BJP Vishnu : మోదీ విజయాలు - జగన్ వైఫల్యాలపై నెల రోజుల ప్రచారం - ప్రతీ జిల్లాలో బహిరంగసభ పెడతామన్న బీజేపీ !
ఏపీ బీజేపీ నేతలు సీఎం జగన్ పై మండిపడ్డారు. నెల రోజుల పాటు మోదీ ప్రభుత్వ విజయాలు, జగన్ వైఫల్యాలపై ప్రచారం చేసే కార్యాచరణ ప్రారంభించారు.
BJP Vishnu : దేశంలో తొమ్మిదేళ్ల నరేంద్ర మోదీ పాలన సేవ, సుపరిపాలన, పేదల సంక్షేమమే ధ్యేయంగా కొనసాగుతోందని ఏపీ బీజేపీ ప్రదాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తొమ్మిది ఏళ్ల ప్రదాని మోదీ పరిపాలనా విజయాలపై ఇంటింటికి ప్రచారం చేసే నెల రోజుల కార్యక్రమాన్ని తిరుపతిలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నరేంద్ర మోదీ పాలనలో దేశం సశ్యశ్యామలమవుతుందన్నారు. ఏపీలో అమలు అవుతున్న పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులకు నిధులు కేంద్రం నుంచే వస్తున్నాయని కానీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుని ప్రచారం చేసుకుంటోందన్నారు. ఈ విషయాలన్నీ ప్రజలకు వివరిస్తామన్నారు.
9 ఏళ్ల పాలనపై ప్రతీ ఇంటికి ప్రచారం
ప్రధాని నరేంద్ర మోడీ తొమ్మిదేళ్ల పాలనలో సాధించిన విజయాలు, ఏపీకి చేసిన మేళ్లపై ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణను బీజేపీ అమలు చేస్తోంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్థన్ రెడ్డి నేతృత్వంలో ప్రత్యేకంగా ప్రచా ర కమిటీ ఈ ప్రచార బాధ్యతను తీసుకుంది. జూన్ 30 వరకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ప్రధానంగా దేశం సాధించిన పురోగతి, అంత ర్జాతీయ స్థాయిలో దేశానికి వచ్చి న పేరు ప్రతిష్టలు, ఏపీకి వివిధ ప్రాజెక్టుల రూపంలో ఇచ్చి న రూ.లక్షల కోట్ల సా యం వంటి పలు అం శాలను ప్రజల్లోకి తీసు కెళ్లనున్నారు. శక్తి కేం ద్రాల స్థాయిలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించడంతో పా టు జిల్లా, రాష్ట్ర స్థాయి లో వివిధ రూపాల్లో ప్ర త్యేక కార్యక్రమాలు చేపడతామని విష్ణువర్ధన్ రెడ్డి ప్రకటించారు. ఇప్పటికే కేంద్ర మంత్రి భగవంత్ ఖూబా ఏపీకి వచ్చారు. పలువురు కేంద్ర నాయకులుకూడా వచ్చే నెల రోజుల్లో రానున్నారు.
అభివృద్ధిపై చర్చకు వైసీపీకి భయం
అభివృద్ధి పైనా వైసిపి పార్టీ చర్చకు రావడానికి భయమని విష్ణువర్ధన్ రెడ్డి విమర్శించారు. ఏపిలో అభివృద్ధి శూన్యం...రాష్ట్ర ఆదాయం పెరగడంలేదు , ప్రజల సోమ్ము , ప్రజలకు పంచి గోప్పలు చెప్పుకుంటున్నారో ప్రశ్నించారు. 4 సంవత్సరాలలో ఎపిలో ఎంతమంది కొత్త వైద్యులు వచ్చారు,ఎన్ని హాస్పటల్స్ కట్టారని ప్రశ్నించారు. ఢిల్లీ ఆర్ధిక శాఖ మంత్రిగా బుగ్గన మారాడు...అప్పు చేయకుండా ఏరోజు జగన్ ప్రభుత్వం లేదన్నారు. ఎపిలో ఉండేది పేరుకే మంత్రులు...ఉన్నారు అంటే ఉన్నారు.. తిట్టడానికి బయటకు వస్తారని విమర్శించారు. దేశంలో ఎక్కడ పెరగని ధరలు ఎపిలో పెరుగుతుంటాయి. ఏపిలో ఎక్సైజ్ శాఖ మాత్రమే బాగానే పనిచేస్తోందని సెటైర్ వేశారు. మద్యం శాఖ మంత్రికి ప్రపంచ స్ధాయిలో అవార్డు ఇవ్వాల్నారు. రిజిస్టేషన్ ఆపేసి మరి కొత్త జీవో తెచ్చి ఆదాయం పెంచుకోవడానికి చార్జీలు పెంచుతున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో బీజేపీ బహిరంగ సభలు
వైసీపీ సర్కారు వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండ గట్టేందుకు జిల్లాల వారీగా బీజేపీ కార్యాచరణ రూపొందించుకుంది. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయాన్ని, కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేయడంతో పాటు రాష్ట్ర స్థితిగతులను ప్రజలకు వివరించేందుకు బహిరంగసభలు కూడా నిర్వహించనున్నారు. రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న సాయాన్ని, కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేయడంతో పాటు రాష్ట్ర స్థితిగతులను ప్రజలకు వివరిస్తామని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. ఓ వైపు ప్రభుత్వ వైఫల్యాల ను ఎండగడుతూనే..రాష్ట్ర అభివృద్ధిలో ప్రధాని మోడీ పాత్రను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వైఫ ల్యాలు, ప్రజా ప్రతినిధుల అవినీతిపై చార్జిషీటు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. పలు జిల్లాల్లో ప్రజలను భాగస్వాములను చేసి అభి యోగపత్రాల నమోదు కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఏపీ ప్రభుత్వం ఇస్తున్న పథకాల్లో ఉన్న కేంద్ర నిధులు.. వాటిని కేంద్రం దారి మళ్లిస్తున్న వైనం గురించి ప్రజలకు వివరించాలని నిర్ణయించారు.