AP New Cabinet: త్వరలో ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు.. మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు
ఏపీ మంత్రి వర్గం మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో మంత్రి వర్గంలో భారీ మార్పులుంటాయన్నారు.
![AP New Cabinet: త్వరలో ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు.. మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు AP Cabinet reshuffle minister balineni srinivas reddy says complete new cabinet is on cm jagan view AP New Cabinet: త్వరలో ఏపీ మంత్రివర్గంలో భారీ మార్పులు.. మంత్రి బాలినేని సంచలన వ్యాఖ్యలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/25/0155388ceed96b5fecc08b1b7d90b730_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గం మారనుందా.. కొత్త వాళ్లకి ఛాన్స్ రానుందా అంటే అవుననే చెప్తున్నారు మంత్రి బాలినేని. ఏపీలో త్వరలో భారీ మార్పులు జరుగుతాయని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంత్రి వర్గంలో వందశాతం కొత్తవారిని తీసుకుంటామని సీఎం జగన్ చెప్పారని ఆయన అన్నారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎంకు స్పష్టం చేశామని బాలినేని అన్నారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనన్నారు. తనకు పార్టీ ముఖ్యం కానీ పదవులు కాదని పేర్కొన్నారు.
Also Read: 13 జిల్లాల జడ్పీ ఛైర్మన్లు వీరే... కొనసాగుతున్న ప్రమాణ స్వీకారాలు...
మంత్రి పదవి పోయినా భయపడను
రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులపై మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే భారీ మార్పులుంటాయన్నారు. మంత్రివర్గంలో వంద శాతం కొత్తవారే ఉంటారని సీఎం చెప్పారని వెల్లడించారు. విధాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సీఎం జగన్ కు స్పష్టం చేశానన్నారు. మంత్రివర్గాన్ని వంద శాతం మారుస్తానని సీఎం జగన్ గతంలోనే చెప్పారని మంత్రి బాలినేని అన్నారు. మంత్రి వర్గాన్ని వంద శాతం మారిస్తే మంచిదేనని సీఎంకు తన అభిప్రాయాన్ని తెలిపానన్నారు. తనను కూడా మార్చాలని చెప్పానని బాలినేని అన్నారు. మంత్రి పదవి పోయినా తాను భయపడనని తెలిపారు. తనకు పార్టీయే ముఖ్యమని, పదవులు కాదని మంత్రి బాలినేని స్పష్టం చేశారు.
Also Read: ప్రాంతీయ పార్టీగా గుర్తింపు తెచ్చుకోలేకపోయిన జనసేన ! ఇక గాజు గ్లాస్ గుర్తు ఉండదా ?
ముందుగానే చెప్పిన సీఎం జగన్
రెండున్నరేళ్ల తరువాత మంత్రివర్గాన్ని విస్తరించి కొత్తవారికి స్థానం కల్పిస్తానని సీఎం జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయకముందే స్పష్టం చేశారు. ఆ సమయం దగ్గర పడిందనే చర్చ కూడా ఇప్పుడు వినిపిస్తోంది. తన మంత్రివర్గంలో ఎవరిని తొలగించి ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం జగన్ కసరత్తు కూడా మొదలుపెట్టారని సమాచారం వినిపిస్తుంది. అయితే తాజాగా సీఎం జగన్‌కు బదులుగా పీకే టీమ్ ఆ పని చేస్తుందనే ప్రచారం వినిపిస్తుంది. మంత్రి వర్గం నుంచి ఎవరిని తప్పించాలి, కొత్తగా ఎవరిని తీసుకోవాలనే దానిపై సీఎం జగన్ సామాజిక లెక్కలతో పాటు అభ్యర్థి సానుకూలతలను బేరీజు వేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త మంత్రి వర్గంపై సీఎం జగన్ ఇంటలిజెన్స్ ఇంతకు ముందు పలు సర్వేల సహకారం తీసుకోవాలని భావించారు. కానీ ఇప్పుడు పీకే టీమ్ ఇచ్చే నివేదికల ఆధారంగానే కొత్తగా కేబినెట్‌లోకి ఎవరిని తీసుకోవాలనే దానిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Also Read: తగ్గని కోవిడ్ వ్యాప్తి... ఏపీలో కొత్తగా 1167 కేసులు, ఏడు మరణాలు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channelసబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)