Corona Updates: ఏపీలో కరోనా కేసులు డ్రాప్, కొత్తగా 280 కేసులు, ఇద్దరు మృతి
Corona Updates: ఏపీలో కొత్తగా 280 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో 4709 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
Corona Updates: ఏపీలో కరోనా కేసులు(Corona Cases) భారీగా తగ్గాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 18,915 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 280 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,722కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 496 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 2,298,033 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీ(AP)లో 4709 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,464 కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,30,66,774 నిర్థారణ పరీక్షలు చేశారు.
#COVIDUpdates: 25/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 25, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,17,464 పాజిటివ్ కేసు లకు గాను
*22,98,033 మంది డిశ్చార్జ్ కాగా
*14,722 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 4,709#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/I70FlXT5mo
#COVIDUpdates: As on 25th February, 2022 10:00AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 25, 2022
COVID Positives: 23,17,464
Discharged: 22,98,033
Deceased: 14,722
Active Cases: 4,709#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/9OvIyHowxs
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా(COVID) వ్యాప్తి కంట్రోల్ ఉంది. గడిచిన 24 గంటల్లో కేసులు 13 వేలకు దిగొచ్చాయి. గురువారం 10 లక్షల మందికి కరోనా నిర్థారణ(Covid Testing Samples) పరీక్షలు నిర్వహించారు. 13,166 మందికి కోవిడ్ సోకినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలు వెల్లడించింది. 24 గంటల వ్యవధిలో 302 మరణాలు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు 4.28 కోట్ల మందికి కరోనా సోకింది. కరోనా మృతుల(Covid Deaths) సంఖ్య 5,13,226 చేరింది. కొవిడ్ వ్యాప్తి అదుపులో ఉండటంతో యాక్టివ్ కేసులు(Active Cases) గణనీయంగా తగ్గుతున్నాయి. దేశంలో ఇంకా 1,34,235 మంది వైరస్‌తో బాధపడుతున్నారు. యాక్టివ్ కేసుల రేటు 0.31 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.49 శాతానికి పెరిగింది. గురువారం 26,988 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 4.22 కోట్లుకు చేరింది. గురువారం మరో 32,04,426 మందికి కోవిడ్ వ్యాక్సిన్(Vaccine) వేశారు. ఇప్పటి వరకూ దేశంలో 176 కోట్ల డోసులు పంపిణీ అయ్యాయి.