అన్వేషించండి

Minister Rajini : ప్రజలందరికి ఉచిత వైద్యమే లక్ష్యం - రూ. 16వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్న మంత్రి రజనీ !

ఏపీలో ప్రజంలదిరికీ ఉచిత విద్యుత్ లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పని చేస్తున్నట్లుగా మంత్రి రజనీ తెలిపారు. రూ. పదహారు వేల కోట్ల ఖర్చుతో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.

Minister Rajini :  రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ నాణ్య‌మైన వైద్యం అత్యంత సులువుగా, పూర్తిగా ఉచితంగా అందాల‌న్న‌దే ముఖ్య‌మంత్రి  జ‌గ‌న్ ల‌క్ష్య‌మ‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని తెలిపారు. మంగ‌ళ‌గిరిలోని ఏపీఐఐసీ ట‌వ‌ర్స్‌లో గురువారం మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఎన్ హెచ్ ఎం విభాగం ఉన్న‌తాధికారులు, క‌మిష‌న‌ర్ నివాస్‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశం నిర్వ‌హించారు.  ప్రజ‌లంద‌రికీ ఉచితంగా మెరుగైన వైద్యాన్ని అందించాల‌నే ల‌క్ష్యంతో వేల కోట్ల రూపాయ‌ల‌ను ఖ‌ర్చు చేసేందుకు జ‌గ‌న‌న్న ఏ మాత్రం వెనుకాడ‌టంలేద‌ని తెలిపారు. గ్రామ‌స్థాయి నుంచి మెడిక‌ల్ క‌ళాశాల‌ల వ‌ర‌కు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల నిర్మాణం, ఆధునికీక‌ర‌ణ‌, వ‌స‌తుల క‌ల్ప‌న‌కు త‌మ ప్ర‌భుత్వం ఏకంగా రూ. 16 వేల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తున్న‌ద‌ని చెప్పారు. 40వేల‌కుపైగా నియామ‌కాలు చేప‌ట్టామ‌ని వెల్ల‌డించారు. పూర్తి ఉచితంగా అన్ని రోగాల‌కు వైద్యం అందిస్తున్నామ‌న్నారు. ఈ సేవ‌లు ప్ర‌జ‌ల‌కు మ‌రింత మెరుగ్గా, నాణ్యంగా, ఉచితంగా అందాలంటే అధికారుల స‌హాయ స‌హ‌కారాలు ఎంతో అవ‌స‌ర‌మ‌ని చెప్పారు. 

ఆస్పత్రుల్లో అనేక సమస్యలు ! 
 
 మూడేళ్ల‌లో ప‌లు ఆస్ప‌త్రులు సంద‌ర్శించాన‌ని అన్ని చోట్లా మంచినీటి కొర‌త‌, అప‌రిశుభ్ర‌త‌, నిర్వ‌హ‌ణ‌లో లోపాలు, టాయిలెట్లు స‌రిగా లేక‌పోవ‌డం.. లాంటివి గ‌మ‌నిస్తూనే ఉన్నాన‌ని మంత్రి రజనీ తెలిపారు. ఇవ‌న్న చాలా చిన్న చిన్న స‌మ‌స్య‌ల‌ని, అధికారుల నిర్ల‌క్ష్యం వ‌ల్ల‌నే ఇవి పెద్ద‌విగా క‌నిపిస్తున్నాయ‌ని చెప్పారు. స‌రైన స‌మ‌యంలో స్పందిస్తూ ఆయా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకుంటే స‌రిపోతుంద‌ని, అధికారులు చిత్త‌శుద్ధితో ఉంటేనే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని తెలిపారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో కాంట్రాక్ట్ ప‌ద్ధ‌తిన‌ ప‌నిచేస్తున్న వారంద‌రి సంక్షేమం గురించి కూడా మ‌నం ఆలోచించాల‌ని చెప్పారు. వారంద‌రికీ పీఎఫ్‌, ఈఎస్ ఐ అందున్నాయో లేదో చూడాల‌న్నారు. ప్ర‌తి ఉద్యోగికి సంబంధించిన వివ‌రాల్లోకి వెళ్లాల‌ని, ఏ ఒక్క‌రికి, ఎక్క‌డ స‌మ‌స్య ఎదురైనట్లు గుర్తించినా.. స‌ద‌రు ఏజెన్సీల‌పై చ‌ర్య‌ల‌కు వెనుకాడొద్ద‌ని చెప్పారు. ఏఎన్ ఎంలు, ఇత‌ర ఫీల్డ్ సిబ్బంది బ‌యోమెట్రిక్ విధానం వ‌ల్ల తాము ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను రాష్ట్ర వ్యాప్తంగా ప‌దే ప‌దే త‌న దృష్టికి తీసుకొస్తున్నార‌ని, వారి అభ్య‌ర్థ‌న‌లోనూ న్యాయం ఉంద‌ని, ప్ర‌త్యామ్యాయ ప‌ద్ధ‌తుల‌ను ఆలోచించాల‌ని ఆదేశించారు.  

