసిన యాప్‌ల‌లో డేటా ఎంట్రీ ప‌క్కాగా ఉండాల‌న్నారు.

గ్రామ‌స్థాయి నుంచి రాష్ట్ర‌స్థాయి వ‌ర‌కు అన్ని ఆస్ప‌త్రుల్లో సిబ్బంది నియామ‌కం విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింద‌ని ఏపీ వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. వైద్య ఆరోగ్య‌శాఖకు సంబంధించిన అన్ని విభాగాల అధిప‌తుల‌తో మంత్రి విడ‌ద‌ల ర‌జిని ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు.  

చిత్తశుద్దితో పని చేస్తున్నాం:రజనీ

మంత్రి రజని మాట్లాడుతూ పేద‌ల‌కు మెరుగైన వైద్యం పూర్తి ఉచితంగా, వేగంగా అందించేందుకు జ‌గ‌న‌ చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తున్నార‌ని తెలిపారు. ఆస్ప‌త్రుల్లో స‌రిప‌డా సిబ్బందిని ఉంచేందుకు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్  ఎంత ఖ‌ర్చైనా చేయ‌డానికైనా వెనుకాడ‌టం లేద‌ని తెలిపారు. నెల‌కు రూ.3 ల‌క్ష‌ల‌ కంటే ఎక్కు‌వ చెల్లించేలా బిడ్డింగ్ పద్ధతి ద్వారా నిపుణులైన వైద్యుల నియామకం చేప‌డుతున్న ఏకైక ప్ర‌భుత్వం త‌మ‌ద‌ని చెప్పారు. పీహెచ్‌సీల నుంచి టీచింగ్ ఆస్ప‌త్రుల వ‌ర‌కు ఎక్క‌డా సిబ్బంది కొర‌త లేకుండా చూడాల్సిన బాధ్య‌త ఉన్న‌తాధికారుల‌పై ఉంద‌ని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో సైతం ప్ర‌భుత్వం నిర్దేశించిన విధంగా సిబ్బంది ఉండేలా చ‌ర్య‌లు తీసుకున్నామ‌న్నారు. 

ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వివ‌రాల‌న్నీ ప‌క్కాగా ఉండాలి

ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌వేశ‌పెట్టిన సంచ‌ల‌న కార్య‌క్ర‌మాల్లో ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వైద్య విధానం కూడా ఒక‌ట‌ని మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. ఈ విధానం కోసం అభివృద్ధి చేసిన యాప్‌ల‌లో డేటా ఎంట్రీ ప‌క్కాగా ఉండాల‌ని సూచించారు. ప్ర‌తి ఎంఎంయూ ద్వారా అందించిన ఓపీ సేవ‌ల సంఖ్య‌, చేసిన వైద్య ప‌రీక్ష‌లు, పంపిణీ చేసిన మందులు.. వీట‌న్నింటినీ ప‌క్కాగా న‌మోదు చేయాల‌ని సూచించారు. ఆన్‌లైన్‌లో ఉన్న డేటాతో  ఈ వివ‌రాల‌న్నీ స‌రిపోలేలా ఉండాల‌ని ఆదేశించారు. ఫ్యామిలీ ఫిజిషియ‌న్ వైద్య విధానంలో భాగంగా వైద్యాధికారులు త‌ప్ప‌కుండా అంగ‌న్‌వాడీ కేంద్రాలు, పాఠ‌శాళ‌ల‌ల‌ను సంద‌ర్శించాల్సిందేన‌ని, ఈ వివ‌రాల‌న్నీ ఆన్‌లైన్‌లో న‌మోదుకావాల‌ని సూచించారు. ఈ నూత‌న వైద్య విధానం కోసం అతి త్వ‌ర‌లో మ‌రో 260 ఎంఎంయూల‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామ‌న్నారు. 

రోగుల‌కు నాణ్య‌మైన భోజ‌నం అందాలి..

రాష్ట్ర వ్యాప్తంగా రోగుల‌కు అన్ని ఆస్ప‌త్రుల్లో నాణ్య‌మైన భోజ‌నం అందేలా చూడాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. 2012 త‌ర్వాత తొలిసారి డైట్ బిల్లులు భారీగా పెంచిన ముఖ్య‌మంత్రిగా వైఎస్ జ‌గ‌న‌న చ‌రిత్ర‌లో నిలిచిపోతార‌ని గుర్తుచేశారు. గ‌తంలో కేవ‌లం రూ.40 మాత్ర‌మే చెల్లించేవార‌ని, ఇప్పుడు రూ.80 చెల్లిస్తుర‌న్నార‌ని తెలిపారు. పేద‌ల‌కు మంచి చేసే విష‌యంలో జ‌గ‌న‌న్న ఎప్పుడూ ముందుంటార‌ని పేర్కొన్నారు. అన్ని ఆస్ప‌త్రుల్లో మందులు క‌చ్చితంగా అందుబాటులో ఉండాల‌ని చెప్పారు. శ‌స్త్ర‌చికిత్స‌లు అందించే విష‌యంలో రోగుల‌కు ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌కూడ‌ద‌ని చెప్పారు. వైద్య పరీక్ష‌లు చేసేందుకు కావాల్సిన అన్ని రియేజంట్లు ఆస్ప‌త్రుల్లో అందుబాటులో ఉండాల‌న్నారు.

