Kodali Nani: అగ్ర నిర్మాతల అక్రమాల కట్టడికి కఠిన నిర్ణయాలు... నలుగురు నిర్మాతలు, హీరోలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోం... మంత్రి కొడాలి నాని కామెంట్స్
సిని పరిశ్రమ, పవన్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మరోసారి స్పందించారు. నలుగురు హీరోలు, నిర్మాతలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోదన్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆన్లైన్ టిక్కెటింగ్ విధానంపై చేసిన వ్యాఖ్యల వేడి ఇంకా తగ్గలేదు. పవన్ ఏపీ ప్రభుత్వంపై సందర్భం దొరికినప్పుడల్లా విమర్శలు చేస్తున్నారు. జనసేనాని విమర్శలపై ఏపీ మంత్రులు కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తున్నారు. పోటీపడి మరీ మంత్రులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని సినీ పరిశ్రమ, పవన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వం సినిమా టిక్కెట్లు ఆన్లైన్ విధానంలో విక్రయించేందుకు వెబ్ పోర్టల్ తీసుకువస్తామని ప్రకటించింది. ఈ విషయంపై ఇటు సినీ, అటు రాజకీయనేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకుంటున్నారు. ఈ విషయంపై పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీని అడ్డంపెట్టుకుని ఏపీ ప్రభుత్వం బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తుందని పవన్ విమర్శించారు.
Also Read: బూతులు తిడితే ఇక తాట తీయడమే .. రాజమండ్రిలో పవన్ మాస్ వార్నింగ్ !
గత ప్రభుత్వం స్పందించలేదు
పవన్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని మరోసారి కౌంటర్ ఇచ్చారు. సినిమా టిక్కెట్ల రేట్ల సమస్య గతం నుంచే ఉందని అన్నారు. ప్రభుత్వం కోర్టు ఆదేశాల మేరకు కమిటీ వేసి ఆన్లైన్ టిక్కెట్లకు వెబ్ పోర్టల్ నిర్ణయం తీసుకున్నామన్నారు. నిర్మాతలు గతంలో కోర్టుకు వెళ్తే కమిటీ వేసి నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చిందని తెలిపారు. ఆ సమయంలో చంద్రబాబు సర్కార్ స్పందించలేదన్నారు. నలుగురు నిర్మాతలు, నలుగురు హీరోలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏ నిర్ణయాలు తీసుకోదన్నారు. అందరి సంక్షేమం పరిగణలోకి తీసుకుని ప్రభుత్వం నిర్ణయాలు ఉంటారన్నారు. సినీ పరిశ్రమకు ప్రభుత్వం తరఫున అన్ని విధాల సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు.
పెద్ద నిర్మాతల కట్టడి
పవన్ విమర్శలు, హెచ్చరికలపైనా స్పందించిన మంత్రి కొడాలి నాని... జగన్ ప్రభుత్వానికి ప్రజలు, భగవంతుడి ఆశీస్సులు ఉన్నాయన్నారు. జగన్ ను భయపెట్టే వ్యక్తి ఇంకా పుట్టలేదని మంత్రి నాని అన్నారు. పవన్ కల్యాణ్ అరుపులకు బెదిరిపోయే వాళ్లు ఇక్కడ ఎవరూ లేరన్నారు. పవన్ సినిమా హిట్టైనా, ఫెయిలైనా ప్రభుత్వానికి వచ్చేది లాభం, నష్టం ఏమిలేదన్నారు. ఏపీలో విజయవాడ, విశాఖపట్నం లాంటి ప్రాంతాలలో మాత్రమే కాకుండా ఎక్కడైనా సినిమా షూటింగులు చేసుకోవచ్చని, అందుకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తామని మంత్రి వెల్లడించారు. చిన్న సినిమాలకు న్యాయం జరిగేలా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. పెద్ద నిర్మాతల అక్రమాల కట్టడికి ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని కొడాలి నాని అన్నారు. హైదరాబాద్‌లో ఆటో రజిని చిత్ర ప్రారంభ వేడుకలో మంత్రి కొడాలి నాని పాల్గొన్నారు.
Also Read: బద్వేలులో జనసేన పోటీ చేయడం లేదు... స్పష్టం చేసిన పవన్ కల్యాణ్... అనంతపురం సభలో కీలక వ్యాఖ్యలు