అన్వేషించండి

AP News : సీఎం ఫ్యామిలీపై అసభ్య పోస్టులు పెడితే ఆస్తుల జప్తు - ఏపీ సీఐడీ హెచ్చరిక !

YS Jagan News: సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టే వారికి ఏపీ సీఐడీ హెచ్చరికలు జారీ చేసింది. ఆస్తులు జప్తు చేస్తామని సీఐడీ చీఫ్ తెలిపారు.


Anhra News : ఏపీ సీఎం జగన్ (CM Jagan), కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని సీఐడీ చీఫ్ సంజయ్‌ (AP CID Chief Sanjay) హెచ్చరించారు. సోషల్ మీడియా పోస్టులపై ఆయన మీడియాతో మాట్లాడారు. సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టామని చెప్పారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని.. నిందితుల ఆస్తులు కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు.  ఇప్పటికే కొన్నింటిని గుర్తించి తొలగించామన్నారు. న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు.                               

విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.  యూకే, అమెరికా దేశాలకు సీఐడీ బృందాలు పంపామని సీఐడీ చీఫ్ చెప్పుకొచ్చారు.  ఇప్పటికే 45 కేసుల్లో ఐదుగురిపై ఎల్‌వోసీ ప్రోసీడింగ్స్ చేపట్టామన్నారు.  రాజకీయ పార్టీలపై ఉన్న అభిమానంతో అసభ్యకరపోస్టులు పెట్టి భవిష్యత్‌ను అంధకారం చేసుకోవద్దని సీఐడీ చీఫ్ హెచ్చరించారు.  అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి (YSRCP )  చెందిన నేతలపైనే కాకుండా.. ప్రతిపక్ష నేతలపై వస్తున్న సోషల్ మీడియా పోస్టులపై కూడా చర్యలు తీసుకుని పోస్టులు తొలగించాం అని తెలిపారు సీఐడీ చీఫ్.  ఇటీవల న్యాయ వ్యవస్థని కించ పరిచే విధంగా కూడా పోస్టులు పెట్టారని .. వీరిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు.                              

సీఎం వైఎస్‌ జగన్‌, ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ కార్తీక్ రెడ్డి, సమర సింహా రెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అనే అకౌంట్స్ గుర్తించామని తెలిపారు. కొన్ని పోస్టులు విదేశాల నుంచి పెడుతున్నారని అన్నారు.  ఇప్పటి వరకు ఇలా చేసిన నలుగురిపై చర్యలు తీసుకున్నాం.. సోషల్ మీడియా నుంచి అసభ్య పోస్టులు పెట్టే వారు నగరం నుంచి గ్రామ స్థాయికి చేరిందన్నారు.                                   

202 సోషల్ మీడియా అకౌంట్స్ ను మోనటరింగ్ చేస్తున్నాం.. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ ను గుర్తించాం.. అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేశామని వెల్లడించారు ఏపీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌.  మధ్య కాలంలో మంత్రులపైనా అనుచిత పోస్టులు పెడుతున్నారు. మహిళా నేతలపైనా అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు. ఇలాంటి అనుచిత పోస్టులు పెట్టినవారిపై కచ్చితంగా చర్యలుంటాయని హెచ్చరించారు. అయితే  వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టే  పోస్టులు ఘోరంగా ఉంటాయని వారు చేసే ఫిర్యాదుల్ని సీఐడీ అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. గతంలో న్యాయమూర్తులపై పోస్టులు పెట్టిన వారిని హైకోర్టు చెప్పినా పట్టించుకోకపోవడంతో సీబీఐకి కేసును అప్పగించింది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
AP Assembly special meeting: 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం - అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ తీర్మానం !
Vijayawada Terror Links Case: విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు
విజయవాడలో టెర్రర్ లింక్స్ కేసు.. హైదరాబాద్‌లో మహిళ అరెస్ట్! 13 మందిపై కేసు నమోదు

వీడియోలు

Adilabad Petrol Crisis | ఆదిలాబాద్ లో పెట్రోల్ కోసం బారులు తీరిన వాహనదారులు | ABP Desam
Ashwin Comments on MI Captain | హార్దిక్ పాండ్యాపై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు | ABP Desam
Shreyas Iyer as captain of Team India? | టీమిండియా నెక్స్ట్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్? | ABP Desam
SRH Spends 10 Crores for Uppal Stadium | 10 కోట్లతో ఉప్పల్ స్టేడియం రినోవేషన్ | ABP Desam
RCB Sold to Aditya Birla Group IPL 2026 | భారీ ధరకు అమ్ముడైన RCB | ABP Desam Bangalore

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Steel Plant Credit Game: మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
మిట్టల్ స్టీల్ ప్లాంట్ క్రెడిట్ తనదేనన్న జగన్ - పాత వీడియోతో షాకిచ్చిన టీడీపీ
Telangana Assembly Indiramma Controversy: తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
తెలంగాణ అసెంబ్లీలో ఇప్పసారా చిచ్చు - ఇందిరమ్మ పేరు తెచ్చిన బీజేపీ ఎమ్మెల్యే - తర్వాత మాటల యుద్ధమే!
Varanasi Movie Set: వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
వారణాసి సెట్‌లో ఏమున్నాయి..? రాజమౌళిని ఇండియన్ క్రిస్టోఫర్ నోలన్ అని విదేశీ మీడియా ఎందుకు అంటోంది..?
Hero Vida VX2 Plus KKR Edition: కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
కేకేఆర్ ఫ్యాన్స్ కోసం అదిరిపోయే గిఫ్ట్: హీరో వీడా స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్.. ఫీచర్లు మామూలుగా లేవుగా!
Hyundai India : హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
హ్యూందాయ్‌లో ఉన్న మోడల్స్‌ ఎన్ని? అమ్మకానికి ఎన్ని ఉన్నాయి? కొత్తగా ఎన్ని రాబోతున్నాయి?
Rakasa Trailer : ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
ఊరిలో కోట మిస్టరీ ఏంటి? - భయపెడుతూనే నవ్వించిన రాకాస ట్రైలర్
Deputy CM Pawan Kalyan: రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
రామతీర్థంలో భక్తుల కల సాకారం- గిరి ప్రదక్షిణ మార్గాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
New Corona: ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
ఉన్నవి సరిపోనట్లుగా మళ్లీ కరోనా కొత్త రకం వచ్చేస్తోందట - వ్యాక్సిన్ కూడా పని చేయదని తేల్చిన శాస్త్రవేత్తలు
Embed widget