Cm Jagan: వరద బాధిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన... బాధితులకు అండగా ఉంటామని హామీ... తక్షణ సాయం రూ.189 కోట్లు ముంజూరు
చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. బాధితులతో మాట్లాడిన ఆయన.. ఆదుకుంటామని హామీ ఇచ్చారు. తక్షణ సాయం కింద రూ.189 కోట్లు మంజూరు చేశామన్నారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి జగన్ పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా తిరుపతిలోని శ్రీకృష్ణ నగర్‌లో వరద బాధితులను సీఎం జగన్ పరామర్శించారు. వరద బాధితులతో మాట్లాడిన సీఎం.. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధైర్యంగా ఉండాలని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని జగన్ వారికి భరోసా ఇచ్చారు. వరద తీవ్రతపై ఫొటో ప్రదర్శనను సీఎం పరిశీలించారు. తిరుపతిలో వరద నష్టాన్ని ఫొటో ప్రదర్శన ద్వారా అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. అనంతరం తిరుచానూరు పాడిపేట వద్ద స్వర్ణముఖి నదిపై దెబ్బతిన్న వంతెనను సీఎం పరిశీలించారు. స్థానికులు చెప్పిన సమస్యలను విన్న సీఎం...బాధితులకు అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
తక్షణ సాయం కింద రూ.189 కోట్లు మంజూరు
వరదల్లో ఇళ్లు కోల్పోయిన వారికి ఇళ్లు మంజూరు చెయ్యాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. తక్షణ సాయం కింద రూ.189 కోట్లు మంజూరు చేశామని తెలిపారు. కృష్ణా నగర్‌లో కిడ్నీ బాధిత మహిళకి వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రాణాలకు తెగించి వరద సహాయక చర్యల్లో పాల్గొన్న పోలీస్ కానిస్టేబుల్ ప్రసాద్ సహా మరో ముగ్గురిని సీఎం అభినందించారు. చంద్రగిరి, తిరుపతి రూరల్ మండలాలతో పాటు చంద్రగిరి నియోజకవర్గంలో రహదారులు భవనాలు, వ్యవసాయం, ఉద్యానవన, గృహనిర్మాణం, విద్యుత్ శాఖలకు సంబంధించి వరద నష్టంపై అధికారులు సీఎంకు వివరించారు.
Also Read: 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న సీఎం జగన్ - సమాచారం లేదన్న ఉద్యోగ సంఘాలు !
వరద ప్రభావిత ప్రాంతాల పర్యటనలో భాగంగా సీఎం శ్రీ వైఎస్ జగన్ శుక్రవారం చిత్తూరు జిల్లా రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో పర్యటించి బాధితులను పరామర్శించారు. అధికారులు వచ్చారా, ప్రభుత్వ సాయం అందిందా అని పలకరిస్తూనే అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. 1/2 pic.twitter.com/JNc4CFEhQz
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) December 3, 2021
నెల్లూరు జిల్లాలో సీఎం పర్యటన
చిత్తూరు జిల్లాలో పర్యటన ముగించుకుని నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలనకు సీఎం జగన్ వెళ్లారు. నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌కు చేరుకున్న సీఎం అక్కడ నుంచి రోడ్డు మార్గంలో నెల్లూరు గ్రామీణంలోని దేవరపాలెంలో పర్యటించారు. అక్కడ వరదలు కారణంగా దెబ్బతిన్న రహదారులు, పంటలు, కోతకు గురైన కరకట్టను పరిశీలించారు. రైతులను ఆదుకుంటామని సీఎం హామీ ఇచ్చారు. వరద నష్టంపై అధికారులు ఏర్పాటుచేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సీఎం పరిశీలించారు. ప్రజాప్రతినిధుల నుంచి వినతి ప్రతాలను ముఖ్యమంత్రి స్వీకరించారు. జొన్నవాడ వద్ద తెగిపోయిన పెన్నా నది పొర్లు కట్టని సీఎం పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడి నష్టంపై ఆరా తీశారు. జొన్నవాడ వద్ద తెగిపోయిన పెన్నా నది కట్టను సీఎం జగన్ పరిశీలించారు. అక్కడి రైతులతో జగన్ మాట్లాడి నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెనుబల్లిలో దెబ్బతిన్న రోడ్లు, పాఠశాల, పంట పొలాలను సీఎం జగన్ పరిశీలించారు.
Also Read: ఫేక్ వీడియోతో దుష్ప్రచారం.. ఢిల్లీలో ఏపీ పరువును టీడీపీ ఎంపీలు తీస్తున్నారన్న మార్గాని భరత్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి