ఏపీ ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు గురువారం సచివాలయంలో అడుగు పెట్టారు. చంద్రబాబును అమరావతి రైతులు, స్థానిక ప్రజలు పూలతో స్వాగతం పలికారు. సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో పదవీ బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు 5 ఫైల్స్‌పై సంతకాలు చేశారు నిరుద్యోగులు ఎదురు చూస్తున్న డీఎస్సీపై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి ఓకే చెప్పారు. రెండో సంతకం జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై పెట్టారు. సామాజిక భద్రత పింఛన్‌ను నాలుగు వేలకు పెంచుతూ మూడో సంతకాన్ని పెట్టారు పాత బకాయిలు కలుపుకొని మొత్తం 7 వేల రూపాయలను జులైలో ఇచ్చేలా ఈ ఫైల్ రూపొందించారు. యువతలో ఉన్న నైపుణ్యాలు వెలికి తీసి వారికి ఉపాధి కల్పించేందుకు చేపట్టే స్కిల్ సెన్సస్‌పై నాల్గో సంతకం చేశారు. టీడీపీ ప్లాగ్‌షిప్ ప్రోగ్రామ్ అయిన అన్న క్యాంటీన్ పునరుద్ధరణపై ఐదో సంతకం చేశారు చంద్రబాబు ఐదు సంతకాలు చేయడంపై మంత్రి పవన్ కల్యాణ్‌తోపాటు కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు.