అన్వేషించండి

Andhra Pradesh: తెల్లరేషన్‌ కార్డుదారులకు గుడ్ న్యూస్, వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు మరిన్ని సరుకులు

White Ration Cards in Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం తెల్లరేషన్ కార్డుదారులకు తియ్యని వార్త చెప్పింది. వచ్చే నెల నుంచి బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Andhra Pradesh Ration card holders | అమరావతి: తెలుగుదేశం నేతృత్వంలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పేదల కోసం ఆలోచిస్తోంది. అధికారంలోకి వచ్చి రాగానే తెల్లరేషన్‌ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదార ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. వైఎస్ జగన్ (YS Jagan) ప్రభుత్వం ఏడాది నుంచి కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. ఈ విషయం తెలుసుకున్న చంద్రబాబు (AP CM Chandrababu) ప్రభుత్వం వైట్ రేషన్ కార్డు ఉన్నవారికి కందిపప్పుతో పాటు పంచదార సరఫరా చేయాలని భావిస్తోంది.

చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం 
కందిపప్పును వైసీపీ ప్రభుత్వం నిలిపివేయడంతో సామాన్యులు ఏడాది నుంచి బహిరంగ మార్కెట్లలో అధిక ధరలకు కొనుగోలు చేస్తున్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, మరుసటి రోజు బాధ్యతలు చేపట్టారు. తమ ప్రభుత్వం పేదలు, లబ్ధిదారులతో పాటు అన్ని వర్గాల వారికి సంక్షేమంతో పాటు అభివృద్ధిపై ఫోకస్ చేయనుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేషన్‌ షాపుల ద్వారా కందిపప్పు ఇవ్వడం లేదని చంద్రబాబు దృష్టికి వచ్చింది. సత్వరమే సరఫరా మొదలుపెట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో పౌరసరఫరాల శాఖ అధికారులు కదిలారు. కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్‌ఎస్‌ పాయింట్లకు తరలిస్తున్నారు. 

వచ్చే నెల నుంచి కందిపప్పు పంపిణీకి ఏర్పాట్లు 
జూన్ 20వ తేదీ నుంచి బియ్యం, కందిపప్పు, ఆయిల్‌ ప్యాకెట్లు, పంచదారను రేషన్‌ షాపులకు సరఫరా చేయాల్సి ఉంది. జులై 1వ తేదీ నుంచి తెల్లరేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు కందిపప్పు, పంచదారను పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు పౌరసరఫరాల శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌లోకి వచ్చిన కందిపప్పు, చక్కెరతో పాటు అక్కడి సరుకుల నాణ్యతను అధికారులు పరిశీలిస్తున్నారు. 

పని మొదలుపెట్టేసిన నాదెండ్ల మనోహర్
ఏపీ ఆహార, పౌరసరఫరాలశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాదెండ్ల మనోహర్‌ రెండు రోజుల కిందట తెనాలిలో తనిఖీలు చేపట్టారు. అంగన్‌వాడీలకు ఇచ్చే కందిపప్పు, నూనెతో పాటు వైట్ రేషన్ కార్డుదారులకు ఇచ్చే పంచదారలో ఎక్కడ చూసిన తక్కువ తూకంతో సరుకులు పంపిణీ జరుగుతోందని గుర్తించారు. కందిపప్పు, నూనె అయితే 50 నుంచి 100 గ్రాములు తక్కువ ఉందని నిల్వ గోదాములను తనిఖీ చేసినప్పుడు వెల్లడైంది. అనంతరం మంగళగిరిలోనూ మంత్రి నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేయించారు. అక్కడ సైతం నిర్దేశిత పరిమాణం కంటే తక్కువ తూకంతో పంపిణీ జరుగుతున్నట్లు తేలింది. ఈ క్రమంలో ఏపీ వ్యాప్తంగా కందిపప్పు, పంచదార, నూనె ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించడం తెలిసిందే. ఈ అవకతవకలు జరగడానికి కారణాలపై రెండు రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

Breaking News: హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో ఈగల్ టీమ్ దాడులు- పెడ్లర్‌ అరెస్టు 
హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్శిటీలో ఈగల్ టీమ్ దాడులు- పెడ్లర్‌ అరెస్టు 
Vijayasai Reddy New Party: విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
విజయసాయిరెడ్డి భారత్ జన వికాస్ పార్టీ - బీజేపీ నో.. వైసీపీ క్లోజ్! మళ్లీ రీ-ఎంట్రీ వెనుక మర్మమేంటి?
SIR Enumeration Uncollectable Votes: తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
తెలుగు రాష్ట్రాల రాజకీయాలను కుదిపేస్తున్న SIR ప్రక్షాళన - లక్షల్లో ఓట్ల గల్లంతు - వాళ్లంతా ఏమయ్యారు?
Tirumala News: శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్
శ్రీవారి టికెట్ల పేరుతో భక్తులను మోసం చేసిన సస్పెండ్‌ అయిన టీటీడీ ఉద్యోగి అరెస్ట్

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Hyderabad Old City Metro Updates: హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
హైదరాబాద్‌ మెట్రో విస్తరణలో కీలక ముందడుగు! పాతబస్తీ రూట్‌ కోసం టెండర్లు పిలవాలని సీఎం ఆదేశం!
KTR Son Himanshu Movie Debut: కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
కేటీఆర్ కుమారుడు హిమాన్షు హీరోగా సినిమా!
Cow Urine Selling: పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
పాలు సేకరణ కేంద్రంలా గోమూత్ర సేకరణ కేంద్రాలు! లీటరు రూ. 10! ఈ పైలట్ ప్రాజెక్టు గురించి తెలుసా? 
Sangareddy Accidents: సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
సంగారెడ్డి జిల్లాలో రెండు వేర్వేరు ప్రమాదాలు.. ఏడుగురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు
UPI Transaction: మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
మీరు ఒకసారి UPI చేస్తే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? 
Chemical Signaling: మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
మొక్కలు మాట్లాడుకుంటాయా? సైన్స్, ఆధ్యాత్మికత చెప్పే అద్భుత రహస్యం!
Microsoft Alert: హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
హోటల్ వై-ఫైకి కనెక్ట్ అవ్వడం వల్ల మీ డేటా హ్యాక్‌! మైక్రోసాఫ్ట్ సీరియస్ వార్నింగ్! 
Telangana SIR : తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
తెలంగాణకు ఎస్ఐఆర్ షాక్: గ్రేటర్ హైదరాబాద్‌లోనే ప్రతి ముగ్గురిలో ఒకరి ఓటు గల్లంతు!
Embed widget