CM Chandrababu: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన - ప్రజావేదిక కూల్చేసిన చోటు నుంచే ప్రారంభం, శంకుస్థాపన ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం
Andhrapradesh News: సీఎం చంద్రబాబు అమరావతి పర్యటన గురువారం ప్రారంభమైంది. తొలుత ప్రజావేదికను పరిశీలించిన ఆయన అనంతరం నిర్మాణాలు పరిశీలించనున్నారు.
CM Chandrababu Amaravathi Tour: ఏపీ సీఎం చంద్రబాబు (CM Chandrababu) గురువారం అమరావతిలో (Amaravathi) పర్యటిస్తున్నారు. ఉండవల్లి ప్రజావేదిక నుంచి పర్యటన ప్రారంభించిన ఆయన.. జగన్ ప్రభుత్వం కూల్చేసిన ప్రజావేదిక (Prajavedika) శిథిలాలను పరిశీలించారు. ఉద్దండరాయుని భూమి పూజ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అక్కడ చంద్రబాబు మోకాళ్లపై కూర్చుని సాష్టాంగ నమస్కారం చేశారు. అనంతరం రాజధాని నిర్మాణాలను పరిశీలించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్, అసంపూర్తిగా మిగిలిన అఖిల భారత సర్వీస్ అధికారులు, మంత్రులు, న్యాయమూర్తుల గృహ సముదాయాన్ని పరిశీలిస్తారు. ఐకానిక్ నిర్మాణాల కోసం గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో పనులు మొదలుపెట్టిన ప్రాంతాలనూ పరిశీలిస్తారు. కాగా, వైసీపీ హయాంలో 3 రాజధానుల పేరుతో ఈ ప్రాంతంలో నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ క్రమంలో వాటిని పరిశీలించి ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయనున్నారు. కాగా, సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన తొలిసారిగా పోలవరం ప్రాజెక్టును సందర్శించారు. అనంతరం రాజధాని అమరావతిని సందర్శిస్తున్నారు. అటు, సీఎంగా ఆయన బాధ్యతలు చేపట్టక ముందు నుంచే అధికారులు ఇక్కడ పనులు చేపట్టారు.
అమరావతి పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు. ఉండవల్లిలో జగన్ రెడ్డి కూలగొట్టిన ప్రజావేదిక ప్రాంతాన్ని పరిశీలించిన సీఎం చంద్రబాబు గారు.
— Telugu Desam Party (@JaiTDP) June 20, 2024
జగన్ విధ్వంస మనస్తత్వానికి శిథిల సాక్ష్యం ఈ ప్రజావేదిక. 5 ఏళ్ళ నుంచి ప్రజా వేదిక వ్యర్ధాలు కూడా తీయకుండా, అక్కడే ఉంచి పైశాచిక ఆనందం పొందిన జగన్.… pic.twitter.com/nWfcNcWN5r
Also Read: Andhra Pradesh: పవన్ పేషీలోకి పవర్ ఫుల్ ఆఫీసర్ - ఆయన్నే జనసేనాని ఎందుకు కావాలనుకుంటున్నారంటే?