DA To AP Govt Employees: ఏపీ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ ప్రకటించిన సీఎం చంద్రబాబు
ఏపీ ఉద్యోగులకు దీపావళి కానుక.. డీఏ ప్రకటించిన సీఎం చంద్రబాబు

AP Govt DA hike to Govt Employees | అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుక ప్రకటించారు. ఒక DA ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. నవంబర్ 1 నుంచి డీఏ జమ చేస్తామన్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఇబ్బందులు ఉన్నా డీఏ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఉండవల్లిలోని తన నివాసంలో సీఎం చంద్రబాబు ఉద్యోగ సంఘాల నేతలు, మంత్రులతో శనివారం సమావేశం అయ్యారు.
ఉద్యోగులకు దీపావళి కానుక
ఏపీ సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. కొన్ని డీఏలు పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఒక డీఎ ఉద్యోగులకు చెల్లించాలని నిర్ణయించాం. నవంబరు 1 నుంచి అమలు అయ్యేలా డీఏ చెల్లింపు అమలు చేస్తాం. దీనికి రూ160 కోట్ల ఖర్చు అవుతుంది. పోలీసులకు 1 సరెండర్ లీవ్ క్లియర్ చేస్తాం. 2 విడతల్లో ఈ చెల్లింపులు చేయనున్నాం. రూ.210 కోట్లు రెండు విడతల్లో చెల్లిస్తాం.

60 రోజుల్లోగా వ్యవస్థలన్నీ స్ట్రీమ్ లైన్ చేసి రియల్ టైమ్ లో ఆరోగ్య పరమైన వ్యయాన్ని స్ట్రీమ్ లైన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాం. 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్స్ రిటైర్మెంట్ వరకు వినియోగించుకునే అవకాశం కల్పిస్తాం. చైల్డ్ కేర్ లీవ్స్ (Child Care Leaves) వినియోగంలో వయోపరిమితి లేదు. ఈ లీవ్ లను ఉద్యోగ విరమణ వరకూ వినియోగించుకునేందుకు అవకాశం కల్పించాం. ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు త్వరలో క్లియర్ చేస్తాం. ఉద్యోగ సంఘాల భవనాలకు చెందిన ప్రాపర్టీ టాక్స్ మాఫీ చేస్తాం. 4వ తరగతి ఉద్యోగుల గౌరవాన్ని మరింత పెంచేలా రీ డెసిగ్నేట్ చేస్తామన్నారు’ సీఎం చంద్రబాబు.
ఉద్యోగులకు పెండింగ్‌లో 4 డీఏలు
‘గత వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన విధ్వంసాన్ని సరిచేయడానికి 15 నెలలు పట్టింది. రాష్ట్ర విభజన వల్ల చాలా నిర్మాణాత్మక మార్పులు వచ్చాయి. ఉద్యోగులు ఎక్కువ అయ్యారు. అదే సమయంలో మన ఆదాయం తగ్గింది. ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం 34 వేల కోట్లు బకాయి చెల్లించాలి. ఉద్యోగులకు 4 డీఏలు పెండింగ్ ఉన్నాయి. రూ. 7000 కోట్ల డీఏ బకాయిలు వచ్చాయి. రాష్ట్రాలు క్యాపిటల్ ఎక్సపెండిచర్ పెంచి ఆదాయాలు పెంచుకుంటే ఏపీలో రివర్స్ అయ్యింది. ఎక్సైజ్ శాఖలో భవిష్యత్తులో రానున్న ఆదాయంపైనా అప్పు తెచ్చారు’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర కీలకం. సీపీఎస్ అంశంపై త్వరలోనే చర్చించి పరిష్కరిస్తాం. పీఆర్సీలో వెసులుబాటు కావాలి. ఉద్యోగులకు విషయం తెలియాలి కనుక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సహా ఏ విషయాలు దాచడం లేదు. ఉద్యోగులు సంతోషంగా దీపావళి జరుపుకోవాలి. రేపట్నుంచి ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేసి మరిన్ని ఫలితాలు సాధిస్తారని ఆశిస్తున్నాను - ఏపీ సీఎం చంద్రబాబు






















