AP TS Corona Updates: ఏపీలో తగ్గిన కొవిడ్ ఉద్ధృతి... కొత్తగా 332 కరోనా కేసులు, 6 మరణాలు... తెలంగాణలో 208 కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 332 కరోనా కేసులు నమోదయ్యాయి. 6 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో 5,709 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. తెలంగాణలో కొత్తగా 208 కేసులు నమోదయ్యాయి.
![AP TS Corona Updates: ఏపీలో తగ్గిన కొవిడ్ ఉద్ధృతి... కొత్తగా 332 కరోనా కేసులు, 6 మరణాలు... తెలంగాణలో 208 కేసులు Andhra Pradesh Telangana latest corona updates 18th October records 332 new covid 19 cases 6 deaths in 24 hours AP TS Corona Updates: ఏపీలో తగ్గిన కొవిడ్ ఉద్ధృతి... కొత్తగా 332 కరోనా కేసులు, 6 మరణాలు... తెలంగాణలో 208 కేసులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/10/18/298bd33a5878bfefed25ec7b39452c0a_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 30,219 నమూనాలను పరీక్షించగా 332 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనాతో తాజాగా ఆరుగురు మృతి చెందారు. కరోనా నుంచి ఆదివారం 651 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,709 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కొవిడ్ బులెటిన్‌లో పేర్కొంది. కొవిడ్ వల్ల కృష్ణా జిల్లాలో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, శ్రీకాకుళం, విశాఖ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.
Also Read: దేశంలో కొత్తగా 13,596 కరోనా కేసులు.. వైరస్ కారణంగా మరో 166 మంది మృతి
#COVIDUpdates: 18/10/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) October 18, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,57,909 పాజిటివ్ కేసు లకు గాను
*20,37,887 మంది డిశ్చార్జ్ కాగా
*14,313 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5,709#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/rEzQBI8aJH
Also Read: కాంగ్రెస్‌లో ప్రశాంత్ కిషోర్ చిచ్చు ! ప్రియాంకను ఎదగకుండా రాహుల్ అడ్డుకుంటున్నారా ?
తెలంగాణలో కొత్తగా 208 కరోనా కేసులు
తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 45,418 పరీక్షలు నిర్వహించారు. వీరిలో 208 కొవిడ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కొవిడ్ బారినపడి తాజాగా ఇద్దరు ప్రాణాలు కోల్పోవడంతో ఇప్పటివరకు రాష్ట్రంలో చనిపోయిన వారి సంఖ్య 3,940కు చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 201 మంది కోలుకున్నారు. తెలంగాణలో 3,929 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
దేశంలో 15 వేలకు దిగువగా కరోనా కేసులు
దేశంలో కొత్తగా 9,89,493 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 13,596 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు ఏడు నెలల కనిష్ఠానికి పడిపోయిన కేసులు..తాజాగా మరింత తగ్గాయి. నిన్న 19,582 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.40 కోట్ల మంది మహమ్మారి బారిన పడగా.. 3.34 కోట్ల మంది వైరస్‌ను జయించారు. కొద్దిరోజులుగా క్రియాశీల కేసుల తగ్గుముఖం పడుతున్నాయి. రెండు లక్షల దిగువకు చేరిన కేసులు.. మరింత తగ్గి 1.89 లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుతం క్రియాశీల రేటు 0.56 శాతానికి తగ్గింది. రికవరీ రేటు 98.12 శాతానికి పెరిగింది. నిన్న 166 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు 4,52,290 మంది వైరస్ కు బలయ్యారు.
Also Read: చిన్నారులకు కరోనా టీకాలపై కొవిడ్ టాస్క్‌ఫోర్స్ చీఫ్ వీకే పాల్ కీలక వ్యాఖ్యలు
Also Read: జీవితాంతం జైల్లోనే డేరా బాబా .. హత్య కేసులో మరో యావజ్జీవ శిక్ష !
Also Read : యూపీ ఎన్నికల్లో 'ప్రియాంకం'.. 'భాజపా X కాంగ్రెస్' గా మారిన రాజకీయం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)