By: ABP Desam | Updated at : 21 Apr 2022 01:15 PM (IST)
సీఎం కాన్వాయ్‌కు కారు లాక్కోగా.. రోడ్డుపైనే నిలబడిన కుటుంబం
ఒంగోలులో సీఎం కాన్వాయ్ కోసం ఓ సామాన్య కుటుంబం వద్ద కారు లాక్కున్న ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. ఈ ఘటనపై పలు విమర్శలు రావడంతో సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెంటనే ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. తిరుమలకు వెళ్తున్న కుటుంబం నుంచి కారు తీసుకున్న హోంగార్డు పి.తిరుపతి రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ ఎ.సంధ్యను సస్పెండ్ చేశారు. కారు స్వాధీనం ఘటనకు బాధ్యులని చేస్తూ వారిద్దరిపై అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు.
ఒంగోలులో పోలీసుల ఓవర్ యాక్షన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను దుమారాన్ని రేపుతోంది. తిరుమలకు వెళ్తున్న ఓ కుటుంబం నుంచి కారును లాక్కొని.. వారిని రోడ్డున పడేయడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన వేమల శ్రీనివాస్ కుటుంబం తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్తోంది. ఆరుగురు ఫ్యామిలీ మెంబర్స్ ఇన్నోవా కారులో బయల్దేరారు. రాత్రి పది గంటలకు ఒంగోలులోని ఓ హోటల్ ముందు ఆపారు.
ఒంగోలులో టిఫిన్ చేస్తుండగా ఓ కానిస్టేబుల్ వచ్చాడు. ఈ వెహికల్ ఎవరిదని అడిగాడు. మాదే అని చెప్పాడు శ్రీనివాస్. 22న సీఎం జగన్ పర్యటన ఉందని.. సీఎం కాన్వాయ్ కోసం వెహికల్ కావాలని చెప్పారు. డ్రైవర్ కూడా కావాలని గద్దించారు. తామంతా తిరుపతి వెళ్తున్నామని ఇప్పుడు కష్టమనిన చెప్పినా పట్టించుకోలేదు. ఉన్నతాధికారులు చెప్పారని... సారీ అంటూ వెహికల్ తీసుకెళ్లిపోయాడా కానిస్టేబుల్.
పోలీసు కానిస్టేబుల్ కారు తీసుకెళ్లిపోవడంతో శ్రీనివాస్ ఫ్యామిలీ రోడ్డున పడింది. అర్థరాత్రి వేళలో ఇదేం పని అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఒంగోలు ఆర్టీవో అధికారుల వ్యవహార శైలితో తాము అర్ధరాత్రి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చిందని వారు వాపోయారు. సీఎం కోసం వెహికల్స్ కావాలంటే స్థానికంగా ఉన్న వారివి తీసుకోవాలే కానీ.. ఇలా దూర ప్రాంతాల వారిని టార్గెట్ చేయడం ఏంటని వాపోయింది. దీనిపై స్పందించిన ఉన్నతాధికారులు... ఇలాంటి సంఘటన జరిగినట్టు తమ దృష్టికి రాలేదని... కచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి కార్యక్రమాలకు లోకల్ వెహికల్స్ మాత్రమే తీసుకుంటామన్నారు.
ఇలా ఫ్యామిలీని నడిరోడ్డుపై వదిలేసి వెహికల్ తీసుకెళ్లిపోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కాన్వాయ్ కోసం ప్రజల కారు లాక్కెళ్ళడం దౌర్భాగ్యపు పాలనకు నిదర్శనమన్నారు. కుటుంబంతో తిరుమల దర్శనానికి వెళ్తున్న వినుకొండ వాసి వేముల శ్రీనివాస్ వాహనాన్ని రవాణా శాఖ అధికారులు బలవంతంగా తీసుకు వెళ్ళడం దారుణమని.. భార్యా, పిల్లలతో శ్రీవారి దర్శనానికి వెళ్తున్న కుటుంబాన్ని రోడ్డున దింపేసే హక్కు ఈ అధికారులకు ఎవరిచ్చారని నిలదీశారు.
సీఎం కాన్వాయ్ కోసం కారు పెట్టుకోలేని స్థితికి రాష్ట్రం ఎందుకు వెళ్ళిందా అని ఆశ్చర్యపోయారు చంద్రబాబు. ప్రభుత్వ అధికారులే ఇలాంటి చర్యలకు పాల్పడడం ద్వారా ప్రజలకు ఏమి చెప్పాలి అనుకుంటున్నారన్నారు. సీఎం వస్తే షాప్స్ మూసి వేయ్యడం, సీఎం కాన్వాయ్ కోసం వాహనదారుల కార్లు లాక్కెళ్ళడం సిగ్గుచేటని మండిపడ్డారు.
Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
ఇబ్బందిగా ఉన్నా ఎన్డీఏ నుంచి బయటకు! టీడీపీకే నా మద్దతు : పవన్ కల్యాణ్ తడబడ్డారా! సంకేతాలిచ్చారా?
MLA Kotamreddy Sridhar Reddy: పోలీసుల కళ్లుగప్పి ఆటోలో ర్యాలీకి చేరుకున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
Lakshmi Parvathi: ఆయనకి తాటిచెట్టులా 75 ఏళ్లు, సెల్‌ఫోన్ తానే కనిపెట్టారట - లక్ష్మీ పార్వతి ఎద్దేవా
Kollu Ravindra: పోలీసుల కనుసన్నల్లోనే వారాహి యాత్రపై కుట్రకు యత్నం, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపణలు
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
TSRTC DA: టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్, ఒకేసారి 9 డీఏలు మంజూరు
Flipkart iPad Offer: కొత్త ట్యాబ్ కొనాలనుకుంటున్నారా? - రూ.20 వేలలోపే యాపిల్ ఐప్యాడ్!
Dharmapuri Arvind: కేసీఆర్‌కు ఫ్యామిలీ నుంచే డేంజర్, ఆయన హెల్త్ బులెటిన్ విడుదల చేయాలి - ధర్మపురి అర్వింద్
/body>