AP Employees : పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకుంటేనే చర్చలు.. ఉద్యమం ఖాయమంటున్న ఏపీ ఉద్యోగులు !

పీఆర్సీ జీవోలు వెనక్కి తీసుకున్న తర్వాతే ప్రభుత్వంతో చర్చలు జరుపుతామని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. మరో వైపు ప్రభుత్వం ఉద్యోగుల ఆవేశాన్ని చల్లబరిచే ప్రయత్నాలు చేస్తోంది.

FOLLOW US: 

పీఆర్సీ జీవోల విడుదల తర్వాత ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్న ఉద్యోగులను కూల్ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. పీఆర్సీ అంశంపై ఉద్యోగ సంఘాల నేతలతో ఉన్నతాధికారులు మరోసారి చర్చలు జరిపేందుకు ప్రయత్నిస్తున్నారు. సాయంత్రంలోపు ఓ సారి సీఎస్ సమీర్ శర్మ ప్రెస్‌మీట్ పెట్టి పీఆర్సీ వల్ల ఉద్యోగులకు ఎలాంటి నష్టం లేదని.. ఇంకా లాభమేనని వివరణ ఇచ్చే అవకాశం ఉంది. చర్చలకు రావాలని ఉద్యోగ సంఘాల నేతలకు ఉన్నతాధికారుల నుంచి ఫోన్లు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. 

Also Read: అప్పుడే ఉద్యోగులంతా ఏకమై వ్యతిరేకిస్తే బాగుండేది.. దారుణమైన పీఆర్సీ ప్రకటించారు

అయితే ఉద్యోగ సంఘాల నేతలు మాత్రం తమ కార్యాచరణ ప్రకటించేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. బుధ, గురువారాలు రెండు రోజుల పాటు అన్ని ఉద్యోగ సంఘాలతో సమావేశం నిర్వహించి ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణను ఖరారు చేయాలని అనుకుంటున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న ఉద్యోగ సంఘ నేతలు ఇక ప్రభుత్వంతో చర్చలకు వెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెబుతున్నారు. ముందుగా పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఆ తర్వాతే  తాము చర్చల గురించి ఆలోచిస్తామని తేల్చి చెబుతున్నారు. 

Also Read: పీఆర్సీని అంగీకరించే ప్రశ్నే లేదన్న ఏపీ ఉద్యోగ సంఘాలు.. సమ్మెకు సిద్ధమని ప్రకటన !

ఏపీ ప్రభుత్వం ఉద్యోగులను అత్యంత దారుణంగా మోసం చేసిందని ఉద్యోగ సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ఎంతో సహనంతో తాముప్రభుత్వానికి సహకరించామని కానీ ప్రభుత్వం మాత్రం తమను మోసం చేసిందని అంటున్నారు. మధ్యంతర  భృతి కన్నా తక్కువ ఫిట్‌మెంట్‌కే అంగీకరించినప్పటికీ  హెచ్ఆర్‌ఏలు తగ్గించడమే కాకుండా.. పదేళ్లకోసారి పీఆర్సీ అని ప్రకటించి..భవిష్యత్ లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

Also Read: ఏపీ ఉద్యోగులకు జగన్ సర్కార్ బిగ్ షాక్! డిమాండ్లు పట్టించుకోకుండానే వరుస జీవోలు

హెచ్‌ఆర్‌ఏ విషయంలో ఉద్యోగ సంఘాలతో సంప్రదింపులు జరిపిన తర్వాతనే జీవోలు జారీ చేస్తామని ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. అయితే పండగ ముగిసిన తరవాత హఠాత్తుగా అర్థరాత్రి పూట జీవోలు జారీ కావడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు. జీతం తగ్గిపోయే అవకాశం ఉండటంతో ఆందోళన బాట పట్టాలని నిర్ణయించుకున్నారు. అవసరం అయితే సమ్మెకైనా వెనుకాడబోమని ఇప్పటికే  హెచ్చరించారు. 

Also Read: కొత్త పీఆర్సీతో జనవరి జీతాలు సాధ్యమేనా? అడ్డంకులేంటి? అది చెప్పకుండా జీతాలు ఎంతో తేలేది ఎలా?

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి.

Published at : 19 Jan 2022 12:37 PM (IST) Tags: ANDHRA PRADESH cm jagan AP EMPLOYEES Bandi Srinivasa Rao Bopparaju Venkateshwarlu Trade Union Concern AP NGO Leaders

సంబంధిత కథనాలు

Bhavani Island: ప‌ర్యాట‌క అద్బుతం విజయవాడ భ‌వానీ ఐల్యాండ్, న‌ది మ‌ధ్యలో ప్ర‌కృతి అందాలు

Bhavani Island: ప‌ర్యాట‌క అద్బుతం విజయవాడ భ‌వానీ ఐల్యాండ్, న‌ది మ‌ధ్యలో ప్ర‌కృతి అందాలు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

Student Debarred: ఏపీ ఇంటర్ బోర్డ్ పరీక్షల్లో కాపీయింగ్ - 13 మంది విద్యార్థుల్ని డిబార్ చేసిన అధికారులు

R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు

R Krishnaiah Thanks YS Jagan: ఏ రాజకీయ పార్టీ గుర్తించలేదు, కానీ వైఎస్ జగన్ ఛాన్స్ ఇచ్చారు : ఆర్ కృష్ణయ్య  కీలక వ్యాఖ్యలు

YSRCP Rajyasabha Equation : వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ? రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

YSRCP Rajyasabha Equation :   వైఎస్ఆర్‌సీపీలో అర్హులు లేరా ?  రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు జగన్ చూసిన అర్హత ఏమిటి ?

Breaking News Live Updates: జూబ్లీహిల్స్‌లో నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం

Breaking News Live Updates: జూబ్లీహిల్స్‌లో నటుడు బాలకృష్ణ ఇంటి వద్ద రోడ్డు ప్రమాదం
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, కొవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Covid 19 Vaccine Gap: కరోనా వ్యాక్సినేషన్‌పై కేంద్రం కీలక నిర్ణయం, కొవిడ్ వ్యాక్సిన్ డోసుల మధ్య గ్యాప్‌ తగ్గింపు - వారికి మాత్రమే !

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Pushpa 2 Release Date: బన్నీ ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్, ‘పుష్ప: ది రూల్’ వచ్చేది అప్పుడేనట, మరీ అంత లేటా?

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్

Vaaradhi App: ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్నారా, అయితే మీకు గుడ్‌న్యూస్

Palnadu Students Fight : అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !

Palnadu Students Fight :  అచ్చంపేట వర్సెస్ క్రోసూరు స్టూడెంట్స్ - పల్నాడు జిల్లాలో ఇంటర్ విద్యార్థుల గ్యాంగ్ వార్ !