AP Metro Rail MD: ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి - ప్రభుత్వం కీలక నిర్ణయం
AP News: ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఎండీగా పని చేస్తున్న జయమన్మథరావును ఆ పోస్టు నుంచి రిలీవ్ చేసింది.
![AP Metro Rail MD: ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి - ప్రభుత్వం కీలక నిర్ణయం ap government appointed ramakrishna reddy as metro rail managing director AP Metro Rail MD: ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి - ప్రభుత్వం కీలక నిర్ణయం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/08/02/6037e0c7a508723b80b4737cfd49e7b71722597939982876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ramakrishna Reddy As AP Metro Rail MD: ఏపీ మెట్రో రైల్ ఎండీగా రామకృష్ణారెడ్డి (Ramakrishna Reddy) నియమితులయ్యారు. ఈ మేరకు పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన మూడేళ్ల పాటు ఎంఆర్‌సీ ఎండీగా కొనసాగనున్నారు. కాగా, రామకృష్ణారెడ్డి గతంలోనూ మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. ప్రస్తుతం ఎండీగా పనిచేస్తున్న జయమన్మథరావును ఆ పోస్టు నుంచి రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో మెట్రో రైల్ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో మెట్రో రైల్‌కు నూతన ఎండీని నియమించినట్లు తెలుస్తోంది.
కాగా, విజయవాడలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు 2014 - 19లో సీఎం చంద్రబాబు మెట్రో రైల్ ప్రతిపాదనను తెచ్చారు. రెండు కారిడార్లలో మెట్రో రైల్ నిర్మాణానికి ప్రతిపాదనలు, డీపీఆర్‌లు తయారుచేశారు. మహాత్మా గాంధీ రోడ్ ద్వారా వీఆర్ సిద్ధార్థ్ ఇంజినీరింగ్ కాలేజీ నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకూ మొదటి కారిడార్ కాగా.. బీఆర్‌టీఎస్ రోడ్, రైల్వే స్టేషన్ నుంచి రామవరప్పాడు రింగ్ రోడ్, పండిట్ నెహ్రూ బస్ట స్టేషన్ వరకూ నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుతం మళ్లీ మెట్రో ప్రాజెక్ట్ పట్టాలెక్కే ఛాన్స్ ఉంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)