అన్వేషించండి

Chandrababu Case : మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రలకు ఊరట - హైకోర్టు కీలక ఆదేశాలు

Chandrababu Case : మద్యం కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై తీర్పు వచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. తీర్పు రిజర్వ్ చేసింది.


Chandrababu Case :  గత ప్రభుత్వంలో మద్యం ప్రివిలేజ్ ఫీజును  అక్రమంగా మాఫీ చేసి  ప్రభుత్వానికి నష్టం కలిగించారంటూ సీఐడీ నమోదు చేసిన కేసులో చంద్రబాబు, కొల్లు రవీంద్రలపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశించింది.  తప్పుడు కేసు పెట్టారని విధానపరమైన నిర్ణయం తీసుకుంటే.. దానిపై కేసు పెట్టారని ఈ కేసులో  ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వీరు హైకోర్టును ఆశ్రయించారు.  ఈ పిటిషన్లపై విచారణ పూర్తయింది.  లిఖిత పూర్వక వాదనలు కూడా సమర్పించారు. తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు .. తీర్పు వెల్లడించే వరకూ ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది.

విధానపరమైన నిర్ణయంపై కేసులు పెట్టడం ఏమిటని  చంద్రబాబాబు తరపు లాయర్ల వాదన 

ఇంతకు ముందు జరిగిన విచారణలో  చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు నాగముత్తు, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు 2015-17 సంవత్సరాల్లో ప్రివిలేజ్‌ ఫీజు విధింపు నిబంధన తొలగింపునకు ప్రతిపాదించిన ఫైలు అప్పటి సీఎం చంద్రబాబు వద్దకు వెళ్లలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటి ఎక్సైజ్‌ శాఖ మంత్రి, కమిషనర్‌ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఫైలును ఆర్థిక శాఖకు పంపకపోవడాన్ని సీఐడీ ఆక్షేపించడం సరికాదని, ఈ విషయంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. అందుకు అప్పటి సీఎం, మంత్రిని బాధ్యులను చేయడం సరికాదన్నారు. పిటిషనర్‌పై దురుద్దేశపూర్వకంగా కేసు నమోదు చేశారని, ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరారు.

ఖజానాకు నష్టం కలిగించారని ప్రభుత్వం తరపు లాయర్ వాదనలు                                  

సీఐడీ తరఫున ఏజీ శ్రీరామ్‌ వాదనలు వినిపించారు.  గత ప్రభుత్వ హయాంలో మద్యం దుకాణాల లైసెన్స్‌దారులకు ప్రివిలేజ్‌ ఫీజు తొలగించడం ద్వారా రాష్ట్ర ఖజానాకు నష్టం జరిగిందన్నారు. వివిధ ఫైళ్లను   కోర్టు ముందు ఉంచారు. వాటిని తమకు అందజేయలేదని చంద్రబాబు తరఫు సీనియర్‌ న్యాయవాది అభ్యంతరం తెలిపారు. న్యాయమూర్తి స్పందిస్తూ వాటిని పిటిషనర్లకు ఇవ్వాలని ఏజీకి సూచించారు.  విచారణలో ఇరువైపులా వాదనలు ముగించిన న్యాయస్థానం.. మౌఖికంగా తెలిపిన వివరాలను రాతపూర్వకంగా కోర్టు ముందుంచాలని పిటిషనర్లకు సూచిస్తూ విచారణను  సోమవారానికి వాయిదా వేశారు.

తీర్పు ఇచ్చే వరకూ చర్యలు తీసుకోవద్దని  హైకోర్టు ఆదేశం                                     

సోమవారం తీర్పును రిజర్వు చేస్తూ తొందరపాటు చర్యలు వద్దని సీఐడీని హైకోర్టు ఆదేశించింది. గత ప్రభుత్వ హయాంలో మద్యం కంపెనీలకు అనుచిత లబ్ధి చేకూర్చేలా నిర్ణయాలు తీసుకున్నారన్న ఆరోపణలతో బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ఎండీ వాసుదేవరెడ్డి ఫిర్యాదు ఆధారంగా చంద్రబాబు, కొల్లు రవీంద్ర, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌పై సీఐడీ కేసు నమోదు చేశారు. జీవోలు ఇచ్చిన వారిపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. 

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నాలుగు కాళ్ళ దెయ్యం దెబ్బకు   ఖాళీ అయిపోయిన గ్రామం..!చంద్రబాబును ఫోటో అడిగిన బాలిక, వచ్చేయమన్న సీఎం-అంతా షాక్వీడియో: మహిళపై చిరుతపులి దాడి, ముఖమంతా రక్తం!నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Manchu Manoj Political Entry: రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
రాజకీయాల్లోకి మంచు మనోజ్ దంపతులు! జనసేనలో చేరే అవకాశం!
Andhra Pradesh News: జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
జగన్‌కు షాక్ ఇవ్వడానికి జోగి రమేష్ సిద్ధమయ్యారా? కూటమి నేతల ర్యాలీలో పాల్గొడంపై అనేక అనుమానాలు!
Revanth Reddy: తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
తెలంగాణలో భూమి లేని నిరుపేదలు అంటే ఎవరు? అర్హులను ప్రభుత్వం ఎలా ఎంపిక చేస్తుంది?
RC 17 Update : మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
మెగా ఫ్యాన్స్​కు గుడ్ న్యూస్... చెర్రీ - సుకుమార్ సినిమా గురించి అదిరిపోయే అప్డేట్
Zakir Hussain Died: ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
ప్రముఖ తబలా విద్వాంసుడు జాకీర్‌ హుస్సేన్‌ అస్తమయం
Ind Vs Aus 3rd Test Highlights: బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
Bigg Boss 8 Telugu Prize Money: బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
బిగ్ బాస్ ప్రైజ్ మనీ... నిఖిల్‌కు రూ. 55 లక్షలతో పాటు కారు కూడా - రోజుకు ఎంతో తెలుసా?
Bigg Boss 8 Telugu Winner: బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్‌గా నిఖిల్ - రన్నర్‌తో సరిపెట్టుకున్న గౌతమ్!
Embed widget