By: ABP Desam | Updated at : 30 Nov 2022 11:01 AM (IST)
Edited By: jyothi
ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఏపీ హైకోర్టు షాక్, ఏమైందంటే?
AB Venkateshwar Rao: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. సస్పెన్షన్ కాలానికి జీత భత్యాలు చెల్లించాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ ప్రభుత్వం చెల్లించలేదంటూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మపై వెంకటేశ్వర రావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను ధర్మాసనం కొట్టి వేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం చివర దశకు చేరుకోవడం వల్ల సీఎస్ చర్యలను ఉద్దేశ పూరక ఉల్లంఘనగా పరిగణించడం సాధ్యం కాదని వివరించింది. అంతే కాకుండా తర్వాతి కాలంలో సీఎస్ చర్యలు ఉద్దేశ పూర్వక ఉల్లంఘనలా అనిపిస్తే మరోసారి పిటిషన్ దాఖలు చేసేందుకు ఈ తీర్పు అడ్డంకి కాదని చెప్పింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది.
ఏబీ వెంకటేశ్వర రావు దాఖలు చేసిన కోర్టు ధిక్కరణ పిటిషన్ పై జస్టిస్ సోమయాజులు ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. ఏబీ తరఫున సీనియర్ న్యాయవాది బి. ఆదినారాయణ రావు వాదనలు వినిపించారు. అయితే పిటిషన కొట్టివేసి... జీత భత్యాలు చెల్లించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సుప్రీం కోర్టు కూడా సస్సెన్షన్ ను ఎత్తి వేసిందని అన్నారు. అయితే సస్పెన్షన్ కాలానికి జీత భత్యాలు చెల్లించమని ధర్మాసనం చెప్పినా చెల్లించలేదని, ఇది కోర్టు ఆదేశాల ఉల్లంఘనే అని వివరించారు. అయితే విచారణ ఎదుర్కుంటున్న ప్రభుత్వ ఉద్యోగికి జీతభత్యాలు చెల్లించాలా లేదా అన్నిది ప్రభుత్వ విచక్షణ అని చెప్పారు.
అసలేం జరిగిందంటే..?
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ప్రభుత్వం మధ్య ఎప్పటి నుంచో ఘర్షణ నడుస్తోంది. నిఘా విభాగం చీఫ్ గా పని చేసిన సమయంలో భద్రత పరికరాల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో ఆయనపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఆ కేసులో విచారణను ఎదుర్కొంటున్న ఆయన సాక్ష్యుల్ని ప్రభావితం చేసేందుకు యత్నించారన్న అభియోగంపై సస్పెండ్ చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఏబీ వెంకటేశ్వర రావుపై తీవ్ర అవినీతి అభియోగాలు ఉన్నాయని, ఇప్పటికే ఆయన్ని సర్వీసు నుంచి డిస్మిస్ చేయడానికి సిఫార్సు చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఖిల భారత సర్వీసు అధికారులపై ఉండే క్రిమినల్ అభియోగాలన్నీ తొలగిపోయేంత వరకు లేదా కొట్టేసేంత వరకు వారిసి సస్పెన్షన్ విధించే విచక్షణాధికారం ఏపీ ప్రభుత్వానికి ఉందని అందులో వివరించారు.
ఈ మేరకు అఖిల భారత సర్వీసు నియమావళి ప్రకారం.. ఏబీ వెంకేటశ్వర రాును సస్పెండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రింటింగ్ అండ్ స్టేషనరీ కమిషనర్ గా పోస్టింగ్ ఇచ్చామని, ఆ తర్వాత ఆయన తాను ఎదుర్కొంటున్న నేర విచారణకు సంబంధించిన వ్యవహాంలో సాక్ష్యుల్ని ప్రభావితం చేసందుకు ప్రయత్నించినట్లు గుర్తించామన్నారు, ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని,, సస్పెన్షన్ అమల్లో ఉన్న కాలంలో ఆయన, విజయవాడను విడిచి పెట్టి వెళ్లడానికి వీళ్లేదని ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరోసారి వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు సస్పెన్షన్ ముగిసినట్టేనని.. జీతభత్యాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీంతో ప్రభుత్వం దిగొచ్చి పోస్టింగ్ ఇచ్చింది. జూన్ 14నే ప్రభుత్వం ఏపీ ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ డిపార్ట్‌మెంట్‌కు కమిషనర్‌గా ఏబీని నియమించింది. మే 19వ తేదీ నుంచి ఆయన్ను విధుల్లోకి తీసుకున్నామని సీఎస్ సమీర్ శర్మ అబ్‌స్ట్రాక్ట్ ఇచ్చారు. తర్వాత మరో 15 రోజులకే మరోమారు ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని.. ఎన్నిసార్లు గుర్తు చేసిన పట్టించుకోవడం లేదంటూ కోర్టు ఉల్లంఘనపై పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన కోర్టు ఆ పిటిషన్ కొట్టేసింది.
Breaking News Live Telugu Updates: హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
సీఐడీ విచారణకు విజయ్ హాజరు- తాడేపల్లి డైరెక్షన్లోనే ఇదంతా జరుగుతోందని టీడీపీ ఆరోపణ
Batchula Arjunudu Hospitalised:: టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడికి తీవ్ర అస్వస్థత- చంద్రబాబు ఆరా!
కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీలో రచ్చరచ్చ- ఎంపీ, ఎమ్మెల్యే వర్గాలు బాహాబాహీ
నేడు ఢిల్లీకి సీఎం జగన్- మంగళవారం జరిగే ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి హాజరు
Peerzadiguda: అర్ధరాత్రి పేకాటరాయుళ్ల హంగామా, మీడియాపై దాడి! తలుపులు మూసేసి, కరెంటు తీసేసి రచ్చ
Hindenburg on Adani: జాతీయవాదం పేరు చెప్పి మోసాల్ని కప్పి పుచ్చలేరు, అదానీకి హిండన్ బర్గ్ స్ట్రాంగ్ కౌంటర్
Pathaan movie: అమెరికాలో ‘పఠాన్’ జోరు, థియేటర్లో ఆ నోటీస్ చూసి ఫ్యాన్స్ షాక్ - బాలయ్య ఎఫెక్టేనా?
Manchu Manoj For Taraka Ratna : బెంగుళూరులో తారకరత్నను పరామర్శించిన మంచు మనోజ్ | DNN | ABP Desam