అన్వేషించండి

Pawan Kalyan: సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గుడ్ న్యూస్ - వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు

Andhra News: రాష్ట్రంలో సర్పంచులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శుభవార్త చెప్పారు. త్వరలోనే పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు.

Deputy CM Pawan Kalyan Key Comments On Volunteers: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సర్పంచ్‌లకు గుడ్ న్యూస్ చెప్పారు. 15 ఫైనాన్స్ డబ్బులు త్వరలోనే అకౌంట్లలో జమవుతాయని స్పష్టం చేశారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సర్పంచులతో ఆయన సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్ శాఖ అధికారులు సైతం హాజరయ్యారు. ఈ భేటీలో మొత్తం 16 అంశాలను సర్పంచ్‌లు పవన్ ముందుంచారు. కనీసం సిబ్బంది జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేయగా.. త్వరలోనే గ్రామ పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు. అలాగే, రాజధానిలో భవన నిర్మాణం కోసం 2 ఎకరాల స్థలం అడగ్గా.. సానుకూలంగా స్పందించారు. 'సర్పంచ్‌‍ల డిమాండ్లలో కీలకమైనవి గుర్తించి పూర్తి చేశాం. కేరళ అధికారి కృష్ణతేజను డిప్యుటేషన్‌పై తీసుకొచ్చాం. ఆయన సహకారంతోనే గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం. నా పేషీలో ప్రజలకు మేలు చేద్దామన్న అధికారులు ఉండడం నా అదృష్టం. గ్రామీణ అభివృద్ధికి కేంద్రం, రాష్ట్రం కట్టుబడి ఉంది.' అని పవన్ పేర్కొన్నారు.

వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు

గత ప్రభుత్వం వాలంటీర్లను మోసం చేసిందని పవన్ మండిపడ్డారు. పార్టీలపరంగా విభేదాలు ఉండొచ్చు కానీ.. అభివృద్ధి కోసం అందరూ కలిసి పని చేయాలని అన్నారు. 'జీతాలు పెంచాలని జీవోలో ఎక్కడా లేదు. వైసీపీ గ్రామ వాలంటీర్లను దారుణంగా మోసం చేసింది. వారికి ఇచ్చిన మాటను నెరవేరుద్దామని చూస్తుంటే ఎక్కడా జీవోలో వాళ్లు లేరు. అవి ఉద్యోగాలే కావు. ఇదొక సాంకేతిక సమస్యగా మారింది. ఓ వైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం సహా అన్ని వ్యవస్థలను బలోపేతం చేయాలి. కీలక పంచాయతీరాజ్ శాఖని మరింత బలోపేతం చేయడానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఎంపీ నిధుల ద్వారా కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ.750 కోట్లు 30 వేల పనులకు ఇంకో నెల రోజుల్లో విడుదలవుతాయి. గత ప్రభుత్వం నిధులు మన ప్రభుత్వం ఎక్కడా ఆపట్లేదు. గత ప్రభుత్వం 12,900 గ్రామ పంచాయతీల్లోని రూ.8,629 కోట్ల నిధులు వాడేసుకున్నారు. తిరిగి వాటిని జమ చేయాలని కోరుతున్నారు. ఈ అంశాలను సీఎం, ఆర్థిక శాఖ దృష్టికి తీసుకెళ్తాను. ఈ విషయాన్ని కేబినెట్‌లో చర్చిస్తాను. పెండింగ్ నిధుల విడుదలకు కేబినెట్‌లో చర్చించి ఆమోదం తెలుపుతాం.' అని పేర్కొన్నారు.

పంచాయతీల బలోపేతమే లక్ష్యం

'ప్రధాని మోదీ కూడా గ్రామీణాభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. గత ప్రభుత్వం బాధ్యత లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించింది. సరిచేయడానికి చంద్రబాబు అనుభవం కీలకంగా మారింది. పంచాయతీలను బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నాం. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతీ గ్రామానికి తాగునీరు అందిస్తాం. చెరువుల్లో పూడికలు తీసి, నీరు కలుషితం కాకుండా చూడాలి. పంచాయతీరాజ్ వ్యవస్థలో అవినీతిని నిర్మూలించేలా చర్యలు తీసుకుంటాం.' అని పవన్ తెలిపారు.

Also Read: Supreme Court : రూల్స్ మధ్యలో మార్చడానికి లేదు- ఉద్యోగ నియామక ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

About the author Ganesh Guptha

గణేష్ గుప్త గత రెండున్నరేళ్లుగా ABPలో పని చేస్తున్నారు. ఐదేళ్లుగా జర్నలిజంలో ప్రముఖ తెలుగు మీడియా ఛానళ్లలో పని చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. ప్రముఖ మీడియా సంస్థలు ఈటీవీ భారత్, Way2News, Lokal యాప్స్‌లో కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలక! కీలక సమావేశాలకు డుమ్మా! బుజ్జగిస్తున్న చంద్రబాబు!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
ECI Special Summary Revision: తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
తెలుగు రాష్ట్రాల్లో కోటికిపైగా ఓట్ల గల్లంతు - రాజకీయ పార్టీలు ఎందుకు సీరియస్‌గా తీసుకోవడం లేదు?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana 22A Lands Issue: తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
తెలంగాణలో 22ఏ భూప్రకంపనలు! పొంగులేటిని టార్గెట్ చేస్తున్న విపక్షాలు!
Peddi Sudarshan Reddy Wife Crying: నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
నర్సంపేటలో అర్ధరాత్రి హైడ్రామా! మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు! కంటతడి పెట్టిన భార్య!
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Irumudi Censor Review: 'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
'ఇరుముడి' సెన్సార్ రివ్యూ... రవితేజ సినిమా రిపోర్ట్ ఎలా ఉందంటే?
AP DSC Notification 2026: ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగులకు తీపి కబురు! 3000 పోస్టులతో అక్టోబర్‌లో డీఎస్సీ నోటిఫికేషన్! పూర్తి వివరాలు ఇవే!
Telangana Political War: డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
డిజిటల్ వర్సెస్ డెమోక్రటిక్ మాస్ - బీఆర్ఎస్ స్క్రీన్ ప్రచారం పై రేవంత్ రెడ్డి స్ట్రీట్ వార్ ప్రభావమెంత?
Embed widget