Omicron: శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలకలం... ఈ ప్రచారంపై క్లారిటీ ఇచ్చిన అధికారులు
బ్రెజిల్ నుంచి శ్రీకాకుళం వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడికి ఒమిక్రాన్ సోకిందని ప్రచారం జరిగింది. ఈ ప్రచారం అవాస్తమని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో ఒమిక్రాన్ కలవరం నెలకొంది. సంత బొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అయితే బాధితుడు ఇటీవలే బ్రెజిల్ నుంచి ఏపీకి వచ్చాడు. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయి తదుపరి టెస్టులకు ఇతని నమూనాలు పంపారు. అతడిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఒమిక్రాన్ అనుమానంతో జీనోమ్ సీక్వెన్ కోసం శాంపిల్స్ హైదరాబాద్ కు పంపారు.
Also Read: దేవుడా..! ఒమిక్రాన్‌ను జయించిన వైద్యుడికి మళ్లీ కరోనా పాజిటివ్
ఆ ప్రచారాన్ని నమ్మొద్దు
జీనోమ్ సీక్వెన్సింగ్ అనంతరం దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే ఒమిక్రాన్ సోకినట్లు వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దని అధికారులు తెలిపారు. ప్రచారంలో ఉన్న వ్యక్తి నవంబర్ 20వ తేదీన బ్రెజిల్ లో బయలుదేరే ముందు కరోనా టెస్ట్ చేయించుకోగా నెగెటివ్ వచ్చింది. గత నెల 22న ముంబయి చేరుకోగానే టెస్ట్ చేయించుకోగా అక్కడా నెగెటివ్ వచ్చింది. ఆ తర్వాత నవంబర్ 23వ తేదీన శ్రీకాకుళం జిల్లాలోని ఉమిలాడ చేరుకున్నాడు. అయితే ఈనెల 5న కరోనా టెస్టులు నిర్వహించగా అతనికి పాజిటివ్ వచ్చింది. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ వ్యక్తి శాంపిల్స్ ను టెస్టులకు పంపారు. ఇంకా ఫలితాలు రాలేదని అప్పటివరకు సాధారణ కరోనా మాత్రమేనని స్పష్టం చేశారు. ఒమిక్రాన్ అంటూ వస్తున్న వందతులను నమ్మొద్దని అధికారులు తెలిపారు.
Also Read: వీకెండ్ ఆహా.. ఆ ఊహ ఎంత బాగుందో! ఇక వారంలో 2.5 రోజులు సెలవు!
ఆందోళన పడాల్సిన అవసరం లేదు
జిల్లా వాసులు ఎటువంటి భయాందోళనలో పడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాదం అన్నారు. ఆ వ్యక్తికి రెండు సార్లు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేశామని, రక్త నమూనాలను జినోమ్ సీక్వెన్స్ కి పంపించామన్నారు. పూర్తి నివేదికలు వస్తే గానీ ఒమిక్రాన్‌గా నిర్ధారించలేమన్నారు.
Also Read:తగ్గిన కరోనా విజృంభణ.. 554 రోజుల కనిష్ఠానికి యాక్టివ్ కేసులు
Also Read: ఒక సరస్వతి మొక్కను పెంచుకోండి, ఆ ఆకుల రసంతో ఎన్నో ఆరోగ్యసమస్యలు తొలగిపోతాయి
Also Read: ఈ కూరల్లో కొలెస్ట్రాల్ తక్కువ, బరువు తగ్గాలనుకునే వాళ్లకి ప్రత్యేకం
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి