By: ABP Desam | Updated at : 10 May 2023 11:54 AM (IST)
Edited By: jyothi
సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త, జూనియర్ కాలేజీల్లో నియామకాలకూ చర్యలు
AP Govt: ఏపీలో మండలానికి ఒక బాలికల జూనియర్ కాలేజీ ఏర్పాటు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో శుభవార్త చెప్పింది. బాలికల జూనియర్ కాలేజీల్లో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతో పాటు దాదాపు 7 వేల మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు - ఎస్జీటీలకు పదోన్నతి కల్పించి హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు ఉపాధ్యాయులుగా నియమించనుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ నెల ఆఖరులోగా పూర్తి చేయాలని వైసీపీ సర్కారు నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్ (జూనియర్ కాలేజీ ) స్థాయికి పెంచుతూ ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ), జూనియర్ కాలేజీలు లేని చోట 'ప్లస్' స్కూళ్లను గుర్తించి బాలికలకు ఇంటర్మీడియల్ విద్యాబోధన ప్రారంభించింది.
జూన్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ తరగతులు
2022-23 విద్యా సంవత్సరంలో 177 ప్లస్ హైస్కూళ్లలో ప్రవేశాలు కల్పించింది. వచ్చే విద్యా సంవత్సరంలో మిగిలిన 115 'ప్లస్' పాఠశాలలోనూ ఇంటర్ తరగతులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అన్ని చోట్లా పూర్తి స్థాయి బోధన సిబ్బందిని నియమించే ప్రక్రియను ప్రారంభించింది. 2023-24 విద్యా సంవత్సరంలో జూన్ 1వ తేదీ నుండి ఇంటర్ తరగతులు మొదలు కానున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం ఉన్నత పాఠశాలలు ప్లస్ స్థాయిలో ఇంటర్ తరగతుల బోధనకు 1,752 మంది ఉపాధ్యాయులు అవసరమని ఉన్నతాధికారులు గుర్తించారు. ఎంపీసీ, బైసీపీ, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు ఉపాధ్యాయుల అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సేవలందిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల - ఎస్ఏలో సీనియారిటీతో పాటు పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్- పీజీటీ అర్హతలు ఉన్న వారిని హైస్కూల్ ప్లస్ లో నియామకం చేపట్టనున్నారు. ఇంతకాలం పాఠశాల స్థాయి బోధనలో ఉన్న వారు కాలేజీ స్థాయిలో బోధనకు ఎంత వరకు అనువుగా ఉన్నారో ఇంటర్ బోర్డు ద్వారా పరీక్షించనున్నారు. అనంతరం ఎంపికైన 1,752 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఒక ఇంక్రిమెంట్ అదనంగా ఇచ్చి జూనియర్ కాలేజీల్లో బోధనకు నియామకం చేపట్టనున్నారు. దాదాపు 6 వేల నుండి 7 వేల మందికి ఎస్జీటీలకు పదోన్నతి సైతం రాష్ట్ర ప్రభుత్వం కల్పించనుంది. వీరిని హైస్కూల్ స్థాయిలో సబ్జెక్టు నిపుణులుగా నియామకం చేపట్టనుంది. పదోన్నతులు, పోస్టుల భర్తీ ప్రక్రియను మే నెల ఆఖరు లోపు పూర్తి చేయాలని వైసీపీ సర్కారు విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
VIDYADHAN: పేద విద్యార్థులకు సహకారం - ‘విద్యాధన్’ ఉపకారం! ఎంపిక, స్కాలర్షిప్ వివరాలు ఇలా!
AP SSC Exams: ఏపీలో రేపటి నుంచే పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు, హాజరుకానున్న 2 లక్షలకుపైగా విద్యార్థులు!
Tirupati: గోవిందరాజస్వామి గుడిలో అపశ్రుతి, కూలిన చెట్టు, ఒకరి మృతి! ఎక్స్గ్రేషియా ప్రకటన
Nara Lokesh: నారా లోకేశ్ పాదయాత్రలో వివేకా హత్యపై ప్లకార్డులు, ‘హూ కిల్డ్ బాబాయ్’ అంటూ నినాదాలు
Telangana Govt: కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం లేఖ
దుల్కర్ సల్మాన్ తో దగ్గుబాటి హీరో సినిమా!
CH Malla Reddy: బొజ్జ ఉంటే పోలీసులకు ప్రమోషన్లు ఇవ్వకండి - మంత్రి మల్లారెడ్డి సరదా కామెంట్లు
YS Viveka Case : సీబీఐ కోర్టులో వైఎస్ భాస్కర్ రెడ్డి పిటిషన్ - బెయిల్ ఇవ్వాలని విజ్ఞప్తి !
Project K: ‘ప్రాజెక్ట్ కె’లో విలన్ పాత్రకు కమల్ అంత డిమాండ్ చేశారా? అసలు నిజం ఇది!