AP ZP Chairman: 13 జిల్లాల జడ్పీ ఛైర్మన్లు వీరే... పూర్తైన ప్రమాణ స్వీకారాలు... అన్ని జిల్లాల్లో వైసీపీ అభ్యర్థుల ఏకగ్రీవ ఎన్నిక
ఏపీలో 13 జిల్లాల జడ్పీ ఛైర్మన్లు ప్రమాణ స్వీకారం ప్రక్రియ ముగిసింది. ఇప్పటికే ప్రభుత్వం ఛైర్ పర్సన్ల పేర్లు ఖరారు చేసింది. వారంతా ఇవాళ ప్రమాణ స్వీకారాలు చేశారు.
ఏపీలో 13 జిల్లా జడ్పీ ఛైర్మన్లు ఖరారు అయ్యారు. 13 జిల్లాల్లోనూ వైసీపీ జెడ్పీ ఛైర్మన్లు కొలువుతీరారు. ఛైర్మన్లను ఇప్పటికే వైసీపీ ఖరారు చేసింది. ఈ మేరకు బీ-ఫారమ్ అందించింది. రాష్ట్ర వ్యాప్తంగా 660 జెడ్పీటీసీ స్థానాల్లో 640 స్థానాల్లో ఎన్నికల జరిగి ఫలితాలు వెలువడ్డాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులు చేతులు ఎత్తే విధానంలో ఆయా జిల్లాల జెడ్పీ ఛైర్మన్లను ఎన్నుకున్నారు. అన్ని జిల్లాల్లో శనివారం ఉదయం 10 గంటల నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
జిల్లాకు ఇద్దరు వైస్ ఛైర్మన్లు
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రిసైడింగ్ అధికారి జడ్పీటీసీ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం ఒక్కో జిల్లాలో ఇద్దరు కో ఆప్టెడ్ సభ్యుల ఎన్నిక, మధ్యాహ్నం 3 గంటల నుంచి జడ్పీ ఛైర్మన్, జిల్లాకు ఇద్దరు చొప్పున వైస్ ఛైర్మన్ల ఎన్నికను నిర్వహిస్తున్నారు. జడ్పీ ఛైర్మన్లతో పాటుగా ప్రతీ జిల్లాకు ఇద్దరు ఉపాధ్యక్షులను నియమిస్తున్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్ రిజర్వేషన్ వైస్ ఛైర్మన్లను వైసీపీ అధినాయకత్వం ఇప్పటికే ఖరారు చేసింది.
జడ్పీ ఛైర్ పర్సన్లు వీరే..
- అనంతపురం జిల్లా : బోయ గిరిజమ్మ(బీసీ),
- చిత్తూరు జిల్లా : శ్రీనివాసులు( బీసీ),
- తూర్పు గోదావరి జిల్లా : వేణుగోపాల్ రావు (ఎస్సీ),
- పశ్చిమ గోదావరి జిల్లా : కవురు శ్రీనివాస్ (బీసీ),
- గుంటూరు జిల్లా : హెనీ క్రిస్టినా( ఎస్సీ),
- కర్నూలు జిల్లా : వెంకట సుబ్బారెడ్డి( ఓసీ),
- కృష్ణా జిల్లా : ఉప్పాళ్ల హారిక( బీసీ),
- నెల్లూరు జిల్లా: ఆనం అరుణమ్మ( ఓసీ),
- ప్రకాశం జిల్లా : వెంకాయమ్మ (ఓసీ),
- వైఎస్సార్ కడప జిల్లా : ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి (ఓసీ),
- విశాఖపట్నం జిల్లా: జల్లిపల్లి సుభద్ర (ఎస్టీ),
- విజయనగరం జిల్లా : మజ్జి శ్రీనివాసరావు (బీసీ),
- శ్రీకాకుళం జిల్లా: విజయ( సూర్య బలిజ).
Also Read: పరిషత్ ఎన్నికల ఫలితాలపై స్పందించిన జనసేనాని... విజయం సాధించిన అభ్యర్థులకు అభినందనలు..
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతం
అనంతపురం 62 జడ్పీటీసీల ప్రమాణస్వీకారం పూర్తైంది. జడ్పీ కో-ఆప్షన్ సభ్యులుగా ఫయాజ్ వలి, అహ్మద్ బాషా ఎన్నికయ్యారు. విశాఖపట్నం జిల్లాలో 38 స్థానాలకు గాను 36 మంది జడ్పీటీసీ అభ్యర్థులు వైసీపీ నుంచి విజయం సాధించారు. జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌తో పాటు వైస్ చైర్మన్ పదవులు వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యులుగా కరీముల్లా, షేక్ అన్వర్ బాష లను కో అప్షన్ మెంబర్లుగా ఏకగ్రీవ ఎన్నికన్నారు. జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఎన్నికయ్యారు. చిత్తూరు జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా శ్రీనివాసులు(వి.కోట జడ్పీటీసీ), తూర్పు గోదావరి జిల్లా పరిషత్ ఛైర్మన్‌గా విపర్తి వేణుగోపాల రావు(పి.గన్నవరం జడ్పీటీసీ), అనంతపురం జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా బోయ గిరిజమ్మ (ఆత్మకూరు జెడ్పీటీసీ), వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్‌గా ఆకెపాటి అమర్‌నాథ్‌రెడ్డి ఎన్నిక అయ్యారు. కృష్ణా జిల్లాలో జడ్పీ ఛైర్మన్ ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 13 జిల్లాల్లో చైర్ పర్సన్, ప్రతి జిల్లాకు ఇద్దరు వైస్ చైర్ పర్సన్లకు ఎన్నిక జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 శాతానికి పైగా పదవులు దక్కనున్నాయి.
Also Read: ఏకపక్షంగా పరిషత్ ఎన్నికలు... అందుకే బహిష్కరించామన్న చంద్రబాబు.... పోలీసులపై లోకేశ్ ఫైర్