అన్వేషించండి

Markapuram: ప్రకాశం జిల్లాలో కుర్చీలోనే కుప్పకూలిన బ్యాంక్‌ మేనేజర్‌ - సీసీ టీవీ ఫుటేజ్‌చూస్తే షాక్ అవుతారు

Andhra Pradesh: ప్రకాశం జిల్లా మార్కాపురంలో పీడీసీసీ బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ గుండెపోటుతో మరణించాడు. కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయాడు. చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు.

Prakasham News : గుండెపోటు... కరోనా తర్వాత... చాలా ఎక్కువైంది. వయస్సుతో సంబంధం లేకుండా... అటాక్‌ చేస్తోంది. ఎప్పుడు.. ఎవరి ప్రాణాలు పోతాయో తెలియని పరిస్థితి. బాలలు, యువకులు కూడా గుండెపోటుతో  చనిపోతున్నారన్న వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిమ్‌ చేస్తుండగా... కుప్పకూలాడని ఒకసారి... నడుచుకుంటూ వెళ్తుండగా పడిపోయాడని మరోసారి.. కూర్చున్న చోటే కుప్పకూలిపోయాడని ఇంకోసారి... ఇలా ఎన్నో ఘటనలు... తరచూ  వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురంలోనూ ఇదే జరిగింది. పీడీసీసీ (PDCC) బ్యాంక్‌ మేనేజర్‌ కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయాడు.

అసలు ఏం జరిగిందంటే...

శ్రీనివాస్‌... ప్రకాశం జిల్లా మార్కాపురంని పీడీసీసీ బ్యాంక్‌ (PDCC Bank)లో మేనేజర్‌. మంగళవారం (ఆగస్టు 27వ తేదీ)... ఎప్పటి లాగే.. విధులకు హాజరయ్యాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు చక్కగా పనులు చేసుకున్నారు. అందరితో  మాట్లాడుతూ... తనను కలిసేందుకు వచ్చిన వారితో మాట్లాడుతూ... సిబ్బందికి వారి వారి పనులు అప్పగిస్తూ.. రోజు మొత్తం బిజీగానే ఉన్నాడు. సాయంత్రం అయ్యింది.. బ్యాంక్‌ సమయం కూడా ముగిసిపోతోంది. కాసేపు అయితే... ఇంటికి కూడా  వెళ్లుండేవాడు. కానీ... విధి విక్రించింది. అక్కడి వరకే ఆయన ఆయువు ఉన్నట్టుంది. మంగళవారం (ఆగస్టు 27వ తేదీ).. సాయంత్రం నాలుగున్నర గంటలకు కూర్చున్న కుర్చీలోనే కుప్పకూలిపోయాడు శ్రీనివాస్‌. కంప్యూటర్‌ టేబుల్‌పైనే  వాలిపోయాడు. మొదట్లో ఎవరూ గమనించలేదు.. వారి వారి పనుల్లో మునిగిపోయి ఉన్నారు. ఆ తర్వాత.. పైకి లేవాలని ప్రయత్నించిన శ్రీనివాస్‌... సీటు వెనక్కి వాలిపోయాడు. ముఖం, కళ్లు తేలేశాడు.. పక్క సీట్లో ఉన్న మహిళా ఉద్యోగి అతన్ని  గమనించింది. గాబరా పడిపోయింది. వెంటనే.. అక్కడున్న వారిని పిలిచింది. కొంత మంది వచ్చి చూశారు. అయ్యో.. ఏమంది అంటూ.... అతని వీరుపై కొడుతూ... స్పృహ తెప్పించే ప్రయత్ని చేశారు. అయినా.. శ్రీనివాస్‌లో చలనం లేదు. గుండెపై  గట్టిగా ప్రెస్‌ చేశారు... కాళ్లు, చేతుల్లో వేడి పుట్టేలా బాగా రుద్దారు.. అయినా ప్రయోజనం కనిపించలేదు వారికి. ఎంత కదిపినా ఉలుకూ పలుకూ లేకుండా పడిపోయాడు శ్రీనివాస్‌. దీంతో ఏమైందో అని... అందరూ కంగారు పడ్డారు. వెంటనే  ఆంబులెన్స్‌ కూడా ఫోన్‌ చేశారు. అంబులెన్స్‌లో స్థానిక ఆస్పత్రికి తరలించారు పీడీసీసీ బ్యాంకు సిబ్బంది. కానీ... ఇంత చేసినా.. ఫలితం లేకుండా పోయింది. అప్పటికే.. శ్రీనివాస్‌ ప్రాణం పోయిందని స్థానిక ఆస్పత్రి వైద్యులు చెప్పారు. ఈ దృశ్యాలు...  బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యారు. 

