(Source: ECI/ABP News/ABP Majha)
Jagananna Amma Vodi Funds: మన పిల్లలు ప్రపంచాన్ని ఏలాలి- అమ్మఒడి పథకం నిధుల విడుదల సందర్భంగా జగన్ ఆకాంక్ష
Jagananna Amma Vodi Funds: వరుసగా నాలుగో ఏడాది అమ్మఒడి పథకం నిధులను ఏపీ సీఎం జగన్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 42.61 లక్షల లబ్ధిదారుల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేశారు.
Jagananna Amma Vodi Funds: 2022 -23 విద్యాసంవత్సరానికి అమ్మ ఒడి పథకం నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. వరుసగా నాలుగో ఏడాది బటన్ నొక్కి తల్లుల ఖాతాల్లో నిధులు జమ చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కార్యక్రమంలో జగన్ 42.61లక్షల మంది తల్లుల ఖాతాల్లోకి రూ.6,392.94 కోట్లు జమ చేశారు. ఈ సందర్భంగానే ఏపీ సీఎం జగన్ మాట్లాడుతూ పది రోజుల పాటు పండుగల జగనన్న అమ్మ ఒడి కొనసాగుతుందని తెలిపారు.
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు మొత్తం 83.15 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరిందని జగన్ అన్నారు. నాలుగేళ్లలో కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రూ.26,067.28 కోట్ల లబ్ధి చేకూర్చినట్లు పేర్కొన్నారు. విద్యా రంగంలో సంస్కరణలపై అక్షరాలా రూ.66,722.36 కోట్లను వినియోగించామన్నారు. స్కూళ్లు, కాలేజీల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నిధులు జమ అవుతున్నాయని అన్నారు. అవినీతి, వివక్ష లేకుండా అన్ని ప్రాంతాలు, పార్టీల వాళ్లకు నిధులు అందజేస్తున్నామని తెలిపారు. తల్లులు తమ పిల్లలను బడికి పంపించేందుకు అమ్మఒడి పథకం తీసుకొచ్చామని.. ప్రపంచ స్థాయిలో పిల్లలు పోటీ పడేలా తీర్చి దిద్దుతున్నామన్నారు. ప్రపంచాన్ని ఏలే పరిస్థితికి ఏపీ పిల్లలు రావాలనే లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. వచ్చే తరం మనకంటే బాగుండాలనే ఉద్దేశంతో పని చేస్తున్నామని పేర్కొన్నారు.
నాలుగేళ్లలో కేవలం జగనన్న అమ్మఒడి పథకం ద్వారా రూ.26,067.28 కోట్ల లబ్ధి చేకూర్చి... విద్యారంగంలో సంస్కరణలపై అక్షరాలా రూ.66,722.36 కోట్లు వ్యయం చేశారు సీఎం వైయస్ జగన్
— YSR Congress Party (@YSRCParty) June 28, 2023
నేడు పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో వరుసగా నాలుగో ఏడాది అమ్మఒడి నిధులను అక్కాచెల్లెమ్మల ఖాతాల్లో నేరుగా బటన్… pic.twitter.com/8ryfkQtW0I
పిల్లలకు అర్థమయ్యేందుకు డిజిల్ బోధనను తీసుకొచ్చామన్నారు జగన్. డిజిటల్ విద్యను ప్రోత్సహిస్తూ.. ట్యాబ్‌లు సైతం అందిస్తున్నామన్నారు. విద్యార్థులకు తొలిసారిగా బైలింగ్యువల్ పుస్తకాలు కూడా ఇచ్చామన్నారు. వంద శాతం పూర్తి ఫీజు రీయంబర్స్ మెంట్ జగనన్న విద్యా దీవెన అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో మాత్రమే అమ్మఒడి అమలు అవుతుందని స్పష్టం చేశారు. విదేశాల్లో పెద్ద చదువుల కోసం విద్యార్థులకు ఎక్కడ సీటు వచ్చినా.. కోటి 25 లక్షల అందజేస్తున్నామన్నారు. బడులు ప్రారంభం అయిన వెంటనే మెరుగైన విద్యా కానుక కిట్లు అందజేస్తున్నట్లు వెల్లడించారు.
వరుసగా నాలుగో ఏడాది అమ్మఒడి పథకం కింద.. పిల్లలను బడికి పంపించే 42,61,965 మంది నా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో రూ.6,392.94 కోట్లు జమ చేయడం జరుగుతోంది. ఈ పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ చదివే 83,15,341 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. ఇప్పటివరకు ఒక్క అమ్మఒడి ద్వారానే… pic.twitter.com/l0Xu3T2wl4
— YSR Congress Party (@YSRCParty) June 28, 2023
పేదరికం నుంచి బయటపడాలంటే చదువు ఒక్కటే మార్గమని నమ్మిన వ్యక్తి మన సీఎం వైయస్ జగన్ గారు. ప్రభుత్వ పాఠాశాలల్లో చదివే విద్యార్థులకు 9 రకాల సదుపాయాలు కల్పించి చదువుల విప్లవం తీసుకువచ్చారు. అందుకే రాష్ట్రంలోని ప్రతి పేద విద్యార్థి అమ్మని మించిన దైవం లేదు.. అన్న… pic.twitter.com/2raruS3uTf
— YSR Congress Party (@YSRCParty) June 28, 2023