Breaking News Live: మారేడుమిల్లి వద్ద లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు-20 మందికి గాయాలు
ఏపీ, తెలంగాణ సహా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో నేటి బ్రేకింగ్ న్యూస్ అప్‌డేట్స్ ఇక్కడ పొందొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతుంటుంది. తాజా సమాచారం కోసం రీఫ్రెష్ చేస్తుండండి.

Background
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత పెరగనుంది. పలు జిల్లాల్లో పగటి ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు నమోదు కానున్నాయి. ఓ వైపు మధ్యాహ్నం పగటి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నా, రాత్రి వేళల్లో చలి గాలుల ప్రభావం అధికంగా ఉందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొన్నాయి. గత ఐతేళ్లతో పోలిస్తే ఈ సారి వేడి, ఉక్కపోత ఎక్కువగా ఉంటాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
ఉత్తర కోస్తాంధ్ర యానాంలో..
ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ కేంద్రం తెలిపింది. మార్చి 15 న ఉత్తర భారతదేశం నుంచి వీచనున్న పొడిగాలుల వల్ల ఎండల తీవ్రత మరింత అధికం అవుతుంది. కొన్ని చోట్ల 43 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవ్వనుంది. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉండనుంది. విశాఖ, విజయవాడ, రాజమండ్రి, గుంటూరు, కర్నూలులో వేడి ఎక్కువగా ఉంటుంది. విశాఖలో అయితే ఇక ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడతారు. బాపట్లలో 34 డిగ్రీలు, కాకినాడలో 34.7 డిగ్రీలు, కళింగపట్నంలో 32.8 డిగ్రీలు, నందిగామలో 38.4 డిగ్రీలు, నెల్లూరులో 34 డిగ్రీలు, తునిలో 36.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 34 డిగ్రీలు, అమరావతిలో 36.5 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో పగటి పూట వేడి అధికం అవుతుంటే, రాత్రిపూట చలి గాలులు వీస్తున్నాయి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి, విశాఖ, విజయనగరం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో కొన్ని చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతను తాకనుంది. రాత్రులు కాస్తంత చల్లగా ఉన్నా మధ్యాహ్నాలు మాత్రం ఎండ వేడి ఎక్కువగా ఉంటుంది. రానున్న పది రోజుల దాక ఇదే పరిస్ధితి. జాగ్రతలు తీసుకోవడం చాలా చాలా ముఖ్యం. రోజుకు కనీసం 5 లీటర్ల వరకు మంచి నీళ్లు తాగాలని అధికారులు సూచించారు. మధ్యాహ్నం వేళ బయటకు వెళ్తే గొడుగు తీసుకెళ్లాలని, కొబ్బరి బొండాలు, పళ్ల రసాలు తాగడం ద్వారా డీహైడ్రేషన్‌కు గురికాకుండా ఉంటారని పేర్కొన్నారు.
తెలంగాణ వెదర్ అప్‌డేట్
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు ప్రాంతాలైన సూర్యాపేట, మహబూబాబాద్, నల్గొండ, భద్రాద్రి, ములుగు, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డీగ్రీలను తాకే అవకాశాలు ఉన్నాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీలు సైతం దాటుతుంది. మరోవైపు హైదరాబద్ లో వేడిగా 38-39 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు ఉంటాయి. కానీ వరంగల్, నల్గొండ, నిజామాబాద్, రామగుండం వైపు ఎండల తీవ్రత కారణంగా ఉక్కపోత పెరుగుతుంది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర నేడు (Todays Gold Rate) కాస్త పెరిగింది. గ్రాముకు నేడు రూ.1 పెరిగింది. ఉక్రెయిన్ - రష్యా యుద్ధ వాతావరణంతో కొద్ది రోజులుగా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల్లో భారీ ఎత్తున పెరుగుతున్న సంగతి తెలిసిందే. వెండి ధర మాత్రం నేడు స్థిరంగా ఉంది. తాజాగా 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర, ఇవాళ హైదరాబాద్ (Hyderabad Gold Rate) మార్కెట్‌లో రూ.48,410 గా ఉంది. 24 క్యారెట్ల ప్యూర్ బంగారం ధర ప్రస్తుతం రూ.52,800 గా ఉంది. ఇక స్వచ్ఛమైన వెండి ధర హైదరాబాద్ మార్కెట్‌లో నేడు రూ.74,700 వద్ద ఉంది. తెలంగాణ వ్యాప్తంగా మిగతా నగరాల్లోనూ ఇవే ధరలు అమల్లో ఉంటున్నాయి.
ఏపీలో బంగారం రేట్లు ఇవీ.. (Gold Rates in Andhrapradesh)
ఇక విశాఖపట్నం (Gold Rate in Vizag) మార్కెట్‌లోనూ 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,410 గా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.52,810గా ఉంది. ఇక్కడ వెండి ధర హైదరాబాద్ తరహాలోనే కిలో రూ.74,700 గా ఉంది. విజయవాడలోనూ పసిడి ధర అంతే పెరిగింది. 22 క్యారెట్ల ఆర్నమెంటు బంగారం ధర నేడు రూ.48,410 గా ఉంది. 24 క్యారెట్ల బిస్కెట్ బంగారం ధర రూ.52,810గా ఉంది. ఇక్కడ కిలో వెండి ధర రూ.74,700 గా ఉంది.
Maredumilli : మారేడుమిల్లి వద్ద లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు-20 మందికి గాయాలు
తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి వద్ద బస్సు ప్రమాదం జరిగింది. లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మారేడుమిల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భద్రాచలం నుంచి కాకినాడ వెళ్తోన్న గోకవరం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మారేడుమిల్లికి మూడు కి.మీ దూరంలో లారీని ఢీకొట్టింది. బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణిస్తున్నారు.
TDP Leaders Suspension: సస్పెండ్ అయిన టీడీపీ సభ్యులు బయటకు వెళ్లాలి: స్పీకర్ తమ్మినేని
సస్పెండ్ చేసిన ఐదుగురు టీడీపీ సభ్యులు తక్షణం బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఆదేశించగా, టీడీపీ నాయకులు ససేమిరా అన్నారు. తాము ఏం తప్పు చేశామని ప్రశ్నించారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ.. బడ్జెట్ కి సంబంధించిన విలువైన చర్చా సమయాన్ని వేస్ట్ చేశారని అన్నారు. ఎంతో మంది సభ్యులు విలువైన ప్రశ్నలు ఇచ్చారని, వాటిపై చర్చ జరగకుండా అడ్డుకున్నారని అన్నారు. ఇతర సభ్యుల హక్కులను ఉల్లంఘించారని అసహనం వ్యక్తం చేశారు. శాసన సభాపతి స్థానం వద్దకు టీడీపీ నాయకులు వచ్చి పేపర్లు వేయడంపై మాట్లాడుతూ.. స్పీకర్‌పై ఉన్న గౌరవం ఏపాటిదో అర్థం ఆ ఘటనతో అర్థం అవుతోందని అన్నారు. ఆ వీడియో మొత్తం ప్రజలు చూశారని, టీడీపీ నేతల చేష్టలు ప్రజలు చూస్తూనే ఉన్నారని అన్నారు.





















