టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను చంద్రబాబు, పవన్ కల్యాణ్ విడుదల చేశారు.



గతేడాదే చంద్రబాబు సూపర్ 6 పేరుతో ఆరు పథకాలను ప్రకటించారు.



బాబు ష్యూరిటీ - భవిష్యత్తుకు గ్యారంటీ అని సూపర్ 6తో ప్రచారం చేస్తున్నారు.



1. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు రూ.3 వేల నిరుద్యోగ సాయం



2. స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ.15 వేలు సాయం



3. ప్రతి రైతుకు ఏటా రూ.20 వేల ఆర్థిక సాయం



4. ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 సిలిండర్లు



5. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం



6. మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం



ఇవికాక అధికారంలోకి రాగానే మొదటి సంతకం మెగా డీఎస్సీపైనే



వృద్ధాప్య పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని ప్రకటించారు



దివ్యాంగుల పెన్షన్ రూ.6 వేలకు పెంపు, వలంటీర్లకు గౌరవ వేతనం నెలకు రూ.10 వేలకు పెంపు



ఉచిత ఇసుక, అన్నా క్యాంటీన్లు, భూ హక్కు చట్టం రద్దు, ఉచిత నల్లా కనెక్షన్, బీసీ రక్షణ చట్టం



చేనేతలకు 200 యూనిట్లు, మరమగ్గాల వారికి 500 యూనిట్ల విద్యుత్ ఫ్రీ



పేదలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం, పెళ్లి కానుక రూ.లక్ష హామీ