వైద్య ఆరోగ్యం కోసం రూ. కోట్ల ఖర్చు !

 ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి గ‌తంలో ఏ ప్ర‌భుత్వాల‌కూ సాధ్యం కానంత‌గా కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చుచేస్తుంటే.. ఇప్ప‌టికీ కొన్ని పీహెచ్‌సీల్లో మందులు బ‌య‌ట‌కు రాస్తున్నార‌ని ఈ ప‌రిస్థితి మారాల‌ని చెప్పారు. ఎక్క‌డా, ఎప్పుడూ టెస్టులుగాని, మందులుగాని బ‌య‌ట‌కు రాయ‌కుండా ఉండేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని తెలిపారు. ఆస్ప‌త్రుల‌కు కావాల్సిన అన్ని మెటీరియ‌ల్స్ అందించేందుకు ప్ర‌భుత్వం కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తోంద‌ని, అయినా స‌రే కొన్ని ఆస్ప‌త్రుల్లో మెటీరియ‌ల్ కొర‌త క‌నిపిస్తోంద‌ని చెప్పారు. ఎలుక‌లు, దోమ‌లు ఆస్ప‌త్రుల్లో ఎందుకు ఉంటున్నాయ‌ని, ప్ర‌భుత్వ నిధుల‌ను స‌క్ర‌మంగా వినియోగించి ఈ స‌మ‌స్య త‌లెత్త‌కుండా చూడాల‌ని సూచించారు. 

పీహెచ్ సీల్లో కాన్పులు జ‌రిగాలి ! 

రాష్ట్రంలోని అన్ని పీహెచ్ సీల్లో కాన్పులు జ‌రిగేలా చొర‌వ చూపాల‌ని మంత్రి ఆదేశించారు.  ప్ర‌తి పీహెచ్‌సీలో నెల‌కు క‌నీసం 10 కాన్పులైనా జ‌రిగేలా క‌చ్చితంగా ప్ర‌య‌త్నించాల్సిందేన‌ని చెప్పారు. ఈ విష‌యంలో నిర్ల‌క్ష్యం వ‌హిస్తే చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీల్లో కాన్పులు జ‌ర‌గ‌క‌పోవ‌డం వ‌ల్ల టీచింగ్‌, జిల్లా ఆస్ప‌త్రుల‌పై ఒత్తిడి పెరుగుతోంద‌ని చెప్పారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీలో ఖాళీల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌ని, నోటిఫికేష‌న్ విడుద‌ల చేయాల‌ని వివ‌రించారు.   కావాల్సినన్ని ఆస్ప‌త్రులు నిర్మిస్తున్నాం, కావాల్సినంత సిబ్బంది ని నియ‌మిస్తున్నాం, కోట్లాది రూపాయ‌ల‌తో పరిక‌రాలు కొనుగోలు చేస్తున్నాం.. అయినా స‌రే కొన్నిచోట్ల టెస్టులు బ‌య‌ట‌కు రాస్తున్నారు.. ఈ ప‌రిస్థితి మారాల‌ని మంత్రి తెలిపారు. ల్యాబ్‌ల‌లో ఉన్న వైద్య ప‌రిక‌రాల మెయింటినెన్స్‌కు సంబంధించి కాలిబ్రేష‌న్ స‌క్ర‌మంగా జ‌రుగుతోందా..? లేదా అని ప్ర‌శ్నించారు.   

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget