MP Margani : ఫేక్ వీడియోతో దుష్ప్రచారం.. ఢిల్లీలో ఏపీ పరువును టీడీపీ ఎంపీలు తీస్తున్నారన్న మార్గాని భరత్ !
పార్లమెంట్‌లో తాను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఫేక్ వీడియోలు సృష్టించి దుష్ప్రచారం చేస్తున్నారని టీడీపీ నేతలపై వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు గుప్పించారు.
లోక్‌సభలో తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి ..వీడియోను మార్ఫింగ్ చేసి టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని రాజమండ్రి వైఎస్ఆర్‌సీపీ ఎంపీ మార్గాని భరత్ ఆరోపించారు. కోవిడ్ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలకు కేంద్రమే ఎఫ్ఆర్బీఎం పరిమితులు పెంచిందని లోక్ సభలో తాను మాట్లాడితే.. దానిని కూడా టీడీపీ ఎంపీలు వక్రీకరించారన్నారు. ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ లో నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి.. ఇప్పుడు మాట్లాడినట్టు సృష్టించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఫస్ట్ బడ్జెట్ స్పీచ్ లో భాగంగా, మొట్టమొదటి సారి లోక్ సభలో నేను మాట్లాడుతూ.. "చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు కేవలం రూ. 100 కోట్లు నిల్వలు మిగిల్చి, రూ. 4 లక్షల కోట్ల అప్పులు మిగిల్చారని" చెబితే, దానినిమార్ఫింగ్ చేసి, ఫేక్ వీడియోలు సృష్టించి ప్రచారం చేయడం.. దానిపై టీడీపీ ఎంపీలు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం శోచనీయమన్నారు. వీడియోను మీడియా ఎదుట మార్గని భరత్ ప్రదర్శించారు.
Also Read : 10 రోజుల్లో పీఆర్సీ ప్రకటిస్తామన్న సీఎం జగన్ - సమాచారం లేదన్న ఉద్యోగ సంఘాలు !
ఢిల్లీలో తనకున్న ఇద్దరు, ముగ్గురు ఎంపీలను పెట్టుకుని రాష్ట్రం పరువును తీసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఓ పథకం మత , కుల , గంజాయి రాజకీయాలు.. ఆఖరికి తన ఇంట్లో ఆడవారిని కూడా రోడ్డు మీదకు తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ప్రజలు అన్నీ అర్థం చేసుకుని ఛీ కొడుతున్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలన్నారు. కరోనా సంక్షోభంలోనూ ఏ ఒక్క సంక్షేమ పథకం కూడా ఆగకుండా, పేదవారికి అండగా సీఎం జగన్ నిలబడ్డారని మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. పథకాల అమలులో దేశానికే ఏపీని రోల్ మోడల్ గా నిలిపారన్నారు.
Also Read : మరో మహాభారతం... పల్నాటి యుద్ధం ! వీరారాధన ఉత్సవాలు ప్రారంభం !
అప్పులకు ఆది పురుషుడు చంద్రబాబు నాయుడు అయితే.. జగన్ ప్రభుత్వం మీద టీడీపీ ఎంపీలు విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు. అమరావతి రాజధానిని చంద్రబాబు కట్టించాడని ప్రగల్భాలు పలుకుతున్నారని.. అక్కడ నాలుగు రేకుల షెడ్లుతప్ప ఏముందని ప్రశ్నించారు. బీజేపీతో పార్టనర్ గా ఉండి, ఎన్నికల్లో కలిసి పోటీ చేసి చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఎందుకు ప్రశ్నించలేదన్నారు. అధికారంలో ఉంటే ఒక మాట, దిగిపోతే మరో మాట మాట్లాడటం టీడీపీకే చెల్లిందని మీరు మాట్లాడే అబద్ధాలన్నింటినీ ప్రజలు నమ్ముతారనుకుంటే పొరపాటేనని టీడీపీ నేతలకు స్పష్టం చేశారు.
Also Read: ఏపీలో అధికార ఎమ్మెల్యేలపై కేసుల ఎత్తివేత.. సుమోటోగా హైకోర్టు విచారణ !
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి మెజార్టీతో నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఎంపీల అవసరం ఉండి ఉంటే.. కచ్చితంగా ఎప్పుడో మనకు ప్రత్యేక హోదా వచ్చి ఉండేది. ప్రత్యేక హోదా కోసం మా పోరాటం ఆగదుని భరత్ తెలిపారు. టీడీపీ హయాంలో గంజాయి దేశాలు దాటిపోయిందన్నారు . వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏవోబీలో అక్రమంగా సాగు అవుతున్న గంజాయిని పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఎస్ఈబీని పెట్టారు కాబట్టే పట్టుబడుతోందన్నారు. పేదలకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపైన కూడా నోటికొచ్చినట్లు విమర్శలు చేస్తున్నారని భరత్ విమర్శించారు. ఎంపీ రఘురామకృష్ణరాజు టీడీపీతో కలిసిపోయి, టీడీపీ అజెండాను మోస్తున్న వ్యక్తి. అటువంటి వ్యక్తి పార్లమెంటులోనూ, నిత్యం మీడియాలోనూ అర్థంపర్థంలేని విమర్శలు చేస్తే, ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తే.. రాష్ట్ర ప్రజలెవరూ నమ్మరన్నారు.
Also Read: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పర్మినెంట్ ఎప్పుడు ? లాంఛనాలు పూర్తి చేసినా కన్ఫర్మ్ చేయని ప్రభుత్వం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి