By: ABP Desam | Updated at : 17 Jan 2022 05:00 PM (IST)
Edited By: Satyaprasad Bandaru
మంత్రి ఆదిమూలపు సురేశ్(ఫైల్ ఫొటో)
రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు సంక్రాంతి సెలవుల తర్వాత మొదలు అయ్యాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. విద్యార్థుల రోజువారీ హాజరు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న మంత్రి... పరీక్షలు నిర్వహించేలా ఇప్పుడు పాఠశాలల్లో పాఠ్యంశాలు బోధన జరుగుతోందన్నారు. కోవిడ్ కారణంగా రెండేళ్లలో ఆల్ పాస్ అనే విధానం అనుసరించామన్నారు. భవిష్యత్ లో విద్యార్థులకు ఎదురయ్యే ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి తెలిపారు. 26 లక్షల మంది విద్యార్థుల్లో 90 శాతం మందికి వ్యాక్సిన్ పూర్తి చేశామని తెలిపారు. ఉపాధ్యాయులకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేశామన్నారు. కోవిడ్ మూడో వేవ్ నేపథ్యంలో జాగ్రత్తలు పాటిస్తూనే పాఠ్యంశాలు పూర్తిచేస్తున్నామని తెలిపారు.
Also Read: కడప రిమ్స్ లో కరోనా కలకలం... 50 మంది వైద్య విద్యార్థులకు పాజిటివ్
సరైన సమయంలో నిర్ణయం
ఈ విద్యా సంవత్సరం 150 రోజుల పాటు నిరంతరాయంగా పాఠశాలలు నడిచాయని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా ఉండాలనే పాఠశాలలు నడుపుతున్నామని స్పష్టం చేశారు. కోవిడ్ వ్యాప్తి చెందటానికి పాఠశాలలు నడపటానికి సంబంధం లేదని మంత్రి అన్నారు. అత్యవసర పరిస్థితి ఏర్పడితే ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందన్నారు. పొరుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తే... కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటునే ఏపీలో నిర్వహించామని గుర్తుచేశారు. ఆన్ లైన్ విద్యా బోధనకు ఓ పరిమితి ఉందన్న మంత్రి.... ప్రాథమిక, మాధ్యమిక విద్యకు అది ప్రత్యామ్నాయం కాదన్నారు. విద్యార్థులు క్యారియర్లు అయినప్పటికీ వారికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగానే ఉందని మంత్రి స్పష్టం చేశారు.
Also Read: కలెక్టర్ పీఏని అని చెప్పి డబ్బులు డిమాండ్.. నిందితుడికి ఊహించని ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు
తొలిరోజు 61 శాతం హాజరు
సంక్రాంతి సెలవుల తర్వాత తెరుచుకున్న పాఠశాలలకు విద్యార్థులు ఉత్సాహంగా హాజరవుతున్నారని మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. తొలిరోజు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో 61 శాతం విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో 70 శాతం, కడప జిల్లాలో 69 శాతం, గుంటూరు 68 శాతం, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లో 67 శాతం అత్యధికంగా హాజరు నమోదైనట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రత పట్ల ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలను నడుపుతుందని మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు మంత్రి సురేశ్ తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు కోవిడ్ కు సంబంధించిన సమస్యలు తెలుసుకునేందుకు సందేహాల నివృత్తి కోసం పాఠశాల విద్య, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ రెండు కార్యాలయాల్లో కేటాయించిన ఫోన్ నెంబర్లకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఫోన్ చేసి సమస్యలు తెలిపి పరిష్కారం పొందవచ్చని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితుల్లో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధంగానే ఉందన్నారు.
Also Read: ఆధార్ లో తప్పు ఆధారం లేకుండా చేసింది... అనంతపురంలో ఓ వృద్ధుడి దీనపరిస్థితి
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Vangaveeti Nadendal Meet : వంగవీటి ఇంటికి నాదెండ్ల మనోహర్ ! కారణం ఏమిటంటే ?
Vishal No Politics : కుప్పంలో చంద్రబాబుపై పోటీ - విశాల్ క్లారిటీ ఇదే
Chandrababu : జగన్ను చూసి చాలా నేర్చుకున్నాను - చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు !
Rahgurama : నీ దారిలో నువ్వు రా... నా దారిన నేను వస్తా - సీఎం జగన్కు ఎంపీ రఘురామ సలహా !
AP Government On Bamboo: వెదురు పెంచితే సూపర్ ఆఫర్- మీ తోటలో పెంచినా రాయితీ
Udaipur Murder Case : ముంబయి ఉగ్రదాడిని గుర్తుచేసేలా 26/11 బైక్ నెంబర్, అదనంగా రూ.5 వేలు చెల్లించిన ఉదయ్ పూర్ కిల్లర్
Bimbisara: 'ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు' - 'బింబిసార' ట్రైలర్ గ్లింప్స్
TTD TSRTC Darshan Tickets : టీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు టీటీడీ గుడ్ న్యూస్, ప్రతిరోజు శ్రీవారి దర్శనానికి వెయ్యి టికెట్లు జారీ
MS Dhoni Treatment: ధోనీకి మోకాళ్ల నొప్పులు! ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్న ఛాంపియన్!