ఏఎన్ఎంల అభిప్రాయాలు తీసుకోండి....

ఆరోగ్య‌శ్రీ ద్వారా బిల్లులు చెల్లించే స‌మ‌యంలో ఆయా ఆస్ప‌త్రుల ప‌రిధిలోని ఏఎన్ ఎంల అభిప్రాయాలు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌ని ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ ఆదేశించార‌ని, ఆ మేర‌కు ప‌కడ్బందీ వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయాల‌ని అధికారుల‌ను మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశించారు. అన్ని ఆరోగ్య శ్రీ ఆస్ప‌త్రుల్లో కియోస్క్‌లు క‌చ్చితంగా ఉండేలా చొర‌వ‌చూపాల‌న్నారు. ఈ ఏడాది ఎన్ఎంసీ ప‌ర్యటించ‌నున్న నూత‌న వైద్య క‌ళాశాల‌ల‌కు సంబంధించి అన్ని సౌక‌ర్యాలు ఉండేలా చూడాల‌ని సూచించారు. పీఈబీ నిర్మాణాల‌ను వెంట‌నే పూర్తి చేసేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఇప్ప‌టికే అన్ని క‌ళాశాల‌ల కోసం సిబ్బంది నియామాకాలు కూడా పూర్త‌య్యాయ‌న్నారు. విజయవాడలో సెంట్రల్ డ్రగ్ టెస్టింగ్ లేబొరేటరీ వినియోగానికి సంబంధించి ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. నాడు- నేడు, ఫ్యామిలీ డాక్ట‌ర్ వైద్య విధానం త‌దిత‌రాల‌కు సంబంధించి ప్ర‌జ‌ల‌కు పూర్తి స్థాయిలో అవ‌గాహ‌న క‌ల్పించాల‌ని చెప్పారు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

జీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలుRail Bus in Mysore Rail Museum | తెలుగు రాష్ట్రాలకే ప్రత్యేకమైన రైలు బస్సు ఇలాగే ఉండేది | ABP DesamPrithvi Shaw Unsold IPL 2025 Auction | అద్భుతమైన భవిష్యత్తును చేతులారా నాశనం చేసుకున్న పృథ్వీ షా | ABP DesamMS Dhoni Auction Plan CSK IPL 2025 Team | ధోని ప్లాన్ వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
పిఠాపురంలో రైల్వే హాల్ట్, రైల్వే ఓవర్ బ్రిడ్జి కావాలి - కేంద్ర మంత్రిని కోరిన పవన్ కల్యాణ్
Pushpa 2: హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
హమ్మయ్య... 'పుష్ప 2'కి రెండేళ్ల తర్వాత టాటా చెప్పిన బన్నీ - క్యారెక్టర్ గురించి అల్లు అర్జున్ ఏమన్నారో తెలుసా?
Afifabad Tiger News: ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
ఆసిఫాబాద్ జిల్లాలో హైవే పక్కన తిరుగుతున్న పెద్దపులి, కేరామరిలో మరో పులి సంచారం
Akhil Akkineni Engagement: సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
సీక్రెట్‌గా ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అఖిల్... అనౌన్స్ చేసిన నాగార్జున - అమ్మాయి ఎవరంటే?
Telangana Airports: తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణలో మరో 3 విమానాశ్రయాలు కావాలి, కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్ రెడ్డి
CID VijayPal: ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
ఏపీ సీఐడీ మాజీ డీఎస్పీ విజయ్ పాల్ అరెస్ట్ - రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో పోలీసుల దూకుడు!
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
అదానీ సౌరవిద్యుత్ వ్యవహారం- మాజీ సీఎం జగన్‌పై ఏసీబీకి ఫిర్యాదు
Pushpa Actor Shritej: మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో
మోసం చేశాడు... ఎఫైర్ల విషయంలో "పుష్ప" నటుడు శ్రీతేజ్ మీద బాంబు పేల్చిన భార్య
Embed widget