Payyavula Kesav: రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేయిదాటిపోయింది... బుగ్గన వాస్తవాలు బయటపెట్టాలని పయ్యావుల డిమాండ్
దిల్లీ నుంచి అధికారులు రాష్ట్రానికి అప్పుల వసూళ్లకు వస్తున్నారని పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ అన్నారు. విద్యుత్ రంగ సంస్థలు బకాయిలు చెల్లించడం లేదని, సంస్థలు ఎన్పీఏ పెట్టాయని ఆరోపించారు.
ఇవాళ సాయంత్రం దిల్లీ నుంచి ప్రత్యేకమైన అతిథులు రాష్ట్రానికి వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ తెలిపారు. రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అధికారులు రాష్ట్రానికి అప్పుల వసూళ్లకు వస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ రంగ సంస్థలు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించడం లేదని ఆయన ఆరోపించారు. ఇన్స్టాల్మెంట్స్ కట్టకుండా ఇప్పటికే ప్రభుత్వ రంగ సంస్థలు ఎన్పీఏ(నాన్ పెర్ఫార్మింగ్ అసెట్) పెట్టాయన్నారు. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులను దేశం గుర్తించేలా అధికారులు చేస్తాన్నారు. ఓ ప్రభుత్వం వద్దకు సంస్థ ప్రతినిధులు అప్పుల వసూళ్ల కు వస్తున్నారంటే... రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుందన్నారు.
Also Read: ఏపీ రైతులకు శుభవార్త.. వారి ఖాతాల్లోకి నేరుగా నగదు జమచేసిన సీఎం వైఎస్ జగన్
బుగ్గన వాస్తవాలు బయటపెట్టాలి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పుల వసూళ్లకి దిల్లీ నుంచి అధికారులు వస్తున్నారని పయ్యావుల కేశవ్ అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పూర్తిగా చేయిదాటిపోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేసిందన్నారు. కేంద్రం ఇప్పటికైనా ఏపీ ఆర్థిక పరిస్థితిని బయటపెట్టాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పాలకులకు రాష్ట్ర ప్రభుత్వంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు.
ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఇప్పటికైనా వాస్తవాలు బయటపెట్టాలన్నారు. రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో వాస్తవాలు చెప్పాలన్నారు.
Also Read: బిల్లులు రాక వైఎస్ఆర్‌సీపీ ప్రజాప్రతినిధులకు ఇబ్బందులు.. ప్రభుత్వంపై ధర్మాన ప్రసాదరావు అసంతృప్తి !
విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాలపై అభ్యంతరం
ఏపీ ఇంధన శాఖ కార్యదర్శికి పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్ లేఖ రాశారు. విద్యుత్ కొనుగోళ్లు, సెకీతో ఒప్పందాలు ప్రస్తావిస్తూ ఆయన లేఖ రాశారు. సెకీతో ఒప్పందంపై అభ్యంతరాలకు ఎందుకు సమాధానం చెప్పడం లేదని పయ్యావుల ప్రశ్నించారు. విద్యుత్ సంస్కరణల లక్ష్యం దెబ్బతినేలా పబ్లిక్ సర్వెంట్‌గా ఉన్న అధికారులు ఎలా నిర్ణయాలు తీసుకుంటున్నారన్నారు. పవర్ గ్రిడ్‌లో 100 శాతం కంటే అదనపు సామర్థ్యాన్ని ఎందుకు జోడిస్తున్నారని ప్రశ్నించారు. బిడ్డింగ్ జరపకుండా సెకీ ఆఫర్‌ను ఏకపక్షంగా అంగీకరించారన్నారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో అధికారులు తలొగ్గారని ఆరోపించారు. ప్రతిపాదనలు, సంప్రదింపులు, ఒప్పందాల వెనుక కారణాలెందుకు స్పష్టం చేయడం లేదని లేఖలో పేర్కొన్నారు.
Also Read: అమరావతి ప్రజలందరి రాజధాని.. విచారణలో హైకోర్టు సీజే కీలక వ్యాఖ్యలు !