అన్వేషించండి

AP Sanitation Workers: సమ్మె యథాతథం, మున్సిపల్‌ కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు మరోసారి విఫలం

AP Municipal Workers: మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి.

AP Govt Discussion fail with Sanitation Workers: అమరావతి: మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. కార్మికులకు బేసిక్ పే ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించింది. ఒకవేళ మున్సిపల్ కార్మికులకు (AP Municipal Workers) బేసిక్ పే చెల్లిస్తే.. ఇతర శాఖల సిబ్బంది సైతం డిమాండ్ చేస్తారని ఏపీ మంత్రులు, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి వారికి వివరించారు. సచివాలయం (Andhra Pradesh Secretariat)లో జనవరి 2వ తేదీన (మంగళవారం) మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో వారి డిమాండ్లపై మంత్రుల బృందం చర్చించింది. ఏపీ మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఆదిమూలపు సురేష్, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)సజ్జల రామకృష్ణారెడ్డి, కొందరు ఉన్నతాధికారులు ఈ చర్చల్లో పాల్గొన్నారు. అయితే వేతనానికి సంబంధించిన డిమాండ్ ను నెరవేర్చలేమని కార్మిక సంఘాల ప్రతినిధులకు మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. జనవరి 12 లేదా 17న మరోసారి చర్చించాలని మంత్రుల కమిటీ భావిస్తోంది. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను సీఎం జగన్ కు మరోసారి వివరిస్తామని మంత్రులు పేర్కొన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల డిమాండ్లు ఏంటంటే.. 
పారిశుధ్య కార్మికుల డిమాండ్లలో ప్రధానమైనటువంటి కేటగిరీల వారీగా బేసిక్ పే నిర్ణయం, పొరుగు సేవల విధానాన్ని కాంట్రాక్టు, శాశ్వత ఉద్యోగులుగా పర్మినెంట్ చేయడం తదితర అంశాలపై ఈ  సమావేశంలో చర్చించారు. వీటితో పాటు అవుట్ సోర్సింగ్ పై పనిచేసే పారిశుధ్య, ఇంజనీరింగ్, ఇతర సిబ్బందికి  అన్ని ప్రభుత్వ పథకాలు వర్తింపచేయడం, నియామకాల్లో వెయిటేజీ మార్కులు కేటాయించడం,  ఖాళీగా ఉన్న రెగ్యులర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడం, అవసరానికి తగ్గట్టుగా పారిశుధ్య కార్మికుల సంఖ్యను పెంచడం, కాంట్రాక్టు విదానంలో ఘన వ్యర్థాలను తరలించే వాహనాల పనితీరును మెరగుపర్చడం, పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్ సిబ్బంది, పార్కుల నిర్వహణ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్ల నిర్వహించే పనుల ఆధారంగా వారికి బేసిక్ పే నిర్ణయించడం తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. 

ఈ సమావేశంలో ప్రభుత్వ సలహా దారులు (ఉద్యోగుల సంక్షేమం) ఎన్. చంద్ర శేఖర రెడ్డి, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మీ,  సిడిఎంఎ కోటేశ్వరరావు, స్వచ్ఛాంధ్రకార్పొరేషన్ విసి & ఎండి గంధం చంద్రుడు, ఆప్కాస్ ఎండి వాసుదేవ రావు తదితర అధికారులతో పాటు రాష్ట్ర మున్సిపల్ ఉద్యోగుల సంఘాల నాయకులు  ఆనంద్ రావు (YSRTUC రాష్ట్ర ప్రెసిడెంట్),  వై.వి.రమణ (YSRTUC ప్రధాన      కార్యదర్శి),  ఎ. రంగనాయకులు (AITUC రాష్ట్ర అధ్యక్షులు),  పి. సుబ్బారాయుడు (AITUC ప్రధాన కార్యదర్శి), అబ్రహం లింకన్ (IFTU ప్రెసిడెంట్), జి. ప్రసాద్ (APCITU  ప్రెసిడెంట్), కె. ఉమామహేశ్వరరావు (AP CITU ప్రధాన కార్యదర్శి), జి.రఘురామరాజు (TNTUC రాష్ట్ర ప్రెసిడెంట్),  శ్యామ్ (TNTUC ప్రధాన కార్యదర్శి), మధుబాబు (AP MEWU రాష్ట్ర ప్రెసిడెంట్),  ఆంజనేయులు (AP MEWU రాష్ట్ర ప్రధాన కార్యదర్శి), GVRKH వరప్రసాద్ (AICTU రాష్ట్ర అధ్యక్షులు),  కె. శ్రీనివాసరావు (AICTU జనరల్ సెక్రటరీ) తదితరులు పాల్గొన్నారు. 

మున్సిపల్ కార్మికుల సమ్మె
ఏపీ వ్యాప్తంగా పారిశుద్ధ్య కార్మికులు డిసెంబర్ 26 నుంచి నిరవధిక సమ్మె చేపట్టారు. పారిశుద్ధ్య, ఇంజినీరింగ్ కాంట్రాక్ట్‌ సిబ్బంది, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది ఈ సమ్మెలో పాల్గొంటున్నారు. దాంతో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు మొగ్గుచూపారు. అంటు వ్యాధులు వ్యాపించే సీజన్ కావడంతో ఏపీ ప్రభుత్వంపై రోజురోజుకూ ఒత్తిడి పెరుగుతోంది.  సమాన పనికి సమాన వేతనం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ సహా 13 డిమాండ్లను నెరవేర్చాలని వారు సమ్మె చేస్తున్నారు. అంగన్వాడీ సంఘాల తరహాలోనే మున్సిపల్ కార్మిక సంఘాల ప్రతినిధులతో తొలి దఫా చర్చలు విఫలమయ్యాయి. రెండోసారి మున్సిపల్ కార్మిక సంఘాలతో ఏపీ ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. దాంతో పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కొనసాగనుంది.

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని మున్సిపల్ కార్మికులు డిమాండ్‌ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తమ వేతనం సైతం 26 వేల రూపాయలకు పెంచాలని డిమాండ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం రూ.15వేల వేతనం ఇస్తున్నారు. పని ఒత్తిడి, అనారోగ్య సమస్యల కారణంగా.. కార్మికుల సంఖ్యను పెంచాలన్న డిమాండ్‌ను కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆరోపిస్తున్నారు. మరోవైపు వేతనం పెంచాలన్న డిమాండ్ ను నెరవేర్చుకోవాలని పారిశుధ్య కార్మికులు సమ్మెకు దిగారు. తమ డిమాండ్లకు ఏపీ ప్రభుత్వం అంగీకరించకపోవడంతో, తమ సమస్యలు తీరే వరకు సమ్మె కొనసాగించాలని కార్మిక సంఘాలు భావిస్తున్నాయి.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Warangal Crime News Today: వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
వరంగల్‌లో దారుణం- ఇన్ఫార్మర్ నెపంతో ఇద్దర్ని చంపిన మావోయిస్టులు 
Adilabad Tiger News: ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
ఆదిలాబాద్ జిల్లాలో పులుల సంచారంతో ఉపాధి కోల్పోతున్న రైతులు
Pushpa 2: యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
యూట్యూబ్‌ షేక్ అవ్వాలంతే... 'పుష్ప 2'లో శ్రీ లీల స్పెషల్ సాంగ్ 'కిస్సిక్' రిలీజ్ డేట్, టైమ్ ఫిక్స్
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Embed widget