Breaking News Live: మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ మృతి?
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 14న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 14న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
మావోయిస్టు అగ్రనేత ఆర్కే మృతి?
మావోయిస్టు అగ్రనేత ఆర్కే అలియాస్ అక్కిరాజు హరగోపాల్ అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలుస్తోంది.
హైదరాబాద్-విజయవాడ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
దసరా పండుగ వేళ హైదరాబాద్ విజయవాడ రహదారిపై విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పండుగకు అందరూ ఇళ్లకు వెళ్తుండడంతో యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ వద్ద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. చౌటుప్పల్ నుంచి కొయ్యలగూడెం వరకూ ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. సుమారు 4 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినట్లు సమాచారం.
మత్స్యకారుల వలకు చిక్కిన 20 కేజీల చేప
తూర్పు గోదావరి జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాంలో సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు అరుదుగా దొరికే తెరపార చేప చిక్కింది. దీని బరువు 20 కేజీలు ఉన్నట్లు మత్స్యకారులు తెలిపారు. సొర జాతికి చెందిన ఈ చేపను సొరారి అని కూడా పిలుస్తారని చెప్పారు. దీనిని వేలం పాట ద్వారా రెండు వేల రూపాయలకు విక్రయించినట్లు వారు తెలిపారు.
దసరా పండుగ వేళ తీవ్ర విషాదం
దసరా పండుగ వేళ కృష్ణా జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఈత సరదా వల్ల నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని కైకలూరు మండలం వరాహపట్నంలో ఈ ఘటన జరిగింది. వరాహపట్నం గ్రామానికి చెందిన నలుగురు చిన్నారులు ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో పడిపోయారు. ఈత రాక నలుగురు మృతి చెందారు. చనిపోయిన వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి ఉన్నారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను బయటికి తీయించి పోస్టుమార్టం కోసం కైకలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
తెలుగు అకాడమీ స్కామ్ కేసులో మరొకరు అరెస్టు
తెలుగు అకాడమీకి చెందిన ఫిక్స్‌డ్ డిపాజిట్ల కుంభకోణం కేసులో మరొకరు అరెస్టయ్యారు. ఏపీలోని గుంటూరులో సాంబశివరావును సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. కెనరా బ్యాంకు మేనేజర్ సాధన సమీప బంధువు సాంబశివరావు. డిపాజిట్లు గోల్‌మాల్ చేసిన వారికి ఈయన సహకరించినట్లుగా తెలుస్తోంది. దాదాపు రూ.50 లక్షలు ఆయన వాటాగా తీసుకున్నారు. ఈయన్ను హైదరాబాద్ తీసుకొచ్చాక సీసీఎస్ పోలీసులు రిమాండ్‌కు తరలించనున్నారు.