News
News
X

Margadarsi Case : మార్గదర్శి కేసులో సీఐడీ దూకుడు, నలుగురు అరెస్టు!

Margadarsi Case : మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ సీఐడీ నలుగురిని అరెస్టు చేసింది. విశాఖ, గుంటూరు, విజయవాడ, రాజమండ్రి మార్గదర్శి శాఖల్లో పనిచేస్తున్న నలుగురిని అరెస్టు చేసింది.

FOLLOW US: 
Share:

Margadarsi Case : మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసులో ఏపీ సీఐడీ దూకుడు ప్రదర్శిస్తోంది. మార్గదర్శి చిట్ ఫండ్స్ సంస్థ నిబంధనలు ఉల్లంఘించిందని కేసులు నమోదు చేసిన సీఐడీ తాజాగా ఆ సంస్థ నలుగురు ఉద్యోగులను అరెస్టు చేసింది. మార్గదర్శి శాఖల్లో పనిచేస్తున్న...  కామినేని రామకృష్ణ (సీతమ్మధార), సత్తి రవిశంకర్ (రాజమండ్రి), శ్రీనివాసరావు(లబ్బీపేట), గొరిజవోలు శివరామకృష్ణ(గుంటూరు)లను అదుపులోకి తీసుకుంది. వారిని కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కు తరలిస్తామని సీఐడీ అధికారులు తెలిపారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో మార్గదర్శి చిట్ ఫండ్స్ కార్యాలయాలు, మేనేజర్ల ఇళ్లపై స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ సోదాలు చేసింది. మార్గదర్శి సంస్థలో నిబంధలు ఉల్లంఘనలు బయటపడ్డాయని ఏపీసీఐడీ కేసులు నమోదు చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్స్ నిబంధనలు ఉల్లంఘించిందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ కొంత కాలంగా మార్గదర్శి చిట్ ఫండ్స్‌ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. 

నిబంధనల ఉల్లంఘన ఆరోపణలు

మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌ సంస్థలో నిబంధనల ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది. ఇండివిడ్యువల్‌ గ్రూపులకు సంబంధించిన ఫారం 21ను మార్గదర్శి చిట్స్‌ సమర్పించలేదని, బ్యాలెన్స్‌షీట్లను తెలియజేసే పత్రాలను కూడా మార్గదర్శి అందజేయలేదని అధికారులు తెలిపారు. మూడు నెలలుగా మార్గదర్శికి చెందిన 444 గ్రూపులకు సంబంధించి కార్యకలాపాలను నిలిపివేశారని తెలిపారు. డిసెంబర్‌ నుంచి ఈ ఫారం నింపి ఇవ్వలేదంటున్నారు. అధికారుల చర్యలతో మార్గదర్శి బ్రాంచ్‌ల్లో చిట్స్‌ బంద్‌ అయ్యాయి. ఈ కేసులో నలుగురు ఫోర్ మెన్లను సీఐడీ ఆదివారం అరెస్ట్‌ చేసింది. నిన్నటి నుంచి మార్గదర్శికి చెందిన పలు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సీఐడీ విశాఖపట్నం మార్గదర్శి బ్రాంచ్‌ ఫోర్‌ మెన్‌ కామినేని రామకృష్ణ, రాజమండ్రి మార్గదర్శి బ్రాంచ్ ఫోర్ మెన్ సత్తి రవి శంకర్, విజయవాడ మార్గదర్శి ఫోర్ మెన్ శ్రీనివాసరావు, గుంటూరు మార్గదర్శి ఫోర్ మెన్ శివరామకృష్ణను సీఐడీ అరెస్ట్‌ చేసింది. మార్గదర్శి చిట్ ఫండ్ తనిఖీలోల్ భారీ అక్రమాలు, ఉల్లంఘనలను గుర్తించిన సీఐడీ అధికారులు చర్యలు చేపట్టారు. అక్రమాలకు పాల్పడినందుకు నలుగురు ఫోర్ మెన్లను అరెస్టు చేశామని సీఐడీ తెలిపింది.  అరెస్టు చేసిన నలుగురిని కోర్టులో హాజరుపర్చనున్నారు.   

ఎఫ్ఐఆర్ లో రామోజీరావు,  శైలాజా కిరణ్ పేర్లు             

మొత్తం మూడు చట్టాల  కింద కేసులు నమోదు చేసింది సీఐడీ. ఐపీసీ సెక్షన్ 120(B), 409, 420, 477(A) , రెడ్ విత్  34 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అధికారులు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఇన్ ఫైనాన్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ 5 ప్రకారం, అలాగే చిట్ ఫండ్ యాక్ట్ 1982  లోని సెక్షన్   76,79 ప్రకారం  ఈ ఎఫ్ఐఆర్‌లు నమోదు చేసినట్లుగా సీఐడీ తెలిపింది. ఇందులో ఇన్వెస్టింగేటింగ్ అధారిటీగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉందని సీఐడీ ఓ ప్రకటనలో తెలిపింది. నమోదైన ఎఫ్ఐఆర్‌లలో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు, మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఛైర్మన్,  అలాగే ఆ సంస్థ మేనేజింగ్ డైరక్టర్ శైలజా కిరణ్,  అలాగే ఆయా బ్రాంచీల మేనేజర్ల పేర్లను చేర్చారు. ఎన్ని ఎఫ్ఐఆర్‌లు నమోదయ్యాయన్న విషయాన్ని సీఐడీ తన ప్రకటనలో తెలియచేయలేదు. అయితే  ఏఏ నగరాల్లో బ్రాంచీల్లో కేసులు నమోదు చేశారో వివరించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, ఏలూరు, విజయవాడ, నర్సరావుపేట, గుంటూరు, అనంతపురం బ్రాంచిల్లో నిబంధనల ఉల్లంఘనపై ఈ కేసులు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.  అలాగే నర్సరావుపేట, ఏలూరు, అనంతపురం బ్రాంచీల ఫోర్ మెన్లు పరారీలో ఉన్నారని సీఐడీ తెలిపారు. ప్రస్తుతం సోదాలు ఇంకా కొనసాగుతున్నాయని వెల్లడించింది.  

 

Published at : 12 Mar 2023 07:25 PM (IST) Tags: AP News AP CID Four arrested margadarsi case

సంబంధిత కథనాలు

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Court Jobs: కోర్టుల్లో 118 కొత్త పోస్టులు మంజూరు - 3546కి చేరిన ఖాళీల సంఖ్య!

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం -  విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్

Chittoor Budget: కార్పొరేటర్ల అసంతృప్తి, అయినా బడ్జెట్ ఆమోదించిన చిత్తూరు మేయర్ అముద

Chittoor Budget: కార్పొరేటర్ల అసంతృప్తి, అయినా బడ్జెట్ ఆమోదించిన చిత్తూరు మేయర్ అముద

Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

Visakha News : విశాఖలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య- కన్నీళ్లు పెట్టిస్తున్న సూసైడ్ నోట్!

Anilkumar: వైసీపీ టికెట్ రాకపోయినా ఓకే, సీఎం జగన్ గెటౌట్ అన్నా నేను ఆయన వెంటే!

Anilkumar: వైసీపీ టికెట్ రాకపోయినా ఓకే, సీఎం జగన్ గెటౌట్ అన్నా నేను ఆయన వెంటే!

టాప్ స్టోరీస్

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

TSLPRB Exam: కానిస్టేబుల్‌ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!

KTR On Amaravati : అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?

KTR On Amaravati :   అమరావతిలో పనులు జరగడం లేదన్న కేటీఆర్ - ఎందుకన్నారో తెలుసా ?