Anganwadi Good News: ఏపీలో 4687 అంగన్వాడీలకు ప్రమోషన్, గౌరవ వేతనం పెంచిన ప్రభుత్వం
Anganwadis in AP | మినీ అంగన్వాడీలకు ఏపీ ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది. మెయిన్ అంగన్వాడీలుగా ప్రమోట్ చూస్తే వారికి గౌరవ వేతనం పెంచినట్లు ప్రకటించింది.

Anganwadis in Andhra Pradesh | అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు పెద్దపీట వేసింది. ఇటీవల తీసుకున్న కీలక నిర్ణయంతో 4687 మంది మినీ అంగన్‌వాడీ కార్యకర్తలకు పదోన్నతి లభించనుంది. 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉన్న ఈ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. పదోన్నతి పొందిన ఈ కార్యకర్తలకు నెలవారీ గౌరవ వేతనం రూ.11,500గా ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా పడిన కీలక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది.
ఏపీ ప్రభుత్వం మినీ అంగన్‌వాడీ కేంద్రాల విలీనంపై నిర్ణయం తీసుకుంది. 340 మినీ అంగన్‌వాడీ కేంద్రాల విలీనాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ కేంద్రాలను సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాల్లో విలీనం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే, ఈ విలీనం రెండు కీలక షరతుల ఆధారంగా అమలవుతుంది:
- మినీ అంగన్‌వాడీ కేంద్రంలో లబ్ధిదారుల సంఖ్య 10 కంటే తక్కువగా ఉండాలి.
- ఆ అంగన్వాడీ కేంద్రం సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రానికి 1 కిలోమీటరు లోపు దూరంలో ఉండాలి.
ఈ విలీన ప్రక్రియను రాబోయే నాలుగు సంవత్సరాల్లో దశల వారీగా అమలు చేయాలని అధికార ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ చర్యలు అంగన్‌వాడీ సేవల సమర్థతను పెంపొందించడమే కాకుండా, సద్వినియోగాన్ని కూడా బలోపేతం చేయనున్నాయి.
మిని అంగన్‌వాడీ కార్యకర్తల అప్‌గ్రేడేషన్ హైలైట్స్
- 10వ తరగతి పాసైన 4687 మంది మిని అంగన్‌వాడీ కార్యకర్తలను మెయిన్ అంగన్‌వాడీ కార్యకర్తలుగా ప్రమోషన్
- ఈ పదోన్నతి పొందిన అంగన్వాడీ కార్యకర్తల గౌరవ వేతనం నెలకు రూ.11,500 గా నిర్ణయించారు.
- రాష్ట్ర వ్యాప్తంగా 340 మిని అంగన్‌వాడీ కేంద్రాల విలీనానికి నిర్ణయం
- 340 మిని అంగన్‌వాడీ కేంద్రాలను సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలలో విలీనం చేస్తున్నట్లు ప్రకటన.
అంగన్వాడీల విలీనం రెండు కండీషన్ల ఆధారంగా జరుగుతుంది
1. ఏదైనా అంగన్వాడీ కేంద్రంలో లబ్ధిదారులు 10 కంటే తక్కువగా ఉండాలి.
2. ఆ మినీ అంగన్వాడీలు సమీపంలోని మెయిన్ అంగన్‌వాడీ కేంద్రానికి 1 కి. మీ లోపు ఉండాలి.
3. ఈ ప్రక్రియ దశల వారీగా రాబోయే 4 సంవత్సరాల్లో అమలు చేయనున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ
ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో మంత్రి పయ్యావుల కేశవ్ కీలక ప్రకటన చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేసిన హామీ మేరకు రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలకు గ్రాట్యుటీ మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. మహిళలు, వృద్ధుల సంక్షేమానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని పేర్కొన్నారు. వృద్ధుల సంరక్షణ కోసం 12 ఆశ్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల ఏపీ అంగన్వాడీలకు గ్రాట్యుటీ ప్రకటించారు.
స్వయం సహాయక సంఘాల (సహాయ సంఘాలు) ప్రాధాన్యతను వివరించిన మంత్రి, రాష్ట్రంలో 10 లక్షలకుపైగా సంఘాలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. డ్వాక్రా వ్యవస్థ మహిళలకు ఆర్థిక, సామాజిక సాధికారత అందించడంలో కీలకంగా నిలుస్తోందన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్త్రీనిధి నిధుల్లో రూ.750 కోట్లు మళ్లించిందని, మహిళా సంఘాల ఆర్థిక స్థితికి ఇబ్బంది కలిగిందని విమర్శించారు. నమగ్ర శిశు అభివృద్ధి పథకం (ICDS), మిషన్ శక్తి వంటి పథకాల ద్వారా మహిళలు, చిన్నారులు, కౌమార దశలో ఉన్న వారికి అవసరమైన పోషకాహారం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మహిళలు, చిన్నారులు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం రూ. 4,332 కోట్లు కేటాంచారు.






















