News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో ఉద్యోగాల నియామకానికి గ్రీన్ సిగ్నల్- 528 పోస్టులకు వారంలో నోటిఫికేషన్

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో త్వరలోనే బోధనా సిబ్బంది నియామకం చేపట్టబోతున్నారు. మొత్తం 528 మందికి ఛాన్స్ ఇవ్వబోతున్నట్లు వైస్ ఛాన్సలర్  ప్రసాద రెడ్డి తెలిపారు. 

FOLLOW US: 
Share:

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో త్వరలో 528 బోధనా సిబ్బందిని అత్యంత పారదర్శకంగా నియమించనున్నామని వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి వెల్లడించారు. ఆయన ఏయూ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. వర్సిటీలో 1993వ సంవత్సరం నుంచి నేటి వరకు బోధనా సిబ్బంది నియామకం జరగక పోవడంతో అరకొరగా ఉన్న 190 మంది సిబ్బందితోనే విద్యార్థులకు తరగతులు బోధిస్తున్నా మనని తెలిపారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం ఏయూకు 528 మంది బోధనా సిబ్బంది నియామకానికి అనుమతి ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ నియామక ప్రకియకు సంబంధించిన నోటిఫికేషన్ ను వారం రోజుల్లోనే విడుదల చేస్తామని అన్నారు. ప్రతిభ ఆధారంగా, రిజర్వేషన్ రోస్టర్ ను పాటిస్తూ.. పూర్తి పారదర్శకంగా ఇంటర్వ్యూకి 1:4 నిష్పత్తిలో ఎంపిక చేస్తామన్నారు. దీనికి సంబంధించిన సమస్యల పరిష్కారం కోసం గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. 

ఈ ఏడాది డిసెంబర్ లో 91, 92వ స్నాతకోత్సవాల నిర్వహణ

ఇటీవల జరిగిన  87 నుంచి 90 వరకు గల 4 స్నాతకోత్సవాలను ఒకేసారి ఈ నెల 9 న విజయవంతంగా నిర్వహించామని ఆయన వివరించారు. దీనికి వర్సిటీ ఛాన్సలర్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరై పట్టాలు ప్రధానం చెయ్యడం ఆనందంగా ఉందన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో స్నాతకోత్సవాన్ని విజయవంతం చేయడంతోపాటు దాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంతో అధిక సంఖ్యలో ప్రజలు వీక్షించారని పేర్కొన్నారు. మరో రెండు 91, 92 స్నాతకోత్సవాలను ఈ ఏడాది డిసెంబర్లో నిర్వహిస్తామని అన్నారు. ఆ తర్వాత వచ్చే స్నాత కోత్సవాలన్నీ ఆలస్యం చేయకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని వివరించారు. విద్యా, ఉపాధి రంగాల్లో తమ వర్సిటీ ప్రగతిని గమనించిన ముంబయి సంస్థ తమకు మేకింగ్ ఇండియా ఎంప్లాయబుల్ అవార్డును ఇచ్చి గౌరవించిందని అన్నారు.

విద్యార్థులకు ఉపాధి అవకాశాల కోసం ప్లేస్ మెంట్ అధికారిని నియమించాం..!

వర్సిటీలోని ఇంజినీరింగ్ విద్యార్థులకు పారిశ్రామిక ఉపాధికి అవకాశం ఇచ్చే ఇండస్ట్రియల్ ఫర్ డాట్ కామ్ విభాగాన్ని మొట్ట మొదటిగా ప్రారంభించామని వైస్ ఛాన్సలర్ ఆచార్య పీవీజీడీ ప్రసాద రెడ్డి వెల్లడించారు. దీన్ని గుర్తించిన భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు ఏయూను సందర్శించి, 4.5 కోట్ల రూపాయల గ్రాంట్ ను మంజూరు చేశారని అన్నారు. వర్సిటీలోని అన్ని కళాశాలల్లో అన్ని శాఖల్లో గల 95 శాతం పైగా సీట్లు భర్తీ కావడం వర్సిటీ ప్రగతికి నిదర్శనం అని గర్వంగా చెప్పారు. తమ వర్సిటీలో చేరిన విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ప్రత్యేకంగా ప్లేస్ మెంట్ అధికారిని నియమించి ఆ దిశగా కృషి చెయ్యడం తమ నిబద్ధతకు నిదర్శనం అని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో రిజిస్ట్రార్ కృష్ణ మోహన్, వర్సిటీలోని వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్ ఫాల్గొన్నారు.

Read Also: గ్రూప్‌-1 రద్దుపై సుప్రీంకోర్టుకు టీఎస్‌పీఎస్సీ- రేపు విచారణ

Published at : 25 Sep 2023 12:09 PM (IST) Tags: AP News Andhra University Teaching Staff Appointments AU Vice Chancellor Prasad Reddy 528 Teacher Post Vacancies

ఇవి కూడా చూడండి

YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ

YSRCP Politics: ఇప్పుడు 11 నియోజకవర్గాలకు ఇన్ ఛార్జీలు! భవిష్యత్తులో ఏమైనా జరగొచ్చు: బొత్స, సజ్జల క్లారిటీ

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

YSRCP News: జగన్ కీలక నిర్ణయం, 11 నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జిల మార్పు

Anantapur Teacher Suicide: టీచర్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్, అసలు కారణాలు వెల్లడించిన పోలీసులు

Anantapur Teacher Suicide: టీచర్ ఆత్మహత్యాయత్నం కేసులో ట్విస్ట్, అసలు కారణాలు వెల్లడించిన పోలీసులు

Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజీనామా! అసలు విషయం చెప్పిన వైసీపీ నేత

Vasantha Krishna Prasad: మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ రాజీనామా! అసలు విషయం చెప్పిన వైసీపీ నేత

Balineni Srinivasa Reddy: బాలినేనికి డోర్స్ క్లోజ్ అయినట్టే! సీఎంఓ ఫైనల్ వార్నింగ్!

Balineni Srinivasa Reddy: బాలినేనికి డోర్స్ క్లోజ్ అయినట్టే! సీఎంఓ ఫైనల్ వార్నింగ్!

టాప్ స్టోరీస్

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Oh My Baby Promo: ‘రమణగాడు... గుర్తెట్టుకో... గుంటూరు వస్తే పనికొస్తది’ - ‘గుంటూరు కారం’ సెకండ్ సింగిల్ ప్రోమో!

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే ఏప్రిల్‌లోనే అవకాశం !

Kodandaram Rajyasabha : కోదండరాంకు రాజ్యసభ - వచ్చే  ఏప్రిల్‌లోనే అవకాశం !

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

AP News: సొంత సామాజిక వర్గం జగన్ కి ఎందుకు దూరమవుతోంది?

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు

Uttam Kumar Reddy to visit Medigadda: మేడిగడ్డ సందర్శించాలని మంత్రి ఉత్తమ్ నిర్ణయం, వెంట వాళ్లు ఉండాలని అధికారులకు ఆదేశాలు