Corona Updates: ఏపీలో కొత్తగా 675 కరోనా కేసులు, 3 మరణాలు
ఏపీలో కొత్తగా 675 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో 10808 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్య శాఖ ప్రకటించింది.
ఏపీలో కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గుతున్నాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో 24,663 కోవిడ్ నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో 675 మందికి కోవిడ్ పాజిటివ్(Covid Positive) నిర్ధారణ అయింది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ తో ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో కోవిడ్ బారినపడి చనిపోయిన వారి సంఖ్య 14,705కి చేరింది. ఒక్కరోజు వ్యవధిలో రాష్ట్రంలో 2,414 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 22,88,989 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఏపీలో 10,808 యాక్టివ్ కేసులున్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,14,502కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటి వరకూ మొత్తం 3,28,93,908 నిర్థారణ పరీక్షలు చేశారు. ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. రికవరీలు కూడా పెరుగుతున్నాయి. దీంతో ఇటీవల ప్రభుత్వం నైట్ కర్ఫ్యూను ఎత్తివేసింది. కరోనా జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరి అని సూచించింది.
#COVIDUpdates: 16/02/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) February 16, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,14,502 పాజిటివ్ కేసు లకు గాను
*22,88,989 మంది డిశ్చార్జ్ కాగా
*14,705 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 10,808#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/kGxMiu4wvS
దేశంలో కరోనా కేసులు
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 30,615 కరోనా కేసులు నమోదయ్యాయి. 514 మంది మృతి చెందారు. మంగళవారంతో పోలిస్తే బుధవారం కరోనా కేసులు 11 శాతం పెరిగాయి. 82,988 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు.
- యాక్టివ్ కేసులు: 3,70,240
- డైలీ పాజిటివిటీ రేటు: 2.45%
- మొత్తం రికవరీలు: 4,18,43,446
- మొత్తం వ్యాక్సినేషన్: 173.86 కోట్ల డోసులు
మహారాష్ట్ర
మహారాష్ట్రలో కొత్తగా 2,831 కరోనా కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. ఇందులో 351 ఒమిక్రాన్ కేసులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 78,47,746కు చేరింది. మరణాల సంఖ్య 1,43,451కి పెరిగింది.
దిల్లీ
దిల్లీలో కొత్తగా 756 కరోనా కేసులు నమోదుకాగా ఐదుగురు మృతి చెందారు. పాజిటివిటీ రేటు 1.52గా ఉంది. మొత్తం కేసుల సంఖ్య 18,52,662కు పెరిగింది. మరణాల సంఖ్య 26,081కి చేరింది.
Also Read: ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ఆసక్తి, రూ.3 వేల కోట్లకు మూడు ఎంవోయూలు : మంత్రి గౌతమ్ రెడ్డి