శ్రీనివాస్‌ మరణంతో అటు కుటుంబ సభ్యులు, ఇటు బ్యాంకు సిబ్బంది.. శోకసంద్రంలో మునిగిపోయారు. అప్పటి వరకు బాగానే ఉన్న మనిషి... ఉషారుగా పనిచేసుకుంటున్న మనిషి... కళ్ల ముందే ప్రాణాలు వదలడం.. ఆ బ్యాంకులోని సిబ్బందిని  కలచివేస్తోంది. శ్రీనివాస్‌ మృతిని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గుండెపోటు.. ఎప్పుడు ఎవరిని మింగేస్తుందో తెలీదు. ప్రతి రోజూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉన్నవారు కూడా.. ఉన్నట్టుండి హార్ట్‌ అటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు ఎక్కువ కావడంతో.. ప్రజల్లో కూడా ఆందోళన పెరిగిపోతుంది. అప్పటి వరకు బాగానే ఉన్న వారికి.. అంతలోనే గుండెపోటు రావడం... కలవరం రేపుతోంది.

గుండెపోటు లక్షణాలు.. 
గుండె... మన శరీరంలోని అత్యంత ముఖ్యమైన అవయం. ఆది ఆగిపోతే.. ప్రాణం పోయినట్టే. హార్ట్‌ ఎటాక్‌ వచ్చేముందు.. గుండెలో ఉన్నట్టుండి భరించలేని నొప్పి వస్తుంది. ఆ నొప్పి మెడ వరకూ పాకుతుంది. ఆ వెంటనే.. మైకం కమ్మేస్తుంది. శరీరం అంతా చెయటలు పట్టి.. చల్లగా అయిపోతుంది. ఊపిరి తీసుకునేందుకు కూడా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. గుండెల్లో నొప్పి మొదలై... ఎడమ చేతి నుంచి కుడి చేతి వరకు నొప్పి వ్యాపిస్తుంది.

గుండెపోటు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
శరీరంలో షుగర్‌, కొలస్ట్రాల్‌ కంట్రోల్‌లో పెట్టుకోవాలి. ధూమపానం అలవాటు ఉన్నవాళ్లు మానుకుంటే మంచిది. మంచి ఆహారం తీసుకోవాలి. రోజుకు కనీసం.. 30 నిమిషాలు.. లేదా వారంలో 150 నిమిషాలు కచ్చితంగా వ్యాయాపం చేయాలి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఫాస్ట్‌ ఫుడ్స్‌ బాగా తగ్గించుకోవాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. గంటల తరబడి ఏసీ గదుల్లో కంప్యూటర్‌ ముందు కూర్చోకూడదు. అరగంటల ఒకసారైనా... పైకి లేచి అటు ఇటు నడవాలి. రోజూ ఏడు నుంచి 8 గంటపాటు హాయిగా నిద్రపోవాలి. కంగారు, ఒత్తిడి తగ్గించుకోవాలి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
Game Changer Censor Review: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

KA Paul Interview on Allu Arjun | అంబేడ్కర్ ని తిట్టినోళ్లు యూజ్ లెస్ ఫెలోస్ | ABP DesamDeputy CM Pawan kalyan on Allu Arjun | సంధ్యా థియేటర్ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ | ABP DesamISRO SpaDEX Docking Experiment | తొలిసారిగా డాకింగ్ ప్రయోగం చేస్తున్న ఇస్రో | ABP Desamఅమిత్ షాకి అదో ఫ్యాషన్, మాలల సత్తా చూపిస్తాం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Perni Nani In Ration Rice Case: రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
రేషన్ బియ్యం మాయం కేసులో నిందితుడిగా పేర్ని నాని - హైకోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి
CM Chandrababu Distributes Pension: యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
యల్లమందలో పింఛన్ల పంపిణీ ప్రారంభించిన చంద్రబాబు - ఓ లబ్ధిదారుడికి రూ.5 లక్షలు ఇవ్వాలని ఆదేశం
Game Changer Censor Review: 'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
'గేమ్ చేంజర్' సెన్సార్ రిపోర్ట్... రామ్ చరణ్ సినిమా ఇంటర్వెల్, సెకండాఫ్ గురించి చెప్పేది వింటుంటే?
Manchu Vishnu: మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
మరో వివాదంలో మంచు విష్ణు - అడవి పందులను వేటాడిన నటుడి సిబ్బంది
Holidays List in 2025 : న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
న్యూ ఇయర్ 2025లో 12 రోజులు లీవ్ పెడితే 50 రోజులు పండగే.. పబ్లిక్ హాలీడేలు, వీక్లీ ఆఫ్​లతో రచ్చ చేసేయండిలా
Naga Vamsi: ఏంటి బ్రో అంత మాట అనేశావ్... బోనీ కపూర్‌ ముందు బాలీవుడ్‌ను ఏకిపారేసిన నాగ వంశీ
ఏంటి బ్రో అంత మాట అనేశావ్... బోనీ కపూర్‌ ముందు బాలీవుడ్‌ను ఏకిపారేసిన నాగ వంశీ
Gudivada Amarnath: సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
సొంత నియోజకవర్గం లేని నేతగా గుడివాడ అమర్నాథ్! మాజీ మంత్రి వింత పరిస్థితి- భీమిలి పై కన్ను
Richest CM In India: దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
దేశంలో ధనిక సీఎంగా చంద్రబాబు, చివరి స్థానంలో మమతా బెనర్జీ - ఆస్తులు, అప్పుల వివరాలిలా
Embed widget